Trinayani Today Episodes: సుమన ఉలూచిని తీసుకొని విశాలాక్షి దగ్గరకు వస్తుంది. ఇంతలో ఎద్దులయ్య, డమ్మక్క హడావుడిగా వచ్చి అమ్మ ధ్యానంలో ఉంది ఇబ్బంది పెట్టొద్దని అంటారు. సుమన విశాలాక్షిని పిలిచి కిచెన్‌లో పాలు ఉన్నాయి తీసుకొనిరా అని చెప్తుంది. ఇక విక్రాంత్ వచ్చి సుమన తిడతాడు.


తిలోత్తమ: రేయ్ నీకు సుమన అంటే పడకపోవచ్చు. కానీ నువ్వు ఇలా మాట్లాడితే తను అనే మాటలు నువ్వు పడతావా. 
విశాలాక్షి: పాలు దగ్గరకు వెళ్లి.. అయ్యో సుమన నా మీద నింద వేయడానికి ఇంత విషం ఇందులో వేయాలా.. అబద్దం చెప్పినా చాలేది కదా.. ఇంత క్రూరత్వాన్ని మనసులో నింపుకొని మనిషిగా ఎలా బతుకుతున్నావ్. సుమన పాలు తీసుకొని వచ్చాను ఉలూచికి పట్టు.
సుమన: ఒక్క నిమిషం ఆగు ఏం చేసి వచ్చావ్ కిచెన్‌లో.. 
విశాలాక్షి: నేనేం చేస్తాను.
సుమన: లేదు లేదు ఏదో చేసి వచ్చావ్. 
నయని: చెల్లి ఎందుకు అలా మాట్లాడుతావ్ విశాలాక్షి ఏం చేస్తుంది.
విశాల్: తనకి ఏ పని చెప్పం కూడా.
సుమన: మీరు చెప్పరు బావగారు కానీ నేను పాలు తీసుకొని రమ్మంటే అవునవును నాకు అక్కడ పని ఉంది అని చెప్పి వెళ్లింది. 
పావనా: అంత మాత్రానా నెగిటివ్‌గా ఆలోచిస్తావ్ ఏంటి అమ్మా. 
సుమన: నా బిడ్డ ఆఫీస్‌లో ఉన్నట్లు ఇంట్లో ఉన్నట్లు చేసిన ఈ గారడీ పిల్ల నా బిడ్డ పూర్తిగా లేకుండా చేస్తుంది ఏమో. 
నయని: నోరు మూసుకో అర్థం లేకుండా మాట్లాడకు.
సుమన: అర్థం లేకపోవచ్చు కానీ ఆ పాలలో ఇంకేదో ఉంటుంది.
విక్రాంత్: ఏముంటుంది.
ఎద్దులయ్య: విషం..
సుమన: అవును అందులో విషం కలిపే ఉంటుంది ఈపిల్ల. 
విశాల్: విశాలాక్షి కామ్‌గా ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఊరుకోరు.
సుమన: ఆ పాలలో కచ్చితంగా విషం ఉంటుంది.
విశాలాక్షి: అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావ్ సుమన నువ్వు ఏమైనా కలిపావా. 
విక్రాంత్: ఉలూచి పాప తాగే పాలలో విషమే కలిపారు అనుకో అయినా తనకి ఏం కాదు ఎందుకు అంటే తనొక పాము. 
సుమన: బుద్దుందా మీకు రాత్రి అంటే తనొక పాము ఉదయం మాత్రం ఆడపిల్లే కదా. అప్పుడు వేపాకు రసం అయినా ఉమ్మేస్తుంది. విషం పాలు ఎలా తాగుతుంది.
నయని: అసలు అందులో విషం ఉంది అంటున్నావ్ నీకు ఎలా తెలుసు. 
విశాల్: విషం కలపడం నువ్వు చూస్తే చెప్పు సుమన.
సుమన: నాకు తన మీద అనుమానంగా ఉంది.
ఎద్దులయ్య: అమ్మ విషం ఉందని నింద వేస్తుంది చిట్టీ మాత.  నువ్వుం మంటావ్.
విశాలాక్షి:  తన మాట ఎందుకు కాదు అనాలి కొంచెం ఓపిక పడితే తెలుస్తుంది. 
హాసిని: ఇవన్నీ కాదు కానీ సింపుల్ లాజిక్ మర్చిపోయి అరిచేస్తున్నారు అంతా. అందులో విషం ఉంటే ఉలూచి పాపకి తాగించబోతే వెంటనే నయని చెల్లి గ్రహించి ఆ పాలు తాగించొద్దు అనేది కదా. అయినా నీ ప్రాబ్లమ్ ఏంటి చిట్టీ. ఆ పాలలో విషం ఉంది అంటే అవి పారేసి ఇంకో పాలు తాగించు అయిపోతుంది కదా.. 
