Trinayani Serial Today Episode:  విశాల్‌ షర్ట్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నయని చూసి బాధపడుతుంది. బాబు గారు అంటూ ఏడుస్తూ విశాల్‌ దగ్గరకు పరుగెత్తుకొస్తుంది. ఏంటిది ఇలా అయిపోయారు అని ఏడుస్తుంది. దీంతో విశాల్‌ నాకు ఏం కాలేదని అమ్మతో చెప్పమన్నాను కదా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు. దీంతో మీరు షర్ట్‌ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటూ ఎమోషన్‌ అవుతుంది. నయనిని విశాల్‌ ఓదారుస్తాడు. తర్వాత తిలొత్తమ్మ ఎవరికో ఫోన్‌ చేసి సాయంత్రం ఆరు గంటల లోపు అరెంజ్‌మెంట్స్‌ పూర్తి కావాలి అని చెప్తుంది.


దురందర: ఏ హాసు అన్ని అరెంజమెంట్స్‌ వదిన చేయిస్తుంది.


హాసిని: పని పాట ఏం లేదు కాబట్టి బాధ్యత తీసుకున్నారు.


వల్లభ: ఆ నువ్వు ఏమన్నా మా మమ్మీ ఈరోజు ఫీల్‌ కాదు. ఎందుకంటే ఇవాళ నా కొడుకు పుట్టినరోజు కాబట్టి.


హాసిని: గానవి, గాయత్రి కూడా ఈరోజే పుట్టారు మాస్టారు.  


తిలొత్తమ్మ: గానవి పుట్టిన రోజు కరెక్టు కానీ గాయత్రిది మాత్రం కాదు.


నయని: ఈరోజే అనుకుని సంబంరం జరుపుకుంటున్నప్పుడు మళ్లీ తేదీల గురించి చర్చ ఎందుకు అత్తయ్య.


వల్లభ: సంబరం అంట మమ్మీ విశాల్‌ బ్రోకు బాగా లేకపోయినా పెద్ద మరదలు తగ్గేదేలే అని ఫంక్షన్‌ జరుపుకుంటుంది.


హాసిని: హలో పుల్లెల పుల్లారావు జరిపించేది మీ అమ్మ.


 అనగానే మేము జరిపిస్తున్నామని మీరు ముభావంగా ఉండొద్దని తిలొత్తమ్మ నయనికి చెప్తుంది. అందరూ నవ్వు ముఖంతో ఉండండని చెప్తుంది. విశాల్‌కు బాగాలేకపోతే మీరు ఇంత యాక్టివ్‌ గా ఉంటారన్నమాట అంటుంది హాసిని. నువ్వలా అనకే ఎవరో ఒకరు నడిపించాలిగా అంటుంది దురందర. అయితే నేను నడిపిస్తానుగా మీరే చూడండి అంటుంది తిలొత్తమ్మ. మరోవైపు  సుమన రెడీ అవుతుంది.


విక్రాంత్‌: నువ్వు రెడీ అవ్వడం కాదు పిల్లలను రెడీ చేశావా లేదా..?


సుమన: ఏ పిల్లలు..


విక్రాంత్‌: ఎంత మంది పిల్లలు ఉన్నారని ఏ పిల్లా అంటున్నావు.. ఉలూచి పాపకు కొత్త డ్రెస్‌ వేశావా లేదా?


సుమన: తనది కాదు కదా పుట్టినరోజు గెస్ట్‌ రూంలో పడుకోబెట్టాను. ఇక్కడుంటే నన్ను రెడీ అవ్వనివ్వదని..


విక్రాంత్‌: అరె పిల్లల పుట్టినరోజు వేడుకని తను కూడా చూస్తుంది కదా.?


సుమన: అక్కర్లేదు.. చూసి తన బర్తుడేకు ఎందుకింత ఖర్చు చేయలేదని నా కూతురు అడిగితే ఎం చెప్తాము.


   అని సుమన అనగానే విక్రాంత్‌ వెటకారంగా సుమనను తిడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.  విక్రాంత్‌, సుమనను తిట్టి వెళ్లిపోతాడు. తర్వాత తిలొత్తమ్మ ఇల్లంతా డెకరేట్‌ చేయిస్తుంది. వల్లభ డెకరేషన్‌ చూసి ఆశ్యర్యపోతాడు. చాలా బాగా డెకరేట్‌ చేయించావని మెచ్చుకుంటాడు. ఇంతలో అందరూ వస్తారు. విశాల్‌ ను చూసి సుమన వెటకారంగా మాట్లాడుతుంది. విక్రాంత్‌, సుమనను తిడతాడు.


సుమన: అయ్యో మీరు ఫీల్‌ అవుతారేంటండి. నిజంగానే బావగారికి ఇంకో సమస్య వచ్చిందేమోనని పరామర్శించానంతే..


నయని: దేవుడి దయవల్ల ఇంకే సమస్య రాకూడదు. హాసిని అక్క త్వరగా రమ్మని కేక వేయడంతో హడావిడిలో పడిపోయేవారు. నేనే చేయి పట్టుకుని తీసుకొచ్చాను.


 అని చెప్పడంతో సుమన ఏదేదో మాట్లాడుతుంది. ఇంతలో హాసిని కూడా తింగరితింగరిగా మాట్లాడుతుంది. దీంతో అందరూ కన్పీజ్‌ అవుతారు. ఇంతలో నయని నేను ఆ మాట అన్నాను కానీ మాట తప్పలేదు అంటుంది. దీంతో వల్లభ పెద్ద మరదలా నువ్వు నీ తొలి బిడ్డను ఇక్కడికి తెచ్చావా? అని అడుగుతాడు. దీంతో నయని తెచ్చాను అంటుంది. అందరూ షాక్‌ అవుతారు. జోగయ్యాశాస్త్రి గారి మనవరాలే గాయత్రిదేవి గారు అని చెప్తుంది నయని. దీంతో విశాల్‌ నువ్వు చెప్పేది నిజమా? నీకు ఎలా తెలుసు అని అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి స్టేషన్ కు వెళ్లకుండా ఆపిన ధాత్రి – పరంధామయ్యను మర్డర్ చేసిన హంతకుల్ని పట్టుకున్న ధాత్రి