Trinayani Serial Today Episode:    రూంలోకి వెళ్లి నయని బాడీని చూసిన అందరూ షాక్‌ అవుతారు. వల్లభ గట్టిగా అరవడంతో విక్రాంత్‌ ఏమైంది బ్రో అంటూ పరుగెత్తుకొస్తాడు. చెల్లి ఎంటి ఇక్కడ పడుకుందని హాసిని అంటుంది. పడుకోలేదు హాసిని కన్నుమూసింది అంటుంది తిలొత్తమ్మ.. విక్రాంత్‌ మాత్రం అమ్మా ఏంటా మాటలు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు వదిన అంటుంది దురందర. అవును శాశ్వతంగా కన్ను మూసిందేమో అంటున్నాను అని తిలొత్తమ్మ అనగానే మీ అమ్మ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది కానీ ముందు చెల్లిని లేపండి అంటుంది హాసిని.


వల్లభ: ఏంటి లేపేది నిద్రా..?  పెద్ద మరదలు కోమాలో ఉందో శవంగా ఉందో తెలియడం లేదు.


గురువు: కోమాలోనే ఉంది వల్లభ.. ఆరోజు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న నయనియే ఇక్కడ అచేతనంగా పడి ఉంది హాసిని అంటాడు


దురందర: హాల్లో ఉంది కదా గురువు గారు


విక్రాంత్‌: ఇంకెక్కడ ఉంది. గాయత్రి పాప మా అమ్మవాళ్లను తీసకుని ఇక్కడకు రాగానే అక్కడ సంచి తీసుకుని ఉడాయించింది.


తిలొత్తమ్మ: నేను చెప్పానా..? ఎవ్వరూ నమ్మలేదు


సుమన: అవును అత్తయ్యా మీరు చెప్పినా ఎవ్వరూ వినలేదు.


తిలొత్తమ్మ: మిమ్మల్ని మాయ చేస్తుందంటే మీరు నా మాట విన్నారా..?


హాసిని: మాయ చేయలేదు.. మంచే చేసుకుంటు వచ్చింది ఎవరినీ మోసం చేయలేదు


దురందర: అలా అయితే ఆరోజు త్రినేత్రి ఇంట్లోంచి వెళ్లిపోయిందని రత్నాంభ చెప్పారు కదా


వల్లభ: ఎవరు చూశారు. మనవరాలు, బామ్మ కలిసి అలా నాటకం ఆడారేమో అంటాడు


విక్రాంత్‌: మనం ఏది పడితే అది ఊహించుకోకూడదు. కానీ ఏది ఏమైనా మా అమ్మ అనుమానమే నిజమైంది. అమ్మా హ్యాట్సాప్‌.. ఇక గురువు గారే తన తపశక్తిని ఉపయోగించి వదిన స్పృహలోకి వచ్చేలా చేయాలి


వల్లభ: ఆయన వల్ల అవుతుంది అంటారా..?


దురందర: ఏం మాట్లాడుతున్నావు అల్లుడు..  గురువు గారు ఇది మీ శక్తికి కాదు మా నమ్మకానికి పరీక్ష


గురువు: మీకు మీరే పందెలు పెట్టుకుని నన్ను శంఖిస్తున్నట్టు ఉంది


తిలొత్తమ్మ: అలా మాట్లాడకండి గురువు గారు మీరే ఏదో ఒకటి చేయాలి


గురువు: అలాగే కాస్త ఓపికగా చూడండి అమ్మవారి కృపాకటాక్షం నయని మీద ఉందో లేదో చూడాలి.


విక్రాంత్‌: కచ్చితంగా ఉంటుంది. మా వదిన అమ్మవారి భక్తురాలు.


  సరే అంటూ గురువు.. నయని దగ్గరకు వెళ్లి నుదుటి మీద బొటనవేలు పెట్టి మంత్రిస్తాడు. నయని మెల్లగా కదులుతూ కళ్లు తెరుస్తుంది.


దురదర: విక్కి.. నయని స్పృహలోకి వస్తుంది


విక్రాంత్‌: అత్తయ్యా నువ్వు నేను నయని వదినతో పాటు గురువు గారు, చివరికి గాయత్రి పాప కూడా బ్రహ్మాండంగా నటిస్తున్నాం.


  అని మనసులో అనుకుని తాము ఆడిన నాటకం గుర్తు చేసుకుంటాడు మళ్లీ ఏమీ తెలియనట్టు ఉంటాడు విక్రాంత్‌.   నయని దగ్గరకు హాసిని వెళ్లి చెల్లి అంటుంది. నయని కూడా అక్కా అంటూ హాసినిని హగ్‌ చేసుకుంటుంది. మమ్మీ గాయత్రి పెద్దమ్మకే కాదు పెద్ద మరదలుకు కూడా పునర్జన్మే అంటాడు వల్లభ. అందరూ హపీగా ఉంటే తిలొత్తమ్మ మాత్రం షాకింగ్‌లో ఉంటుంది. తర్వాత తిలొత్తమ్మ ఎలాగౌనా ఆ త్రినేత్రిని పట్టుకోవాలని ఆలోచిస్తుంది. ఆ నేత్రిని తీసుకొచ్చి నయని ప్లేస్‌లో పెట్టాలని ఇప్పటికే నయని ప్లేస్ లో ఉండి ఎంత వెనకేసిందో అంటుంది. వల్లభ వచ్చి ఏంటి మమ్మీ సొంత చెల్లి ముందు అక్కను చంపేస్తానంటున్నావు అంటాడు. ఆస్థులు వస్తాయంటే సొంత అక్క లేదు.. సొంత చెల్లి లేదురా అంటుంది తిలొత్తమ్మ.. సుమన కూడా అవును నాకు ఆస్తి వస్తే అక్కేంటి అంటుంది. అత్తయ్యా మీ ఐడియా ఏంటో చెప్పండి అని అడుగుతుంది సుమన. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!