Trinayani Serial Today Episode: 


సుమన: స్పష్టంగా తెలుస్తుంది మా అక్క చేతుల్లోనే జీవం పోవడం ఖాయం అని. 
నయని: స్వామి ఏంటి నాకీ పరీక్ష. ఎవరికీ అపకారం చేయని నేను ఒకరు ఉసురుమనేలా  చేస్తానా.
గురువుగారు: కక్ష కట్టి చేయడం వేరు నయని.. వాస్తవం ఏంటంటే నీ కూతురు ఎవరు అని జీవం నోటి వెంట రాగానే అదే నోటి వెంట నెత్తురు వచ్చి మరణిస్తాడు అతడు. 
తిలోత్తమ: జీవం విషయంలో స్పష్టత వచ్చింది ఇక మిగిలింది. గాయత్రీపాప, గారడీ పాప
వల్లభ: అవును వారిద్దరిలోనే ఒకరు పోతారు. నా మాట విని గాయత్రీ పాపని గుడికి తీసుకెళ్లకు పెద్దమరదలా అప్పుడు ఆ గారడీ పిల్లే గుటుక్కుమంటుంది. 
నయని: అలా చేయను. గాయత్రీని వెంట తీసుకెళ్తేనే ఆ ఆపద ఏంటో అర్థం అవుతుంది. అప్పుడు రక్షించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.
తిలోత్తమ: అమ్మవారు కూడా అండగా వస్తుంది అని గురువుగారు అన్నారు. నీకు అండగా ఉంటుందేమో చూడాలి నయని. 
నయని: ఆ తల్లే గనక వస్తే జీవం అన్న ప్రాణాలు పోకూడదు అని కోరుకుంటాను. ఇక గాయత్రీపాపని, విశాలాక్షిని నేను కాపాడుకుంటాను. 


మరోవైపు తిలోత్తమ, వల్లభ మాట్లాడుకుంటే అక్కడికి గాయత్రీపాప అక్కడికి వస్తుంది. వాళ్ల మాటలు వింటుంది. ఇక తిలోత్తమ తనకు గాయత్రీదేవి, నయని శత్రువులు అని అంటుంది. దీంతో వల్లభ నయని జీవాన్ని చంపేస్తే జైలుకి వెళ్లిపోతుంది అని అప్పుడు గాయత్రీ దేవి పసిపాపలా ఉండటం వల్ల నష్టం లేదు అని అంటాడు. ఇక జీవం గాయత్రీదేవి జాడ చెప్తే తమ బండారం బయట పడుతుంది అని జీవం నిజం చెప్పకముందే అతన్ని చంపేద్దామని తిలోత్తమ అంటుంది. ఇక అప్పుడే గాయత్రీ పాప బాలుతో తిలోత్తమని కొడుతుంది. 


విశాల్: నయని ఇక్కడ ఉన్నావా బెడ్‌రూంలో చూసి.. ఇంకా జీవం చావుకు నువ్వు ఎలా కారణం అవుతావో అని దీర్ఘంగా ఆలోచిస్తూ మేడమీద బాల్కానీలో ఉంటావు అనుకున్నా.. 
నయని: బాబు గారు నా బిడ్డను ఎత్తుకు పోయిన ఆ జీవం అన్న ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. అతడికి ఆపద వస్తుంది అంటే అక్కడ నేను ఉంటాను అని నాకు తెలుసు. అయితే నేను అతడికి ప్రాణ గండం అవుతాను అని నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. నా ప్రాణానికి ప్రాణం అయిన గాయత్రీ అమ్మగారి జాడ జీవం అన్న  చెప్పాడు అంటే తన ప్రాణం పోకుండా కాపాడే బాధ్యత నాదే. నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పగానే తనో కాదో అన్న అనుమానం ఇంట్లో చాలా మందికి రావొచ్చు. వాటిని పటాపంచలు చేయడానికి ఇవి రెడీ చేస్తున్నాను. 
విశాల్: ఏంటి అవి.
నయని: గాయత్రీ అమ్మ గారి జాతకం. ఆమె హస్తముద్రిక అచ్చు ఉన్న పేపర్లు. 
విశాల్: నయని వీటిని తీసుకెళ్లి ..
నయని: అమ్మగారి చేతి ముద్రలు రేఖలతో పోల్చి చూస్తే అంతకన్నా సాక్ష్యాధారాలు ఏముండవు కదా బాబుగారు.
విశాల్: మనసులో.. ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది నయని.. జీవం గనుక గాయత్రీ పాపని మా అమ్మ అని చెప్తే అతని ప్రాణాలు పోతాయి. నువ్వు ఎలా కాపాడుతావో తెలీదు కానీ పాప చేతి ముద్రలు పోల్చి చూడటం.. తిలోత్తమ అమ్మకు రహస్యాలు అన్నీ తెలియడం.. నయని ఇంకు బాటిల్ కోసం వచ్చాను కానీ వచ్చిన పని మర్చిపోయాను.. అని విశాల్ ఆ ముద్రలపై ఇంకు వేసేస్తాడు. 


