Trinayani Today Episode ఉలూచి కాళ్ల గాయాలు తగ్గిస్తానని పెద్దబొట్టమ్మ పసుపు తీసుకొని వచ్చి రాస్తుంది. దాంతో ఉలూచి పాములా మారిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. సాక్సులు తీసినందుకే అలా అయిందని విశాల్ అంటాడు. సాక్సులు తీయొద్దన్నాను కదా అని తిలోత్తమ సుమనతో అంటుంది.
సుమన: వీళ్లే కదా అత్తయ్య నయం అవుతుందని పసుపు రాయించారు.
పెద్దబొట్టమ్మ: పెద్దగా నవ్వుతూ.. సాక్సులు తీస్తే పాము పిల్లగా మారుతుందని మీకు తెలిసినా ఆ విషయం మర్చిపోయారు నయని. ఇప్పుడు ఉలూచి పాము పిల్లలా మారిపోయింది. మళ్లీ ఆడపిల్లలా ఎవరు మారుస్తారు.
విశాల్: అంటే ఇలా మారాలి అనే పసుపు రాశావా పెద్దబొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: అవును విశాల్ బాబు. పసుపు రాస్తే నయం అవుతుందని నేను అబద్దం చెప్పాను. సుమన కోపంగా లోపలికి వెళ్తుంది.
తిలోత్తమ: ఇక పాము పిల్లగానే ఉండిపోతుందా ఉలూచి.
పెద్దబొట్టమ్మ: లేదు తను తిరిగి ఆడపిల్లలా మారాలి అంటే విశాలాక్షి అయినా తిరిగి రావాలి లేదంటే నేను అయినా మార్చాలి.
విక్రాంత్: ఆ పని చేయి పెద్దబొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: కాసేపు అయినా ఇలా ఉన్ని బాబు నాతో నా బిడ్డ కొద్ది సేపు అయినా ఆడుకుంటుంది. తన ఆలనా పాలనా చూసుకుంటాను.
సుమన లోపల నుంచి కర్ర తీసుకొని వచ్చి పెద్దబొట్టమ్మ తలమీద కొట్టేస్తుంది. పెద్దబొట్టమ్మ కళ్లు తిరిగి పడిపోతుంది. చంపేస్తానని సుమన అంటే నయని, విక్రాంత్ ఆపుతారు. తన బిడ్డ మళ్లీ ఆడపిల్లలా మారేది ఎప్పుడని ఏడుస్తుంది. తన బిడ్డని మళ్లీ ఆడపిల్లలా మార్చకపోతే ఈ ఇంట్లో నుంచి పెద్దబొట్టమ్మ శవం వెళ్తుందని సుమన సీరియస్‌గా అంటుంది. విక్రాంత్ సుమన వెనకాలే వెళ్లి రౌడీ అనుకుంటున్నావా అని తిడతాడు. ఉలూచిని ఆడపిల్లలా మార్చకపోతే మాత్రం పెద్దబొట్టమ్మని ఉంచనని అంటుంది. మరోవైపు పెద్దబొట్టమ్మని సోఫా మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లి అందరూ లేపుతారు. పెద్దబొట్టమ్మ లేవదు. విక్రాంత్ వచ్చి డాక్టర్‌ని పిలుద్దామని అంటాడు. ఇంతలో ఎవర్నీ పిలవక్కర్లేదని చేతిలో నిప్పు పట్టుకొని సుమన వస్తుంది.
నయని: సుమన ఎందుకు మంట అంటుకున్న కర్ర పట్టుకొని వచ్చావ్.
విశాల్: సుమన ఏమైంది నీకు.
సుమన: మీరంతా కలిసి నేను రాకముందే పెద్దబొట్టమ్మని లేపి పంపేయాలి అని చూస్తున్నారు కదా.
నయని: నువ్వు కొట్టిన దెబ్బకి పెద్దమ్మ ప్రాణం పోతుందేమో అని లేపే ప్రయత్నం చేస్తున్నాం అంతే.
తిలోత్తమ: తను లేవగానే ఆగుతుందా పాముగా మారిపోయి ఇక్కడి నుంచి పారిపోతుంది.
వల్లభ: పాము పిల్లగా మారిన ఉలూచి పరిస్థితి ఏంటి ఇక అలాగే ఉండాలా.
పావనా: అమ్మ అసలు ఎందుకు నిప్పు తీసుకొచ్చావ్.
సుమన: పెద్దబొట్టమ్మకు చితి పెడదామని.
నయని: ఏయ్ పిచ్చా నీకు తను ఇంకా ప్రాణాలతో ఉంది.
తిలోత్తమ: అయితే ప్రాణాలు పోయే వరకు ఆగండి. అంతే కదా నాన్న. తను ప్రాణంగా చూసుకునే కూతురు పాములా మారితే సుమన పరిస్థితి ఎలా ఉంటుంది.
వల్లభ: అసలే ఆస్తి పోగొట్టుకున్నానని బాధలో ఉంది.
సుమన నిప్పు పెడతాను అని అంటే అందరూ సుమనను తిడతారు. సుమన మంట పెడతానని వస్తే నయని అడుగు ముందుకేస్తే చచ్చిపోతావ్ అని అంటుంది. కాలు ముందుకు వేస్తే నాగయ్య కాటేస్తాడని అక్కడికి వచ్చిన నాగయ్య పాముని చూపిస్తుంది. కోపంతో సుమన ముందు నాగయ్య పాముకే చితి పెడతానని నిప్పు పెట్టబోతే పెద్దబొట్టమ్మ లేచి అంత పని చేయకు సుమన అని రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. తన భర్తని ఏం చేయొద్దని ఏడుస్తుంది. నాగయ్యని కాల్చాలని చూస్తే తన బిడ్డ ఉలూచిని కూడా చంపాల్సి ఉంటుందని నాగయ్య పాము మీద ఉన్న ఉలూచి పాముని చూపిస్తాడు విశాల్. సుమనతో పాటు అందరూ షాక్ అయిపోతారు. భార్యని కాపాడాలని భర్త, తల్లిదండ్రులను కాపాడాలని ఉలూచి వచ్చిందని నయని అంటుంది. ఇక వల్లభ కాల్చేయ్ మంటే తిలోత్తమ వల్లభను కొడుతుంది. తన వల్ల ఉలూచి పాదాలు కాలిపోయావని గిల్టీగా ఉంటే నాగుపాములను సజీవంగా ఉన్నప్పుడు చంపమంటావా అని తిడుతుంది. తన తల్లి రివర్స్ అయిందంటే ఏదో ప్లాన్ వేసుంటుందని వల్లభ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.