Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్​లో అందర్నీ ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది మొత్తానికి ఈ స్కూల్లోనే జాయిన్ అయిపోయావు అని అంజుని చూసి ఆనందపడతాడు రామ్మూర్తి.


అమ్ము : చివరి క్షణం వరకు టెన్షన్ పెట్టి ఇక్కడ జాయిన్ అయింది.


అంజు : అంజు అంటే సమ్​థింగ్ స్పెషల్ ఉండాలి కదా అని రామ్మూర్తి కాళ్ళకి నమస్కరిస్తుంది. నేను వాచ్​మెన్​ని నా కాళ్ళు పట్టుకోకూడదు అంటాడు రామ్మూర్తి. మీరు మా తాతయ్య మీ కాళ్లు పట్టుకోవడంలో తప్పులేదు అని చెప్పి రామ్మూర్తి ఆశీర్వచనం తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతారు.


లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన టీచర్ కనిపిస్తాడు.


టీచర్: అప్పుడే స్కూల్​కి వచ్చేసావా నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు.


అంజు: బానే ఉంది టీచర్.


టీచర్: ప్రిన్సిపల్ ఎంత ఆపుదామనుకున్నా ఆపలేక పోయింది అని నాలుక కరుచుకుంటాడు.


అంజు: కోపంగా.. ఆవిడ నన్ను ఆపాలనుకోవడం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ చేసిందంతా చెప్పి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి టీచర్ వెళ్ళిపోతాడు.


కోపంతో ఊగిపోతున్న అంజుని చూసి అందరూ వద్దు.. ఈ రోజే మొదటి రోజు గొడవలు ఏమీ పడొద్దు అని చెప్పిన వినకుండా ప్రిన్సిపల్ మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది. వినాయకుడి దగ్గర ఉన్న అరటిపండు తినేసి తొక్క ప్రిన్సిపల్ వస్తున్న దారిలో పడేస్తుంది. చూసుకోకుండా ఆ తొక్క మీద కాలేసిన ప్రిన్సిపల్ కాలుజారి పడుతుంది ఈ తొక్క ఇక్కడ ఎవరు వేశారు అని కోప్పడుతుంది.


అంజు : ఎవరికి తెలుసు మేడం ఎవరికీ ఏమన్యాయం చేయాలనుకున్నారో మాకైతే ఏమీ తెలియదు అంటూ.. పిల్లలందరితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


ప్రిన్సిపల్: రామ్మూర్తిని పిలిచి ఆ తొక్క అక్కడ ఎవరు వేశారు అని అడుగుతుంది. ఇందాక మీరే తిన్నారు మేడం అంటాడు రామ్మూర్తి.


ప్రిన్సిపల్ : నేను అటువైపు తిన్నాను కదా తప్ప ఇటువైపు ఎలా వచ్చి పడింది అయినా ఇకమీదట తొక్కులు డస్ట్ బిన్ లో వేయాలి అని మనసులో అనుకొని రామ్మూర్తిని అక్కడ క్లీన్ చేయమని చెప్పి వెళ్ళిపోతుంది.


మరోవైపు ఇంటికి వచ్చిన మనోహరి ముభావంగా ఉండటం చూసి తను ఎందుకు అలా ఉంది అని అరుంధతి చిత్రగుప్తుడిని అడుగుతుంది.


చిత్రగుప్తుడు : తెలుసుకోకూడదనిది తెలుసుకుంది.


అరుంధతి: ఏంటో అన్ని సగం సగం చెప్తారు తను ఏం తెలుసుకుంది? తను తెలుసుకున్నది నేను ఎప్పుడు తెలుసుకుంటాను అంటుంది.


చిత్రగుప్తుడు : సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటావు కానీ ఆ సమయం రాకముందే మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి.


అరుంధతి: ఏం చెప్పినా చివరికి అక్కడికి తీసుకు వస్తారు, పాపం మనోహరి అదోలా ఉంది ఏం జరిగిందో ఏంటో కనుక్కుంటాను అని అక్కడినుంచి వెళ్తుంది.


చిత్రగుప్తుడు : ఆమె పరిస్థితికి నువ్వు జాలి పడుతున్నావు కానీ ఇప్పటి నీ పరిస్థితికి ఆమె కారణమని తెలిస్తే ఏమైపోతావో అని అనుకుంటాడు.


లోపలికి వెళ్ళిన మనోహరి మిస్సమ్మని చూస్తూ అలాగే ఉండిపోతుంది.


మిస్సమ్మ : నన్ను ఇదే మొదటి సారి చూస్తున్నట్లు ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది.


మనోహరి : నువ్వు ఎవరో నీకు తెలుసా నీకు ఇంట్లో వాళ్ళు ఇంతకుముందే పరిచయం ఉన్నారా అని ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది అన్నిటికీ సమాధానాలు చెప్తుంది మిస్సమ్మ. నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటూ బ్లాంక్​గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది మనోహరి.  


అరుంధతి: మనో ఎందుకు మిస్సమ్మ గురించి ఆరాలు తీస్తుంది అనుకుంటుంది.


ఆ తర్వాత ఇంటికి వచ్చిన రాథోడ్ సీరియస్​గా ఉండడం చూసి ఏం జరిగిందో అనుకొని అతని వెనుక వెళుతుంది అరుంధతి.


రాథోడ్ : నేరుగా అమర్ దగ్గరికి వెళ్లి అరుంధతి అమ్మగారిని చంపిన హంతకుడు దొరికాడు పోలీసులకు చెబుదామా అని అడుగుతాడు.


అమర్: వద్దు వాడిని నేనే పట్టుకోవాలి వాడి వల్ల నా కుటుంబానికి, నాకు అన్యాయం జరిగింది అసలు ఎవరు చెప్తే వాడు ఆ పని చేసాడో కనుక్కోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రాథోడ్, అమర్.


ఈ మాటలు విన్న అరుంధతి బాధతో ఏడుస్తుంది. అదే సమయంలో ఆ మాటలని కిటికీ వెనుక నుంచి విన్న లీల మనోహరికి ఈ విషయం చెప్పడానికి బయలుదేరుతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.