Trinayani Serial Today Episode 


సుమన: ఏంటి అమ్మా సడెన్‌గా ఊడిపడ్డావ్.
శ్యామల: రాకూడదా ఏంటే.. ఒకరోజు ఉండి వెళ్లేదాన్ని. 
పెద్దబొట్టమ్మ: శ్యామల ఊలూచిని తీసుకో నేను ఎవరికి కనపడటం లేదులే. పాపను చూద్దాం తీసుకో.
శ్యామల: అమ్మా ఊలూచి రా అమ్మా.. 
సుమన: ఆగమ్మా.. బయట  నుంచి వచ్చావ్ కాలు కడిగి పాపను ఎత్తుకోవాలి అని తెలీదా..
శ్యామల: అలాగే అమ్మ.. రాగానే చేతికి ఏమైంది అని అడగాలి అనుకున్నాను వదినా. ఏమైంది.
తిలోత్తమ: ఇదా నీ పెద్ద కూతురు, అల్లుడు చేసిన నిర్వాకం. 
హాసిని: వాళ్లేం చేశారు నీ మొదటి మొగుడు షూట్ చేశాడు.
ఎద్దులయ్య: ఎంత సేపు అని అలా నిలబడి ఉంటుంది పెద్ద బొట్టమ్మ. 
నయని: మా అమ్మని పెద్దమ్మ అనబోయి పెద్దబొట్టమ్మ అన్నారు ఎద్దులయ్య. మనసులో.. అమ్మ పక్కన పెద్ద బొట్టమ్మ కచ్చితంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది ఇద్దరూ ఏం చేయనున్నారు. అంతుపట్టడం లేదే.
తిలోత్తమ: సుమన ఆలోచనలో పడ్డావు ఏంటి. 


ఇక వల్లభ ఏందుకు మరదలా డల్‌గా ఉన్నావు హాసినికి డబ్బులు అడగాల్సివస్తుంది అనా అని అంటాడు. దానికి సుమన అవసరం అయితే ఓ నెక్లస్ అమ్ముకుంటా కాని ఆ పని చేయను అంటుంది. ఇక ఎద్దులయ్య, డమ్మక్క అలా చేయాల్సి వస్తుంది అంటారు. ఇక సుమన ఉలూచిని రెడీ చేస్తూ ఉంటుంది. 


పెద్దబొట్టమ్మ: వెళ్లు శ్యామల నీ పని కానివ్వు.
శ్యామల: అది ఇప్పటికి ఇప్పుడు జరిగిపోయే పనికాదు. నువ్వు ఉలూచిని చూడాలి అనుకున్నావు కదా పద వెళ్దాం.
పెద్దబొట్టమ్మ: ఉలూచిని ఎత్తుకోవాలి అనుకుంటున్నా.
శ్యామల: అదెల ఆసాధ్యం.. నువ్వు నా పక్కన నా కొంగుకు ముడి వేసి ఉన్నప్పుడు పాపని తీసుకుంటే లేని పోని సమస్య వస్తుంది.  
 
ఇక సుమన పాపని రెడీ చేస్తూ ఎవరి పోలికలు వచ్చేయి పాప అస్సలు బొట్టు ఉంచుకోవు అంటుంది. దానికి వల్లభ నాగయ్య, పెద్ద బొట్టమ్మ పోలికలు వచ్చి ఉంటాయి అంటాడు. ఇక విక్రాంత్ వల్లభ అన్నదాంట్లో తప్పేలేదు. ఉలూచికి ఇద్దరు అమ్మలు అంటాడు. దీంతో హాసిని తిలోత్తమకు ఇద్దరు భర్తలులా అన్నమాట అని అంటుంది. దానికి తిలోత్తమ ఫైర్ అవుతుంది. 


నయని: ఇదేం సీక్రెట్ కాదు కదా అత్తయ్య అందరికీ తెలిసిన విషయమే. 
హాసిని: కాకపోతే మొదటి మామయ్య బతికేఉన్నాడని జనాలకు తెలీదు అంటే.
సుమన: రివాల్వర్‌తో కాల్చారని ఈపాటికి తెలిసిపోయింటుంది కదా.
శ్యామల: అమ్మా గొడవలు ఎందుకు లే అమ్మా.. సుమన పిల్లకి కాటుక తుడిచి సరిచేయు. అయినా బొట్టు సరిచేయడం కూడా తెలీదా ఉండు నేనే చేస్తాను.
నయని: అమ్మా పర్లేదు అమ్మా నేను చేస్తాను.
పెద్దబొట్టమ్మ: శ్యామలా ఈ పని నువ్వే చేయు.. 
ఎద్దులయ్య: తల్లీ కూతుళ్ల చేతికి కొబ్బరి నూనె అంటింది అది కాటుక కాదు. కాటు వేసే పాము చిత్రాన్ని కూడా చెరిపి వేయగలదు. 
పెద్దబొట్టమ్మ: ఉలూచి ఎంత బాగుంది కదా శ్యామల.
శ్యామల: నేను బదులిస్తే దొరికిపోతావు నాగులమ్మ.. ఆనందంతో అనవసరంగా మాట్లాడుతున్నావు. 
పెద్దబొట్టమ్మ: నల్ల చందమామలా పెద్ద బొట్టు పెట్టకు శ్యామల.. అర్థచంద్రాకారంలో చిన్న బొట్టు పెట్టు అప్పుడే నా బిడ్డ అందంగా ఉంటుంది. 
శ్యామల: (పాపకు బొట్టు పెట్టడానికి వెళ్తుంటే నయని నూనెతో శ్యామల చేయి మీద ఉన్న పాము బొమ్మని తుడిచేస్తుంది.) అయ్యో నయని నాగ బొమ్మని చెరిపేశావు ఏంటి అమ్మ.
నయని: అది పచ్చబొట్టు కాదు కదా అమ్మ. అయితే తుడిచేస్తే పోతుంది అని నయని తుడిచేస్తుంది. 
సుమన: అలాంటి బొమ్మలు ఎందుకు వేసుకున్నావ్ అమ్మా.
తిలోత్తమ: ఉలూచి రాత్రిపూట పాములా మారుతుందని అలాంటి బొమ్మలు ఇష్టపడుతుందని ఆ బొమ్మ వేసుకొని వచ్చింది అనుకుంటా. 


