Jagadhatri  Serial Today Episode: కౌషికి చెప్పడంతో ధాత్రి, కాచి రూంలోకి  కేదార్‌ బూచి రూములోకి వెళ్తారు. అక్కడ వాళ్లు నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు. కేదార్‌ బూచి మీద కాలు వేసి ముద్దులు పెడుతుంటే బూచి, కేదార్‌ను బయటకు పంపిస్తాడు. కాచి గురక తట్టుకోలేక ధాత్రి బయటకు వస్తుంది. తర్వాత అందరూ కలిసి ఎవరి రూముల్లో వాళ్లు పడుకోవాలని డిసైడ్‌ అవుతారు. ధాత్రి మాత్రం సోపాలో పడుకుంటుంది. తర్వాత వైజయంతి, నిషిక దుబాయ్‌ ఎలా వెళ్లాలో ఆలోచిస్తుంటారు. మరోవైపు ధాత్రి, కేదార్‌ యువరాజ్‌ గురించి ఆలోచిస్తారు.


ధాత్రి: ఏంటి మాస్టారు పొద్దునే ఏదో తెగ ఆలోచిస్తున్నారు.  


కేదార్‌: యువరాజ్‌ గురించి ధాత్రి. యువరాజ్‌ దొరికితే  కానీ మన సమస్యలకు ఒక పరిష్కారం దొరకదు. యువరాజ్‌ చేయి వరకు వచ్చి చేజారిపోతున్నాడు. యువరాజ్‌ ఎక్కడున్నాడో తెలియదు. ఏం ప్లాన్‌ చేస్తున్నాడో తెలియదు.


ధాత్రి: పారిపోతున్నవాడి వెనకాలే పరిగెడితే మనం ఎప్పటికీ వెనకే ఉండిపోతాం కేదార్‌. మనం పరిగెట్టకూడదు. యువరాజ్‌ మన వైపు రావాలి. అప్పుడే మనం పట్టుకోగలం.


కేదార్‌: నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ధాత్రి.


ధాత్రి: యువరాజ్‌ అజ్ఞాతం నుంచి బయటకు రావాలంటే పొగ పెట్టాలి. అప్పుడే దొరకుతాడు. ఒక చిన్న అవకాశం దొరికితే చాలు యువరాజే మన దగ్గరకు పరిగెత్తుకు వచ్చేలా చేస్తాను.


కేదార్‌: ఆ అవకాశం త్వరగా వస్తే బాగుండు ధాత్రి. ఆలస్యం అయితే యువరాజ్‌ మళ్లీ దేశం వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు.


  అని కేదార్‌ అనగానే అంత టైం యువరాజ్‌కు ఇవ్వనని ధాత్రి చెప్తుంది. నిన్నటి షాక్‌ నుంచి తేరుకునే లోపే మరో షాక్‌ ఇస్తే తనే మన ఉచ్చులో చిక్కుకుపోతాడు అంటుంది ధాత్రి. తర్వాత ధాత్రి అందరికీ కాఫీ ఇస్తుంది. కౌషికి కాఫీ తాగుతుంటే ఆఫీసు నుంచి రఘురాం వచ్చి వైజాగ్‌ షిప్‌యార్డులో 50 కోట్ల విలువ చేసే కంటెయినర్స్‌ ఆగిపోయాయని రెండు రోజుల్లో వాటిని డెలివరీ చేయకపోతే బెనర్జీ కంపెనీకి 50 కోట్లు కట్టాలని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. అది యువరాజ్‌ చూసేవాడని ఇప్పుడెలా అని  కౌషికి ఆలోచిస్తుంటే..


ధాత్రి: యాభై కోట్లు కట్టడమంటే కంపెనీ పూర్తిగా లాస్‌లోకి వెళ్లిపోతుంది కదా వదిన. ఇన్ని రోజుల పడ్డ కష్టం అంతా వృథా అయిపోతుంది.


కేదార్‌: ఈ విషయం మార్కెట్‌లో తెలిస్తే కంపెనీ పరువు కూడా పోతుంది. షేర్స్‌ పడిపోతాయి. కంపెనీ వాల్యూ కూడా పడిపోతుంది.


కౌషికి: అందరికీ మన మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది.


సురేష్‌: యువరాజ్‌ కంపెనీకి సీఈవో కనుక యువరాజ్‌ వచ్చి సైన్‌ చేయకపోతే డబ్బు నష్టంతో పాటు పరువు కూడా పోతుందన్నమాట


నిషిక: అంటే ఇప్పుడు యువరాజ్‌ వచ్చి సైన్‌ చేస్తే సమస్యేమీ ఉండదా?


కేదార్‌: అవును నిషిక ప్రాబ్లమ్‌ ఏమీ ఉండదు.     


ధాత్రి: యువరాజ్‌ ఎక్కడోప్రాణాలతో ఉన్నాడని తెలిసింది కాబట్టి ఈ విషయం ఎవరైనా యువరాజ్ కు తెలియజేస్తే కచ్చితంగా యువరాజ్ కంపెనీ పరువు, డబ్బులు కాపాడటం కోసం ఎలాగైనా వస్తాడని అనిపిస్తుంది.


 అనగానే నిషిక, కమలాకర్‌ వైపు చూస్తూ సైగ చేస్తుంది. కమలాకర్‌ వద్దని సైగ చేస్తాడు. ఇంతలో ఈ సమస్యకు కొత్త సీఈవోను అనౌన్స్‌ చేస్తే సరిపోతుందని సుధాకర్‌ చెప్పగానే కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా మీ కొడుకే ఉండాలి కదా బాబాయ్‌ అని కేదార్‌ను సీఈవోగా చేసి కేదార్‌తో సైన్‌ చేయిస్తే అయిపోతుంది అంటుంది కౌషికి. దీంతో వైజయంతి, నిషిక, కమలాకర్‌ వద్దని వారిస్తారు. గొడవ చేస్తారు. మేం ఊరుకోమని వార్నింగ్‌ ఇస్తారు. దీంతో యాభై కోట్ల నష్టం మీరే బరించాలని తర్వాత కంపెనీకి ఏ నష్టం వచ్చినా మీరే బాధ్యత తీసుకోవాలని కౌషికి చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. మాకు కొంచెం టైం కావాలని బయటకు వెళ్లిపోతారు. యువరాజ్‌కు ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్తారు. దీంతో యువరాజ్‌ నా ప్లేస్‌ లోకి ఎవరొచ్చినా చంపేస్తానని అంటాడు. మరోవైపు సుధాకర్‌ అన్ని ఆలోచిస్తేంటే హార్ట్‌ స్ర్టోక్‌ వస్తుంది. కేదార్‌ వచ్చి సేవ్‌ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.   


ALSO READ: ‘పొలిమేర 3’ నిర్మాతపై ‘పొలిమేర 2’ నిర్మాత ఫిర్యాదు - చంపాలని బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు