Trinayani Today Episode గాయత్రీదేవి ఆత్మని పట్టుకోవడం ఎందుకని లలితాదేవి తిలోత్తమను ప్రశ్నిస్తుంది. ఆత్మ విమోచనం చేస్తానని తిలోత్తమ చెప్పడంతో లలితాదేవి తిలోత్తమ మీద కోప్పడుతుంది. సర్పదీవికి వెళ్లి వచ్చినప్పుటి నుంచి మతి భ్రమించిందా అని ప్రశ్నిస్తుంది. తిలోత్తమ సైలెంట్ అయిపోతుంది. 


 


హాసిని: చెల్లి నువ్వు రివాల్వర్ గురి పెట్టింది ఎవరికి. 
నయని: మీరు చూశారుగా లలితాదేవి అమ్మగారికే గురిపెట్టాను.
లలితాదేవి: షాక్ అవుతూ.. మనసులో.. నయని ఇలా అంటుంది అంటే ఏదో విషయం దాచిపెడుతుంది అనిపిస్తుంది. ఆ నిజాన్ని అమ్మవారి సాక్షిగానే బయట పెట్టాలి.
విక్రాంత్: అది కాదు వదిన పెద్దమ్మ ఇప్పుడే వచ్చాను అంటున్నారు. నిన్న మొన్న పెద్దమ్మ ఇంట్లో ఉన్నారు అంటే నేను రాలేదు అంటున్నారు. మీరేమో ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తా అన్నట్లు గన్ గురి పెట్టారు. మరి ఇందంతా ఏంటి. 
విశాల్: నయని చెప్పు కళ్ల ముందు కనిపించేది ఏంటి.
తిలోత్తమ: భ్రమ. లలిత అక్క వచ్చారు అనుకున్నారు మీరు కానీ తను రాలేదు. 
సుమన: రెండు రోజులు ఉన్నారు కదా అత్తయ్య.
నయని: తిలోత్తమ అత్తయ్య లేరు కాబట్టి పెద్దమ్మ గారు ఉండగలిగారు అంతే కదా అత్తయ్య.
తిలోత్తమ: నయని అత్తయ్య ఇంటికి వచ్చారు ముందు తన బాగోగులు చూడండి.
లలితాదేవి: నన్ను సేవించడం కాదు కానీ ముందు అమ్మవారిని పూజిద్దాం. విశాల్ ఆ ఏర్పాట్లు చూసు నాన్న.


సుమన: (విక్రాంత్‌ సుమనలు గదిలో ఉంటే హాసిని అక్కడికి వస్తుంది.) లలితాదేవి అత్తయ్య ఇప్పుడే వచ్చాను అంటుంది. మరి నిన్నా మొన్న చేతికి కట్టు కట్టుకొని మనతో ఉన్నది ఎవరు. మా అక్క తనకి ఎందుకు రివాల్వర్ పెట్టిందో అని ఆలోచిస్తున్నాను.
విక్రాంత్: అంతా భ్రమే అని మా అమ్మ అంది అంటే అందులో ఏదో చిక్కు ఉందని అనిపిస్తుంది. 
హాసిని: నిజమే విక్రాంత్ ఎందుకంటే చెల్లిని అంత కంటే ఏం చెప్పకుండా హడావుడిగా పనులు పురమాయిస్తూ హాల్‌ నుంచి వెళ్లిపోయింది మీ మమ్మీ.
సుమన: పాపం ఆవిడను ఎందుకు అంటున్నారు.
విక్రాంత్: మా అమ్మని వెనకేసుకొని వస్తున్నావా నువ్వు నిన్ను ఏదో ఒక కేసులో ఇరికించేస్తుంది. 
సుమన: ఎందుకు అలా అంటున్నారు.
విక్రాంత్: మూడు మర్డర్ కేసులున్న గంటలమ్మతో స్నేహం చేస్తుంది మా అమ్మ. తేడా వస్తే ఒక కేసు నెత్తిమీద రుద్దేస్తారు కూడా. 
హాసిని: తిలోత్తమ అత్తయ్య ఏదో ఆశించి గంటలమ్మని ఇంటికి తీసుకొస్తుంది. పెద్దత్తయ్య ఆత్మని బంధించాలి అని చూస్తున్నారు. నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. నిన్నా మొన్న లలితాదేవి అత్తయ్యలా వచ్చింది కూడా ఏదో ఒక ఆత్మే అని అనిపిస్తుంది. 
సుమన: ఆత్మ అయితే మా అక్కకి తప్పా ఇంకెవరికీ కనిపించదు కదా అక్క.
హాసిని: ఇది కూడా పాయింటే. అయితే భ్రమే అనుకుందామా.
విక్రాంత్: నా అంచనా ప్రకారం ఎవరో పెద్దమ్మలా రూపం మార్చుకొని వచ్చుండొచ్చు. భ్రమ కాకపోతే నా అనుమానమే నిజం అనుకోవచ్చు. 