ఇక హాల్‌లో అందరూ సమావేశమవుతారు. డమ్మక్క, ఎద్దులయ్య చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు ఇంకా వెళ్లరు అని సుమన సెటైర్లు వేస్తుంది. నయని తనని పట్టించుకోవద్దని అందర్ని లోపలికి వెళ్లమని చెప్తుంది. ఇక సుమన డమ్మక్క, ఎద్దులయ్యని దత్తత తీసుకుంటారా అని విశాల్‌ని సుమన అడుగుతుంది. 


సుమన: ఏ సంబంధం లేని గాయత్రీ పాపనే దత్తత తీసుకున్నందుకు ఎవరి అభ్యంతరం లేకుండా కూతురిగా ఈ ఇంట్లో ఉంటుంది.
హాసిని: గాయత్రీకి ఆ హక్కు ఇప్పుడు రాలేదు. ఆ అర్హత ఎప్పుడో వచ్చింది.
సుమన: తెల్లారితే పోతాయి కదా అక్క. 
తిలోత్తమ: నాకు అర్థమైంది. రేపు గుడికి వెళ్తే అక్కడ జీవం కలుస్తాడు. ఇక విశాల్ నయని కన్న మొదటి కూతురు జాడ తెలిస్తే ఇంటికి తీసుకొస్తారు కదా.. పునర్జన్మ ఎత్తిన గాయత్రీ ఇంటికి వస్తే.. శాస్త్రిగారి మనవరాలు గాయత్రీ కూడా ఇంట్లో ఉంటుందా ఉండదా అని.. 
విశాల్: నన్ను కన్న తల్లి నాదగ్గరే ఉంటుంది. 
వల్లభ: పెద్దమ్మ గురించి కాదు బ్రదర్.. పెద్దమ్మ పేరు పెట్టుకున్న గాయత్రీ పాప గురించి..
విక్రాంత్: పిల్లల్ని ఎవరైనా వదిలేసుకుంటారా.. 
సుమన: మీరు ఉలూచిని వదిలేయలేదా..
విక్రాంత్: నా విషయం వేరు. 
నయని: ఒక్క నిమిషం విక్రాంత్ బాబు. చూడు సుమన గాయత్రీ అమ్మగారు ఈ ఇంట్లో అడుగుపెట్టినా గాయత్రీ పాపకు ఏలోటు రాదు. అలాంటి ఆలోచనే మాకు రాదు. 
సుమన: మంచిది అక్క. మరి గాయత్రీ పాప పేరిట రాసిన ఆస్తి సంగతి ఏంటి.
తిలోత్తమ: ఏముంది గాయత్రీ అక్క పేరిట మార్చుతారు. 
విశాల్: ఆస్తులు ఎవరి పేరిట ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. 
సుమన: చివరి మాట బావగారు. మీరు దత్తత తీసుకున్న గాయత్రీ పాప పేరిట రాసిన ఆస్తి నా కూతురు ఉలూచి పేరు మీద రాయండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.