Nindu Noorella Saavasam Serial Today Episode:    భాగీ వచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంది. అమర్‌ విషయం చెప్పగానే సరే లేండి మీరు అంత కోప్పడకండి అంజుకు నేను చెప్తాను అంటూ అంజును చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్తుంది. అంజులో ఉన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది. డాడీ అరిచారని బాధపడుతున్నావా  అని అడుగుతుంది. లేదని అంజు  చెప్తుంది. తర్వాత గార్డెన్‌లోకి వెళ్తుంది అంజు.


అంజు: ఇక్కడేం చేస్తున్నారు గుప్త గారు


గుప్త: మీ జనని ఎవరిలో ప్రవేశించో తెలియక ఆలోచించి.. ఆలోచించి ఇక్కడ విశ్రమించాను


అంజు: ఓహో అయినా ఇన్ని కష్టాలు మీకు ఎందుకు చెప్పండి భూలోకంలో మీరు ఎప్పుడూ లేరు కదా..? ఉన్నన్ని రోజులు హ్యపీగా చిల్‌ అవ్వండి.


గుప్త: అయినా మాకు అంతటి మహా భాగ్యము కూడానా.. మానవులతో ఉన్న  పాపానికి మెల్లగా మేము కూడా మానవులను అవుతామేమోనని భయంగా ఉంది.


అంజు: కష్టాలు వచ్చిన్నప్పుడే ధైర్యంగా ఉండాలి


గుప్త: పిల్ల పిచ్చుకవు అయినను నీవు (షాక్‌ అవుతూ) నీకు మేము కనిపిస్తున్నామా..?


అంజు: అవును కనిపిస్తున్నారు.


గుప్త: బాలిక నువ్వా…?


ఆరు: అవును బాలిక ఈజ్ బ్యాక్‌


గుప్త: ఎంత పని చేసితివి బాలిక యమధర్మరాజుల వారు కూడా నీవు చేయవలసింది చేయోద్దని చెప్పెను కదా


ఆరు: ఇన్ని రోజులు మీ మాటే కదా విన్నాను.


ఇంతలో మనోహరి వచ్చి నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అయినా ఇదిగో ఆరు ఆ ఘోర నువ్వు అంజులోకి ప్రవేశించాడని తెలుసుకున్నాడు. నిన్ను బంధించడానికి వస్తున్నాడు అని చెప్పగానే ఆరు కోపంగా ఆ ఘోన నుంచి నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు కానీ ఇవాళ నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తా అంటుంది.  మరోవైపు అమర్‌, ఆరు ఫోటో తీసుకుని వెళ్లి రామ్మూర్తికి ఇస్తాడు. ఫోటో చూసిన రామ్మూర్తి ఎమోషనల్‌ అవుతాడు. నా కూతురుని ఇలాగైనా చూసుకునే భాగ్యం కల్పించారు బాబు గారు అంటూ ఏడుస్తాడు. తనను ఎలాగూ తీసుకుని రాలేను.. కానీ తన జ్ఞాపకాలనైనా మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే ఫోటో తీసుకొచ్చాను అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు. అమర్‌ ఇంటికి రాగానే కాశీ గురించి అందరికీ చెప్తుంటాడు. ఇంతలో రాథోడ్‌ వస్తాడు.


రాథోడ్‌: మార్నింగ్‌ టైం ఫ్లైట్‌కు వారణాసికి  టికెట్స్‌ బుక్‌ చేశాను సార్‌.


మనోహరి:  అక్కడికి వెళ్లాక ఏ కారణం చేతనైనా ఆస్తికలు కలపడం లేటు కాకుండా చూసుకోమని అక్కడి పంతులుకు చెప్పు రాథోడ్‌.


భాగీ: అక్క వాళ్ల పేరెంట్స్‌ గురించి తెలిస్తే బాగుండు.. అక్క ఆస్తికలు కలపడానికి తీసుకెళ్తే బాగుండు


రాథోడ్‌: అందుకే కదా మిస్సమ్మ రామ్మూర్తి గారిని కూడా తీసుకెళ్తున్నాం.


భాగీ: ఏమన్నావు రాథోడ్‌


శివరాం: రాథోడ్‌.. మిస్సమ్మ.. ఆరు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే.. నువ్వు రామ్మూర్తి గారి గురించి అంటావేంటి..?


అమర్‌: అంటే మీ నాన్న ఆరును తన పెద్దకూతురు లాంటిది అన్నారు కదా అందుకే రాథోడ్‌ అలా అన్నాడు.


ఆనంద్‌: డాడ్‌ అమ్మకు ఇష్టమైన ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్దామా..?


మనోహరి: నేను కాకుండా మీ అమ్మకు మరో ఇష్టమైన ఫ్రెండ్‌ ఎవరు..?


అమ్ము: మా అమ్మకు ఆర్‌ జే అంటే చాలా ఇష్టం.


భాగీ: అవునా అక్కా ఏ ఫ్రోగ్రాం వినేది.. నేను కూడా ఆర్‌జే నే కదా..?


భాగీ అడగ్గానే నిజం తెలిసిపోతుందేమోనని అమర్‌ అడ్డుపడతాడు. అంజు ఎక్కడ అని అడుతాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి అందరూ అంజును వెతుకుతూ వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!