Trinayani Serial Today Episode తిలోత్తమ గ్యాస్ లీక్ చేస్తుంది. హాల్‌లోకి వచ్చి ఇంకా పేలలేదు ఏంటా అని అనుకుంటుంది. ఇంతలో నయని పాపని ఎత్తుకొని కాఫీలు తీసుకొని రావడంతో తిలోత్తమ, వల్లభలు షాక్ అయిపోతారు. కాఫీ ఎలా చేసిందని తిలోత్తమ అంటుంది. గ్యాస్ వెలిగించావా మంట రాలేదా అని వల్లభ అంటే అందరూ మంట ఏంటి అని అడుగుతారు. తిలోత్తమ కవర్ చేస్తుంది. ఇక నయని ఇద్దరికీ కాఫీ ఇస్తుంది. ఇద్దరూ తాగేస్తారు.
నయని మనసులో తాగండి ఆ తర్వాత మీకు ఉంటుంది అసలు మజా అని అనుకుంటుంది. ఇక తిలోత్తమ మనసులో పిల్ల పోలేదు తల్లి పోలేదు గ్యాస్ లీక్ గురించి పసిగట్టేసిందా అనుకుంటుంది. కాఫీ తాగిన తర్వాత ఇద్దరూ కడుపు పట్టుకొని పరుగులు తీస్తారు. ఇద్దరికీ విరేచనాలు మొదలవుతాయి. నీరసం అయిపోతారు. నయని అక్కడికి వచ్చి స్వీట్స్ వాళ్లకి ఇస్తుంది. స్వీట్స్ తింటేనే విరేచనాలు ఆగుతాయి అంటుంది.
వల్లభ: మాకు ఇలా అయిందని నీకు ఎలా తెలుసు.
నయని: మీరు కడుపు పట్టుకునేలా చేసింది నేనే కాబట్టి. అవును బావగారు అవును అత్తయ్య కాఫీలో పౌడర్ వేసి బాగా తిప్పి మీ కడుపు తిప్పేలా చేశాం నేను గాయత్రీ పాప. అలియాస్ గాయత్రీ అమ్మగారు.
తిలోత్తమ: మేం బాత్‌రూమ్ లోపలకు బయటకు తిరుగుతుంటే చూసి సంబర పడాలి అనుకున్నావా త్రినేత్రి.
నయని: అచ్చు తప్పు త్రినయని ఇక్కడ. గ్యాస్ లీక్ చేసి నన్ను లేపేయాలి అని చూశారు. మీ పెద్ద కొడుకు అమాయకుడు అవ్వడమే మా లాంటి వాళ్లకి ప్లస్.
తిలోత్తమ: నువ్వు బలవంతురాలివి అని విర్ర వీగుతున్నావేమో నిన్ను వదలను.
నయని: నేను వంట గదిలోకి రాకముందే అక్కడ నా బిడ్డ గాయత్రీ ఉందీ అంటే మీరు నా బిడ్డ ప్రాణానికి కూడా హాని తలపెట్టారని అర్థమైంది. నాకు వచ్చిన కోపానికి కాఫీలో విషం కలపాల్సింది. కానీ మీ ప్రాణం తీయాల్సింది నేను కాదు గాయత్రీ అమ్మగారు అని ఆగాను. నేను ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు మారుతున్నానని ఆలోచిస్తే మీకు టైం పాస్ అవొచ్చుకానీ నాకు కోపం వస్తే మీ పని అయిపోతుంది.
తిలోత్తమ హాల్‌లో కూర్చొని ఉంటే గాయత్రీ పాప వెనక నుంచి చీర పట్టుకొని వచ్చి తిలోత్తమ మెడకు వేసి లాగేస్తుంది. తిలోత్తమ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. తిలోత్తమ పూల కుండా తన్నడంతో అందరూ చూసి అక్కడికి వస్తారు. ఇంతలో పాప వెళ్లిపోతుంది. ఏమైందని చూస్తే చీర అక్కడే ఉన్న ఓ కబోర్డ్‌కి కట్టేసి ఉంటుంది. తిలోత్తమ కళ్లు తిరిగి పడిపోయి ఉంటే నీళ్లు చల్లి లేపుతారు. ఎప్పుడూ పక్కనే ఉండేవాడిని ఇందాక ఎందుకు లేవు అని వల్లభని తిలోత్తమ కొడుతుంది. రెండు నిమిషాలు లేట్ అయింటే ప్రాణం పోయేదని నయని అంటుంది. ఎవరో నీ వెనక్కి వచ్చి నీకు ఊపిరి ఆరకుండా చేయాలి అనుకున్నారని విక్రాంత్ అంటే నయని గాయత్రీ అమ్మగారే అని చెప్తుంది. అక్క ఆత్మ వచ్చిందా అని తిలోత్తమ అడిగితే నయని వచ్చిందని అంటుంది.
పాప మేల్కొని ఉండటం చూశానని మరి ఎలా వస్తుందని సుమన అంటే వచ్చిందని నయని అంటుంది. సోఫా వెనక నుంచి ఆత్మ వెళ్లడం చూశానని నయని అంటుంది. అక్క ఆత్మ వస్తే నాకు కనిపించాలి కదా కనిపించలేదు అంటుంది. దాంతో నయని మీరు బాబుగారిని పెంచిన తల్లి తిలోత్తమ ఏనా అంటుంది. తిలోత్తమ కోపంతో నయని మీదకు వెళ్తే నయని తిలోత్తమ చేయి పట్టి తిప్పేస్తుంది. నేను నయని కాదని పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు ఎంత నొప్పిగా ఉంటుందని నయని అంటుంది. వల్లభ మీ ఆవిడకు చెప్పు అని విశాల్‌తో అంటే మా ఆవిడ ఎవరు అని అంటాడు. తను నయని కాదేమో అని రివర్స్ గేమ్ ఆడుతారు. అందరూ బిత్తరపోతారు. తిలోత్తమ నొప్పి అని అంటుంది. వదులు నయని నేను మీ అత్త తిలోత్తమనే నువ్వు నా కోడలు నయనివే అంటే నయని వదిలేసి పాపని తీసుకొని వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్!