విశాలాక్షి అమ్మవారి పూజకు ఇంట్లో ఏర్పాట్లు చేస్తారు. అందరూ చేరుకొని దండం పెట్టుకుంటారు. లలితాదేవి నయనికి పసుపుతో చేసిన ఒత్తులు అడుగుతుంది. పత్తితో చేయకుండా పసుపు గుడ్డతో ఒత్తులు చేశారెందుకని సుమన అడుగుతుంది. ఇక అందరూ ఒత్తులతో దీపాలు పెడితే కలిగే ఫలితాలు చెప్తారు. తిలోత్తమ పూజకు దూరంగా ఉంటే లలితాదేవి దగ్గరకు రమ్మని పిలుస్తుంది. తిలోత్తమ రావడానికి ఇష్టపడదు. ఇక రాకూడదు అనేస్తుంది తిలోత్తమ. పర్వాలేదు రా అని లలితాదేవి అంటుంది. 


నయని: రాక తప్పదు అత్తయ్య ఎందుకంటే కొత్త బట్టతో పసుపు ఒత్తి చేసి పెడుతున్నారు కదా. 
తిలోత్తమ: పెడితే ఏమవుతుంది. ఏం జరగబోతుంది. 
సుమన: ఎందుకు అత్తయ్యను కంగారు పెడుతున్నారు. 
విశాల్: అమ్మ రండి.. జ్యోతి వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోవాలి కదా.
లలితాదేవి: వస్తావా ఎత్తుకొని రమ్మంటావా.
తిలోత్తమ: మనసులో.. అమ్మవారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకుంటే వీళ్లు సడెన్‌గా పూజలు పెట్టి నన్ను చంపేసేలా ఉన్నారు.
విశాల్: అమ్మ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా రండి. 
లలితాదేవి: తిలోత్తమ ఈ పసుపు ఒత్తిని పసుపులా ముంచు.
తిలోత్తమ: నేనా అక్కయ్య.
లలితాదేవి: తప్పు వామ హస్తాన్ని ఉపయోగించకూడదు.  కుడి చేయి ఉపయోగింది.
తిలోత్తమ: క్షమించాలి అక్క గాయమైన ఈ చేతితో నేను ఏం చేయలేను.
విక్రాంత్: గ్లౌజ్ తీసేయాల్సి వస్తుందని అమ్మ నామూషిగా ఫీలవుతున్నట్లుంది.
తిలోత్తమ: అమ్మ గ్లౌజ్ తీయకుండా పసుపు ఒత్తిని ప్రమిదలో ముంచొచ్చా.
లలితాదేవి: సరే తీసుకో..


తిలోత్తమ కుడి చేయి వణుకుతూనే పళ్లెంలో క్లాత్‌తో చేసిన ఒత్తులు ముట్టుకోగానే అవి అంటుకొని మంట వస్తుంది. అందరూ బిత్తర పోతారు. ఆ మంట అత్తయ్య చేతి నుంచే రావాలి అని నయని అంటుంది. 



లలితాదేవి: ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది. ఏ ఒక్క దానికైనా సమాధానం రావాలి.
తిలోత్తమ: నాకు అర్థం కావడం లేదు అక్క. నా చేతిలో అగ్గి పెట్టి కూడా లేదు.
విశాల్: మనం ఎన్ని అనుకున్నా లాభం లేదు. అమ్మే చెప్పాలి.
లలితాదేవి: నీ చేతికి ఏమైందో చెప్పు పోనీ.
తిలోత్తమ: గాయం అయింది అక్క.
నయని: చిన్న దానికి ఇన్ని రోజులు ఉండదు కదా గాయం.
వల్లభ: నాకు తెలిసి అమ్మ అమ్మవారి దగ్గరకు వెళ్ల కూడదు అన్నా సరే దగ్గరగా వచ్చింది కదా. అయినా సరే మీరు పూజ చేయమన్నందుకు అమ్మవారు ఆగ్రహించింది అనుకుంటా. 
లలితాదేవి: నీకు తెలివి ఉంది వల్లభ. నయని తను వద్దన్నా సరే మనం పూజ చేయించాం కదా అందుకే ఇలా అయింది అనుకుందాం.
తిలోత్తమ: అవును అక్క.



ఇక లలితాదేవి నయనికి కంకనం ఇచ్చి తిలోత్తమ కుడి చేతికి కట్టమని అంటుంది. తిలోత్తమ కంగారుగా ఎందుకని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మి ఫొటో మిత్ర దగ్గర చూసేసిన లక్కీ.. త్వరలోనే లక్ష్మిని భార్యగా చేసుకుంటానన్న అర్జున్!