Gruhalakshmi Telugu Serial Today Episode: విక్రమ్ దివ్యను రాజ్యలక్మీకి సారీ చెప్పమని అనడంతో దివ్య కోపంగా నన్నెందుకు అందరూ టార్గెట్ చేస్తున్నారు. నేను ఏం తప్పు చేశాను అంటూ బాధపడుతుంది. దీంతో ఈ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లి.. ఏం తప్పు చేశానంటూ అంత అమాయకంగా అడుగుతావేంటి దివ్య అంటూ బసవయ్య వెటకారంగా అడుగుతాడు.
ప్రసూనాంబ: గుడిమెట్లు తప్పితే మా వదిన ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కలేదు. అలాంటిది ఒక ఎస్సై ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. బతిమిలాడుకోవాల్సి వచ్చింది. ఎంత బాధపడుతుందో తెలుసా?
ప్రియ: అక్కని కాసేపు రెస్ట్ తీసుకోనిద్దాం. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుదాం.
సంజయ్: నీకే కాదు ప్రియ వదిన మీద మాకు సానుభూతి ఉంది. గాయం తగిలినప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఓపిక ఉన్నప్పుడు చూసుకుందామంటే కుదరదు. ప్రాబ్లమ్ వచ్చిన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. పోస్ట్ ఫోన్ చేసుకోవడం కుదరదు.
అనడంతో సంజయ్ కూడా నాకు చెప్తాడా? అని దివ్య ప్రశ్నించడంతో వాడు కూడా ఇంట్లో మనిషే వాడికి బాధ్యతలు ఉన్నాయి అంటూ బసవయ్య చెప్పగానే విక్రమ్ దివ్యను వారించి సంజయ్ ఏం చేయాలో చెప్పు అనగానే రాత్రి పగలు వదినకు కాపలా కాయడం మన వల్ల కాదు రోజురోజుకు వదినలో జబ్బు లక్షణాలు ముదిరిపోతున్నాయి. వదినను స్వేచ్చగా వదిలేయడం తనకే కాదు మనకు సేఫ్ కాదు. అనగానే విక్రమ్, సంజయ్‌పై కొప్పడతాడు. దీంతో బసవయ్య సంజయ్ చెప్పేది కరెక్టే నువ్వు ప్రశాంతంగా విను అంటూ విక్రమ్‌కు చెప్పి.. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా అంటూ సంజయ్‌ను అడుగుతే వదినను రూంలో వేసి బంధింద్దాం అంటాడు. దీంతో విక్రమ్ ఆలోచనల్లో పడిపోతాడు. మరోవైపు అనసూయ, నంద హాల్లో కూర్చుని ఆలోచిస్తుంటారు.
అనసూయ: మనం చేసిన చిన్న తప్పు ఎంత పెద్ద అనర్థాన్ని తీసుకొచ్చిందో చూశావా? ముందుకు వెళ్లలేము వెనక్కి రాలేము. అలా అని ఉన్నచోటే ఉంటే నరకం కనిపిస్తుంది.
నంద: ఇలా జరుగుతుందని నేను మాత్రం ఎలా ఎక్స్‌ఫెక్ట్ చేస్తాను చెప్పు అమ్మ.. నాన్నకి లాస్య అంటే చచ్చేంత కోపం అలాంటిది సడెన్‌గా లాస్య గురించి ఎందుకు కలవరిస్తున్నారు.
ఇంతలో తులసి అక్కడకి వస్తుంది.
తులసి: ఆయన అల్జీమర్ పేషెంట్. ఆయన చేసే పనులకు, మాట్లాడే మాటలకు కారణాలు అర్థాలు వెతుక్కోకూడదు. వెతుక్కుని లాభం లేదు కూడా సమస్య మీద పడింది పరిష్కారం వెతుక్కోవాలి అంతే
అనసూయ: అది కాదమ్మా ఆ డాక్టర్ ఏంటి మీ మామయ్యా భ్రమలో ఉండి ఏదో మాట్లాడితే దాన్నే నిజం అంటూ మనల్ని కూడా తందాన తాన అనమంటాడు.
తులసి: అది ఆయన తరహా ట్రీట్మెంట్. మనం ఆ డాక్టర్‌ను నమ్ముకున్నప్పుడు ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే వేరే దారి లేదు.
అనగానే అనసూయ అలాగని దాన్ని తీసుకొచ్చి మళ్లీ ఇంట్లో పెట్టుకుందామా? అంటూ ప్రశ్నింస్తుంది. దీంతో పరంధామయ్య వ్యాధి గురించి అనసూయ, నందలకు నచ్చజెప్పి మళ్లీ లాస్యను ఇంటికి తీసుకొద్దామని చెబుతుంది. దీంతో నంద వద్దంటాడు. తులసి కన్వీన్స్ చేస్తుంది. దీంతో నంద లాస్యను తీసుకురావడానికి వెళ్తాడు. మరోవైపు దివ్య, విక్రమ్ రూంలో కూర్చుని సంజయ్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటారు. ఇంతలో సంజయ్ గొలుసు, తాళం తీసుకుని లోపలికి వస్తాడు. అది చూసిన కంగారు పడుతూ..
విక్రమ్: అంటే నిజంగానే..
సంజయ్: తప్పదు అన్నయ్య నాకంటే నీకే ఎక్కువ తెలివి ఉంది. నువ్వే బాలెన్సుడుగా ఆలోచిస్తావు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నువ్వే నాకు గైడెన్స్ ఇచ్చావు. మనిషి వీక్‌నెస్ ఏంటటే ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చేటప్పుడు ఎంతో తెలివిగా ఆలోచించే మన మైండ్ సొంత సమస్య విషయంలో సరిగ్గా పనిచేయదు. నీ చేతితోనే వదిన కాళ్లు చేతులు కట్టేయ్
అంటూ చెప్పి గొలుసు, తాళం విక్రమ్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు సంజయ్. విక్రమ్ బాధపడుతుంటే వాళ్లు చెప్పింది నిజమే నాకు నిజంగా పిచ్చి ఉన్నట్లుంది. అందుకే అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లినట్లు అంటూ దివ్య ప్రశ్నిస్తూ... నన్ను కట్టేయ్ విక్రమ్ పిచ్చాసుపత్రిలో ఉండటం కన్నా ఇంట్లో ఇలా ఉండటమే బెటర్ కదా అంటుంది. విక్రమ్ వద్దు అంటుంటే ప్రియను పిలిచి తనకు సంకెళ్లు వేయమని చెప్తుంది దివ్య దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.