Satyabhama Serial Today Episode మహదేవయ్య డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్ గురించి టెన్షన్ పడుతుంటే సత్య మామయ్యతో కేవలం 24 గంటల్లో మీ బండారం బయట పడుతుందని ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోండి మీ వెన్నులో ఒణుకు పుట్టడం గ్యారెంటీ అని అంటుంది. మునిగేది.. మునగబోయేది మీరు మహదేవయ్యగారు అని అంటుంది. గుండె మీద ఎక్కడ పచ్చబొట్టు పొడిపించుకున్నారో అదే చోట చిన్నా కత్తి పోటు పొడుస్తాడు రెడీగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది.
సంజయ్ విధే మనల్న కలుపుతుందని అంటున్నాడని సంజయ్‌కి కనిపించకూడదని అనుకొని ఇంటి నుంచి బయటకు రాకూడదు అని అనుకుంటే తన తండ్రి మందులు కోసం బయటకు వస్తుంది. అయితే మెడికల్ షాప్ దగ్గర సంజయ్ ఉంటాడు. విధి మనల్ని కలుపుతుంది అని సంజయ్ అంటే సంధ్య నమ్మేస్తుంది. సంజయ్ ఫ్రెండ్‌షిప్ చేద్దామంటే సంధ్య ఒకే చెప్తుంది. ఇక సంధ్య ఫోన్లో తన నెంబరు ఫీడ్ చేస్తుంటే ఫోన్ కింద పడేస్తాడు. తర్వాత కొత్త ఫోన్ కొని సంధ్యకి ఇస్తాడు. సంధ్య వద్దని అంటే ఫ్రెండ్షిప్ గుర్తుని సంధ్యకి ఫోన్ ఇస్తాడు.
మరోవైపు క్రిష్ ఇంట్లో మహదేవయ్య గెటప్ వేసుకొని బంటీ మహదేవయ్య కుర్చీలో కూర్చొని ఆయన లాగే సిగరెట్ తాగుతుంటే భైరవి తను మహదేవయ్య అనుకొని మాట్లాడుతుంది. తర్వాత చూసి షాక్ అవుతుంది. అందర్ని పిలుస్తుంది. దాంతో మహదేవయ్య వచ్చి నా కుర్చీలో కూర్చొంటావా అని తిడతాడు. గంగ వచ్చి మీ నాన్న లాగే ఉన్నావురా అని పొడుగుతుంది. ఇంతలో క్రిష్ వచ్చి బంటీని కొడతాడు. ఆ ఛైర్ మా బాపు సింహాసనం అందులో వీడు ఎలా కూర్చొంటాడని కొడతాడు. ఎవరు ఎంత ఆపినా క్రిష్ ఆగడు. బట్టలు విప్పమని బంటీతో చెప్తాడు. మా నాన్నవి ఇవ్వను అని బంటీ చెప్తే గన్ తీస్తాడు. దాంతో భయపడి బంటీ బట్టలు విప్పుతాడు. క్రిష్ ఆ బట్టలను తీసుకెళ్లి బయట పెట్టి కాల్చేస్తాడు.
గంగ మహదేవయ్యని నిలదీస్తుంది. క్రిష్‌కి ఇన్నాళ్లకి నాన్న కనిపిస్తే ముచ్చట పడి నీ బట్టలు వేసుకుంటే క్రిష్ ఇలా చేశాడు నువ్వు ఏం మాట్లాడవేంటి అని అంటుంది. నా మొగుడు చెప్పిన అబద్ధాలకు రేపటితో తెర దిగుతుందని నా బిడ్డ తప్పు చేశాడని బట్టలు ఇప్పావు రేపు మీ నాన్న తప్పు చేశాడని తెలిస్తే ఏం చేస్తావని అంటుంది. క్రిష్ అదంతా రేపు చూద్దాం అని వాళ్లని గెంటేస్తాడు. సత్య అడ్డుకుంటే వాళ్లు నా కళ్ల ముందు ఉండొద్దని అంటాడు. దాంతో సత్య మళ్లీ ఆమె మీడియాని పిలిచి రచ్చ చేస్తుందని అంటుంది. గంగ కూడా చెప్తే వీళ్లకి అర్థం కావడం లేదు చేసి చూపిస్తా అంటుంది. మహదేవయ్య క్షమాపణ చెప్పమని అంటుంది.
మహదేవయ్య ఏం అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మహదేవయ్య కోపంతో గదిలో సిగ తాగుతుంటే విసిరి కొడతాడు. క్రిష్ దాన్ని పట్టుకొని నీ లాగే నాకు కోపం వస్తుంది బాపు కానీ నువ్వు గంగకి ఎందుకు భయపడుతున్నావని అడుగుతాడు. తప్పించుకుంటావని అడుగుతాడు. పరిస్థితులు అలా వచ్చాయని చెప్తాడు మహదేవయ్య. దానికి క్రిష్ కారణం నువ్వే కదా బాపు అని అంటాడు. గంగని చంపేస్తా అని మహదేవయ్య అంటే మహదేవయ్య క్రిష్‌ని అడ్డుకుంటాడు. కోపంతో మహదేవయ్య క్రిష్ మీద అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.