Ammayi garu Serial Today Episode మందారం ముత్యాలు ఇంటికి వెళ్లి అందరితో జీవన్‌ని తరిమి కొట్టిన విషయం చెప్పి రూప, రాజులకు ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేశారని చెప్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. రూప, రాజులు మాత్రం ఆసక్తిగా లేరని మీరు రాజుని చేరదీసే వరకు వాళ్లు కలవరు అని చెప్తుంది. దాంతో విరూపాక్షి ఈ సారి అలా మిస్ అవ్వదు అని స్వామీజీ ఇచ్చిన మందు తీసుకురమ్మని అప్పలనాయుడికి తీసుకురమ్మని చెప్తుంది. ఆ మందుని మందారానికి ఇచ్చి రాజు రూపలకు ఇవ్వమని చెప్తుంది. 


ముత్యాలు ఇలా చేయడం మోసం అవుతుంది అని అంటే దానికి విరూపాక్షి వాళ్ల దృష్టిలో ఇది మోసం అయినా మనకు మంచిదని మన ధర్మం అని చెప్తుంది. ఈ మందుని రాజు, రూపలతో తాగించమని మందారంలో విరూపాక్షి చెప్తుంది. రూప, రాజుల తొలిరేయి సక్రమంగా జరగాలని విరూపాక్షి మొక్కుకుంటుంది. ఇక విజయాంబిక, దీపక్‌లు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. పింకీ, సుమలు రూపని రెడీ చేస్తారు. చంద్ర రాజుని రెడీ చేస్తారు. పింకీ జీవితం కాపాడినందుకు నువ్వు రాజు కలవబోతున్నందుకు సంతోషంగా ఉందని సుమ అంటే దానికి రూప నాకు సంతోషంగా లేదని అమ్మానాన్నలు కలిసే వరకు నేను కలవ కూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నామని అంటుంది. వాళ్లు ఎప్పటికైనా కలుస్తారు అని ఇక్కడ రూపకి సుమ అక్కడ రాజుకి చంద్ర ధైర్యం చెప్తారు. ఇక చంద్ర తనని చిన్న మామయ్యగారు అని పిలవమంటే రాజు తన వల్ల కాదని మీరు ఎప్పటికీ చిన్నయ్యగారే అని అంటాడు.


ఇక జీవన్, శ్వేతలు రగిలిపోతుంటారు. సూర్య ప్రతాప్ కుటుంబాన్ని నాశనం చేయాలని అంటాడు. వాళ్లు బయపడేలా చేయాలని శ్వేత అంటే గౌతమ్ వచ్చి వాళ్లని భయపెట్టే రాఘవ నా దగ్గర ఉన్నాడని అంటాడు. రాఘన నా దగ్గర బందీగా ఉన్నాడని చెప్తాడు. జీవన్ సరైన టైంలో మంచిగా వచ్చావని అంటాడు. ఇక శ్వేత రేణుక గురించి అడిగితే గొర్రె కేసు పెట్టడం నాతో పెళ్లి చేయడంతో రేణుక పారిపోయిందని చెప్తాడు. ఇక గౌతమ్ ఎమ్మెల్యేల్ని కొనేసి అవిశ్వాస తీర్మానానికి వెళ్దామని తన చిన్న మామయ్య మిగతాది చూసుకుంటాడని అంటాడు. విజయాంబిక, దీపక్‌లు మంచం రెడీ చేస్తూ తిట్టుకుంటారు. రూప వచ్చే దారిలో నూనె పోసి రూప జారి పడేలా చేద్దామని అనుకుంటారు. మరోవైపు మందారం పాలలో విరూపాక్షి ఇచ్చిన మందు కలుపుతుంది. ఇక దీపక్ మెట్ల మీద నూనె వేస్తాడు. ఇక రూప, రాజులు తీసుకొని వస్తారు. రూప నూనె జారిపడకుండా రావడం చూసి విజయాంబిక, దీపక్‌లు షాక్ అవుతారు. నిజంగానే ఆయిల్ వేశావా లేదా అని చూడటానికి వెళ్లి విజయాంబిక జారిపోతుంది. దీపక్ ఏం కాలేదు అని ఇంట్లో వాళ్లకి చెప్పి తల్లిని తీసుకెళ్లిపోతాడు. 


రూప, రాజులను తొలిరేయి గదిలోకి పంపుతారు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు సిగ్గుపడతారు. రూప రాజుతో అమ్మానాన్నల్ని కలపాలి అని మనం అనుకుంటే నాన్న మనల్ని కలపాలి అనుకుంటున్నారు అంటుంది. దానికి రాజు ఎంత మంది మనల్ని కలపాలి అనుకున్నా మన హద్దులు మనకు తెలుసు కదా అని అంటాడు. రూప థ్యాంక్స్ చెప్తుంది. ఇక రాజు పాపం కష్టపడి గది అలంకరించారు. మనం చిందరవందర చేసేద్దాం అది చూసి అందరూ మన మధ్య వాళ్లు అనుకున్నవి జరిగిపోయావని అనుకుంటారని అంటాడు. ఇక రూప పాలు తాగేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి సుపారీ ఇచ్చిన జ్యోత్స్న.. జ్యో ముందే ఫోన్‌లో కార్తీక్, దీపల రొమాంటిక్ ముచ్చట్లు!