ఇక నయని ఆ బొమ్మ తుడిచేసిని వెంటనే పెద్ద బొట్టమ్మ ఒక్కసారిగా కింద పడిపోతుంది. అయితే అందరికి పెద్ద బొట్టమ్మ కనిపించకుండా ఆమె చీర మాత్రమే కనిపిస్తుంది. దీంతో అందరూ చూసి షాక్‌ అవుతారు. ఇక శ్యామలా ఎవరూ చూడకుండా చీరను దులుపుతుంది.


విక్రాంత్: ఆ చీరలో పాము లేదు అత్తయ్య. పెద్దబొట్టమ్మ పాములా మారిపోయి ఎవరికీ కనిపించకుండా జారుకొని వెళ్లిపోవడాన్ని నేను మాత్రమే చూశాను. మీరు పెద్ద బొట్టమ్మని వెంట పెట్టుకుని రావడం ఎవరూ చూడలేదు అని అనుకుంటున్నారు కానీ నేను చూడగలిగేలా చేసింది ఇదిగో ఈ ఐదు గవ్వలే. 
శ్యామల: ఈ గవ్వలను నాకు ఇచ్చేస్తారా బాబు. నాకు కావాలయ్యా ఇచ్చేస్తారా.. అని అడుగుతుంది. ఇక విక్రాంత్ ఇస్తుండగా.. నయని అడ్డుకుంటుంది. 
నయని: విక్రాంత్ బాబు మంచోడు కాబట్టి వీటితో నువ్వు ఏదో చేసుకుంటావు అని ఇవ్వబోయాడు. కానీ నేను ఇవ్వను. నీకు ఏం అవసరమో చెప్తే ఇస్తాను.
విక్రాంత్: చెప్పండి అత్తయ్య ఉపయోగపడతాయి అనుకుంటే వదిన ఇచ్చేస్తారు.
శ్యామల: మామయ్య అదే వీళ్ల తాతయ్య శంకర శాస్త్రిగారు ఈ గవ్వలు వేసి జాతకం చెప్తారు అని.
నయని: తాతయ్య ఎప్పుడూ అలా చేయరు అమ్మా.. ఎందుకు నువ్వు అబద్ధం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నావు.
శ్యామల: ఏంటి నయని మీ అమ్మని నీవు అనుమానిస్తున్నావా. ఇక అప్పుడే పెద్ద బొట్టమ్మ చీరను పాములా ఉన్న పెద్ద బొట్టమ్మ తీసుకెళ్లిపోతుంది. 
నయని: వచ్చినప్పుడు మా అమ్మ కొంగు పట్టుకొని చాలా నెమ్మదిగా వచ్చింది. ఇప్పుడు ఎవరూ చూడకూడదు అని ఇలా తొందరగా వెళ్లి పోతుంది. నేను చూశాను అమ్మా నీ చీరకు తన చీర కొంగు ముడి వేసి లోపలకి రావడం. పెద్ద బొట్టమ్మ చీర ఎవరూ గుర్తు పట్ట లేదు కాబట్టి సరిపోయింది. 
విక్రాంత్: నేను ఎవరికీ చెప్పలేనులే వదిన. సుమనకు తెలిస్తే అత్తయ్య మీద దాడి చేసేది. అవును అత్తయ్య ఈ రోజుల్లో సాటి మనుషులనే నమ్మలేము. అలాంటిది మీరు సర్పజాతుల్ని నమ్మితే ఇక అంతే. ఇంత కన్నా నేను మీకు చెప్పలేను ఎందుకు అంటే మీ ఇద్దరు కూతుళ్లు ఈ ఇంటి కోడళ్లు.
నయని: ఇంత కంటే మంచిగా ఎవరూ చెప్పరు అమ్మ. నువ్వు ఏదైనా చెడు చేయాలి అనుకుంటే నాకు చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్లిపో.
శ్యామల: అలా అనేశావు ఏంటి నయని.. ఉలూచిని చూడాలి అని నాతో వచ్చింది పెద్దబొట్టమ్మ. నీలా నాది కూడా జాలి గుండె కదా అని కొంగుకు ముడి వేయనిచ్చాను. లోపలికి తీసుకొచ్చాను.
నయని: నేను నీ చేతిమీద ఉన్న పాము గుర్తును చెరిపేగానే అందరికీ కనిపించేస్తాను అని పెద్ద బొట్టమ్మ తెలివిగా ఉండేది లేదంటే నీ పని వేరేలా ఉండేది. 
శ్యామల: గవ్వలను తీసుకోకుండా చేసింది నయని ఇప్పుడేం చేయాలి.


ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయింది.