Trinayani Serial Today Episode:  గజగండ విశాల్‌ కు వైద్యం చేస్తుంటే గురువుగారు గట్టిగా విశాల్‌, నయని అంటూ ఇంట్లోకి వస్తుంటాడు. వెంటనే వల్లభ, గురువుగారికి ఎదురుగా వెళ్లి కళ్లల్లో పౌడర్‌ పడేలా చేస్తాడు. దీంతో గురువుగారు కళ్లు మండిపోతున్నాయని బాధపడుతుంటే వల్లభ.. గురువు గారిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు. స్వామి మీ కళ్లల్లో ఏదో దుమ్ము పడింది. నేను లోపలికి వెళ్లి నీళ్లు తీసుకురానా? అని నయని అడగ్గానే వద్దని కానీ నేను వచ్చింది మీకు ఏదో చెడు జరుగుతుందనే ఇక్కడికి వచ్చానని చెప్తాడు. విశాల్‌ కు ఎవరు వైద్యం చేసినా తగ్గదని గురువుగారు చెప్తారు.


విక్రాంత్‌: వైద్యం అంటే ఎలా చేస్తారు?


గజగండ: అమ్మవారి విబూదిని బాబు చేతికి రాయటమే..


గురువు: అమ్మవారి లీల వేరుగా ఉంటుంది. అనవసర ప్రయాస అనిపిస్తుంది.


విశాల్‌: చూద్దాం స్వామి మంచిగా అయితే సంతోషమే కదా?


గజగండ: ఈ విబూదిపై ఎవరికైనా చులకన బావం ఉంటే నేను ఏ వైద్యం చేయకుండా వెళ్లిపోతాను బాబు.


నయని: లేదు లేండి మీరు రాయండి.


గురువు: ప్రయోజనం లేదన్నాను ఆ తర్వాత మీ ఇష్టం.


తిలోత్తమ్మ: రాయండి నొప్పి పోతే చాలు కదా?


 అనగానే గజగండ విబూది తీసి విశాల్‌ చేతికి రాస్తాడు. నొప్పి తగ్గడానికి ఒక రోజు టైం పడుతుందని చెప్పి వెళ్లిపోతాడు గజగండ. తర్వాత విక్రాంత్‌, సుమన లోపలికి వెళ్తారు.


సుమన: ఏంటండి నేను ఎటు వెళ్తే అటే వస్తు్న్నారు.


విక్రాంత్‌: ఆ నీ వెంట పడటానికి నువ్వేమైన స్వప్న సుందరివా..? తప్పుకో..


సుమన: బుల్లి బావగారు నీకు కలలొస్తాయా?


విక్రాంత్‌: ఎందుకు అలా అడిగావు. నీ దెబ్బకు నేను నిద్రే పోనని ఇక కలలేం వస్తాయనా? నీ ఉద్దేశం.


సుమన: అది కాదు బుల్లి బావ గారు మా అక్క తవ్వి తీసిన పెట్టెలో ఉన్న పేపర్స్‌ మనమే తీసుకెళ్లినట్లు నాకు కల వచ్చింది.


 అని చెప్పగానే విక్రాంత్‌ కోపంగా సుమను తిడతాడు. దీంతో మా అక్క చెబితే గంటలు గంటలు  వింటారు. నేను చెబితే తిడతారేంటి అంటుంది సుమన. వదిన బతకడానికి చెప్తుంది. నీ మాటలు వింటుంటే ఇంకా ఎందుకు బతికున్నామా అనిపిస్తుంది అంటాడు. తర్వాత గురువు గారు విశాల్‌ చేతిని చూసి అతను రాసింది విబూది కాదు అని చెప్తాడు. ఇది రాయడం ఏమాత్రం మంచిది కాదంటాడు. దీంతో నయని కంగారు పడుతుంది.


దురందర: నువ్వు ఆగు నయని.. గురువు గారు ఏ డాక్టర్‌ చేయలేని మంచిపని వృశ్చిక మూర్తిగారు చేస్తే.. సంతోషపడక అతను పౌడర్‌ రాశాడా? సున్నం రాశాడా? అని ఇదేంటా అని అనుమానంతో పరీక్షలు చేసి మళ్లీ నొప్పిని పెంచుకోవడం అవసరమా చెప్పండి.


గురువు: అది కాదు దురందర ఈ రకమైన వైద్యం ప్రయోగమే.. ఒకటి జరగబోయి ఇంకొకటి వికటిస్తుందని చెప్తున్నాను.


దురందర: అనుకుంటే అన్ని అనుమానాలే.. గురువు గారు కగారుపడుతున్నారు.


నయని: బాబు గారు మీకైతే నొప్పి తగ్గింది కదా? లేదంటే మేము కంగారు పడుతున్నామని మీరలా చెప్తున్నారు కదా?


విశాల్‌: నయని అబద్దం చెప్పినా అనుభవించేది నేనే కదా? ప్రస్తుతానికైతే బాగానే ఉంది.


 అని విశాల్‌ చెప్పగానే గురువు.. వచ్చింది ఎవరు? తిలొత్తమ్మ ఏదైనా కుట్ర పన్నారా? అని అనుమానపడతాడు. తర్వాత గాయత్రిదేవి వచ్చి విశాల్‌ను పిలుస్తుంది. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి నువ్వు పిలిచినా..? అరిచినా విశాల్‌కు వినబడదులే.. అంటుంది. దీంతో గాయత్రిదేవి కోప్పడుతుంది. తర్వాత విశాల్‌ హాల్‌ లో నిద్రపోతుంటాడు. అందరూ వచ్చి విశాల్‌ ను నిద్ర లేపుతారు. తిలొత్తమ్మ ఫైల్‌ ఇస్తుంటే విశాల్‌ ఎడమచేత్తో తీసుకుంటుంటే కుడిచేత్తో తీసుకోమని చెప్తుంది. అప్పుడు విశాల్‌ కుడిచేతి పని చేయదు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఎంత ప్రయత్నించినా కుడి చేయి కదలదు. నయని వస్తుంది. తిలొత్తమ్మ చూశావా గాయత్రి అక్కా మన విశాల్‌కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్తుంది. దీంతో అందరూ ఎమోషనల్‌ గా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘బిగ్ బాస్’కు వెళ్తున్నారు అంట నిజ‌మేనా? రాజ్ త‌రుణ రియాక్ష‌న్ ఏంటో చూడండి