Trinayani Serial Today Episode విశాలాక్షి త్రినేత్రి, త్రినయని ఒకటి కాదని అంటుంది. దాంతో త్రినేత్రి నేను నయని కాదని నాకు యాక్సిడెంట్ కాలేదని నేను నయని కానప్పుడు తను ఎక్కడ ఉండాలని అడుగుతుంది. దాంతో హాసిని హాస్పిటల్‌లో ఉండాలని అంటుంది. దాంతో విశాలాక్షి హాస్పిటల్‌లో లేదు అని చెప్తుంది. దాంతో హాసిని అలా అయితే తనే తిను తినే తను అని అంటుంది.


విశాలాక్షి: ఏంటి చిన్నాన్న ఏం మాట్లాడవు.
విక్రాంత్: ఏం మాట్లాడాలి.
విశాలాక్షి: డాక్టర్ సారిక ఎవరు.
విశాల్: నయనికి ట్రీట్మెంట్ ఇచ్చేది తనే. 
విశాలాక్షి: తను నయనమ్మకి వైద్యం చేసిన తర్వాత రోజే గుండె పోటుతో చనిపోయింది. అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయం చిన్నాన్న మీతో చెప్పలేదా.
తిలోత్తమ: మరి ఆవిడ లేనప్పుడు నయని కేసుని ఎవరు తీసుకున్నారు.
విశాలాక్షి: ఏంటి చిన్నాన్న డాక్టర్ లేనప్పుడు నయనమ్మ  హాస్పిటల్‌లో ఎందుకుంటుదని తేలికగా సమాధానం చెప్పొచ్చు కదా అని నవ్వుతుంది.
విశాల్: డాక్టర్ సారిక గారు చనిపోయిందని ఎందుకు చెప్పలేదురా.
విక్రాంత్: వదినను చూసిన డాక్టర్ చనిపోయింది అంటే మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు.
వల్లభ: డాక్టర్ లేదు సరే పేషెంట్ ఉండాలి కదా.
విశాలాక్షి: నయనమ్మ అక్కడ లేదు అంటున్నా కదా. 
విక్రాంత్: మనసులో ఈ విషయాలు అన్నీ విశాలాక్షికి ఎలా తెలుస్తున్నాయి. నాకు భయం వేస్తుంది. 
విశాలాక్షి: నయనమ్మ బాగోగులు చూస్తానన్న చిన్నాన్న ఏం మాట్లాడటం లేదు.
విక్రాంత్: ఒక మిరాకిల్ జరిగింది అమ్మ నయని వదిన అమ్మవారి కృపతోనే ప్రాణాలతో బయట పడింది. ఇక్కడున్నదే వదిన. సుమన మనం పొరపాటు పడ్డాం విశాల్ బ్రో నమ్మకమే నిజం. సారీ వదిన నేను గతంలో మిమల్ని అపార్థం చేసుకొని నువ్వు నువ్వు అని మాట్లాడాను.


అందరూ విశాలాక్షికి ఈ అయోమయానికి తెర దించమని అంటారు. విశాలాక్షి సరే అంటుంది. విశాలాక్షి మాటలకు విక్రాంత్ చాలా టెన్షన్ పడతాడు. సుమన వెళ్లగానే భయంతో అరుస్తాడు. ఏంటి నాకు భయపడుతున్నారని సుమన అంటుంది. నిన్ను చూశా కదా అని విక్రాంత్ అంటాడు. చెమటలు పడుతున్నారు అంటే దేనికో భయపడుతున్నారని అంటుంది. దాంతో విక్రాంత్ సుమనకు వెళ్లిపోమని అంటాడు. విశాలాక్షి హాల్‌లో కూర్చొని విశాల్‌కి నయని మెడలో ఉండే తాడు ఇస్తుంది. నయనిది నీకు ఎక్కడిది అని అందరూ విశాలాక్షిని అడుగుతారు. దాన్ని విశాలాక్షి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చానని చెప్తుంది. హాస్పిటల్‌లో చేరినప్పుడు ట్రీట్మెంట్ అప్పుడు కూడా నయని మెడలో ఈ తాయొత్తు ఉందని తర్వాత తెగిపోయిందని అంటుంది. అప్పుడు నయనిని కాపాడింది ఎవరు అని త్రినేత్రి అంటే నువ్వే అని విశాలాక్షి త్రినేత్రితో చెప్పి నవ్వుతుంది. ఇలా ఏంటి నీ మాటలు అన్ని అందరూ విశాలాక్షిని ప్రశ్నిస్తారు. 


విక్రాంత్ ఆ అమ్మవారి బిల్ల నీకు ఎక్కడిది అని విశాలాక్షిని అడుగుతుంది. అమ్మ చావుతో పోరాడుతుంటే వెళ్లానని నయనమ్మని ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్‌లోకి మార్చుతుంటే ఈ బిల్ల తీసుకొచ్చానని అంటుంది. విక్రాంత్ షాక్ అయిపోతాడు. అందరూ విక్రాంత్ ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్లారని అడుగుతాడు. దాంతో విక్రాంత్ కంగారు పడి వదిన కళ్ల ముందు ఉంటే ఈ ప్రశ్నలు ఎందుకని అంటాడు. దానికి విశాలాక్షిఈ అమ్మని నయనమ్మ అని ఒప్పుకుంటావా చిన్నాన్న అని అంటే ఒప్పుకుంటానని విక్రాంత్ అంటాడు. మహాంకాళి అమ్మవారి దగ్గరకు వెళ్తే అన్నీ తెలుస్తాయని విక్రాంత్ మనసులో అనుకుంటాడు.


ఇక విశాలాక్షి ఆ తాయొత్తుని విశాల్‌తో త్రినేత్రి మెడలో కట్టిస్తుంది. అందరికీ అక్షింతులు వేయమని అంటుంది. మూడు ముళ్లు వేయమని విశాల్‌కి చెప్తుంది. అందరూ అక్షింతులు వేస్తారు. విశాలాక్షి త్రినేత్రి, విశాల్‌లు తనని పైకి లేపాలని అంటుంది. విశాలాక్షి చేయి తాకగానే త్రినేత్రికి తాను నయని అని గుర్తొస్తుంది. నువ్వెప్పుడు వచ్చావమ్మా విశాలాక్షి అని నయనిలా మాట్లాడుతుంది. అందరూ ఏం జరుగుతుందో అని బిత్తర పోతారు. విక్రాంత్ వదిన అని పిలవగానే చెప్పండి విక్రాంత్ బాబు అని అంటే విక్రాంత్ షాక్ అయిపోతాడు. ఇక హాసిని  మనసులో చెల్లి ఇలా ఎంత సేపు ఉంటుందో కనిపెట్టాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!