తిలోత్తమ: అలా ఎలా అవుతుంది. దుర్మార్గపు ఆలోచన చేసిన విశాలాక్షిని వదిలేయ్ మంటారా..
విశాల్: అమ్మా నిజం తెలీకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడి చిన్న పిల్ల ముందు మర్యాద పోగొట్టుకోవద్దు. 
విశాలాక్షి: సుమన ఇందులో నేను అయితే విషం కలపలేదు.
సుమన: ఇంకెవరు కలుపుతారు.
విశాలాక్షి:  నువ్వు. 
హాసిని: చిట్టీ ఏంటిది నువ్వే విషం కలిపి నీ బిడ్డకు తాగించాలి అనుకుంటున్నావా. 
వల్లభ: ఏ గారడీ పిల్ల తమాషాగా ఉందా..
విశాలాక్షి: ఇది తమాషానే కదా తప్పు ఒకరిది శిక్ష ఇంకొకరికా..
ధురందర: ఆ పాలు తెచ్చింది నువ్వే కదా అమ్మ మా సుమనను అంటావే.
నయని: లేకపోతే ఏంటి పిన్ని ఇంకాటన్నుంచి విశాలాక్షిని అంటుంటే తనకు కోపం రాదా.. బాధతో అయినా అలా అనుండొచ్చు.
విశాలాక్షి: అమ్మ ఇవి పాలు అని నేను తీసుకొచ్చాను కాదు విషం అని నీ చెల్లి అంటుంది. అలాంటిదేదైనా ఉంటే నువ్వు గ్రహించి ఇవి విషం కలిపిన పాలే అని చెప్పేదానివే కదా.. చెప్పలేదు అంటే ఇవి పాలు కానీ విషం కాదు కదా..
నయని: అవును.
సుమన: తను కాదు నువ్వు చెప్పు.. అందులో విషం లేదు కదా..
నయని: అవును లేదు.
సుమన: అత్తయ్య, హాసిని అక్క, విశాల్ బావగారు. మీరందరూ సాక్ష్యం ఎవరికైనా ప్రాణ హాని కలిగుతుంది అని అనిపిస్తే మా అక్కకి ముందే తెలుస్తుంది. బుల్లిబావగారు పాపని పట్టుకోండి ఆ పాలు ఇటు ఇవ్వు. అని తాగేస్తుంది. మనసులో.. విషం పాలు తాగేశాను నేను చస్తానో బతుకుతానో తెలీదు కానీ ఇవాళ విశాలాక్షిని కాదు మా అక్కని కూడా అందరూ ద్వేషిస్తారు. నాకు కావల్సింది కూడా అదే. ఇంతలో సుమన నురగ కక్కుకొని కింద పడిపోతుంది. 
విశాల్: ఏయ్ ఒకవేళ దానిలో నిజంగానే విషం ఉందేమో.. 
వల్లభ: మమ్మీ గారడి  పిల్ల నీ చిన్న కోడల్ని చంపేసింది మమ్మీ.
తిలోత్తమ: సుమన అనుమానిస్తూనే ఉంది ఎవరూ వినలేదు. ఇక సుమనను హాస్పిటల్‌కి తీసుకెళ్తారు.
విశాలాక్షి:  అమ్మా.. 
నయని: దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో.. 
ఎద్దులయ్య: అమ్మ తప్పు ఏం ఉంది మాతా.
నయని: ఇప్పుడేం చెప్పలేను. తను శ్రీశైలం వెళ్తుందో కైలాసానికి వెళ్తుందో వెళ్లిపోమను. అని దండం పెడుతుంది. విశాలాక్షి వెళ్లిపోతుంది. నయని గాయత్రీ దేవి ఫొటోతో.. అమ్మగారు మీ గత జన్మలో మీ ఆత్మని కూడా చూడగలిగాను నేను. మీతో మాట్లాడాను కూడా. అప్పుడు శూన్యాన్ని కూడా గ్రహించగలిగిన నేను ఇప్పుడు సుమనకు అలా జరిగినప్పుడు ఎందుకు చెప్పలేకపోయాను. 
విశాల్: నయని సుమనకు ఏమైనా అయితే అలా అవ్వడానికి కారణం నువ్వే అని జీవితాంతం అంటూనే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు నయని. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: చిరంజీవి: 'పద్మ విభూషణ్‌' చిరంజీవికి అమెరికాలో సన్మానం - ఈ వెకేషన్‌ అందుకేనా?