Trinayani Today Episode నయని ఆరు బయట అమ్మవారిని ఏర్పాటు చేసి బోనం సమర్పించడానికి అంతా సిద్ధం చేస్తుంది. ఇక వల్లభ తన తల్లి చెప్పినట్లు బోనం ప్రసాదంలో రసాయనం కలిపేస్తాడు. పోచమ్మని రమ్మని హాసిని అంటే స్నానం చేయని ఆమెని పిలవడం కరెక్ట్ కాదని సుమన అంటుంది. 


విక్రాంత్: గంగలో మునిగినా నీ పాపం పోదు. కట్టెలు అంటుకోలేదు అన్నప్పుడు అతిథిలా వచ్చి ప్రసాదం వండిన పోచమ్మ మన అందరి కంటే ముందు ఉండాలి.
విశాల్: ముందు ఉండటమే కాదు ఆ అవ్వతో అమ్మవారికి హారతి ఇప్పిద్దాం.
వల్లభ: మురికిగా ఉన్న ఆ అవ్వ హారతి ఇస్తే మేం ఒప్పుకోం.
నయని: అయితే పక్కకి పోండి.
సుమన: ఇంత మాట అన్న తర్వాత మనం ఇక్కడ ఎందుకు పోదాం అత్తయ్య.
తిలోత్తమ: మనకు ఎందుకు వాళ్లు ఏదో చేయించుకోని మనం కూడా అమ్మవారి కృపకు పాత్రులవుదాం.


హాసిని పోచమ్మని పిలిచి బోనం తీసుకొని వస్తుంది. నైవేద్యం హాసిని పెట్టగానే నయని పోచమ్మకు హారతి ఇవ్వమని అంటుంది. దాంతో పోచమ్మ నాకు నేనే హారతి ఎలా ఇచ్చుకోవాలి అని అంటుంది. సుమన పోచమ్మని తిడితే విక్రాంత్ సుమనను తిడతాడు. ఇక విశాల్ హారతి ఇవ్వమని పోచమ్మని చెప్తే పోచమ్మ కర్పూరం చేతిలో పెట్టమని అంటుంది. తన ఇష్టాన్ని ఎందుకు కాదు అనాలి అని చేతిలో కర్పూరం పెట్టమని తిలోత్తమ వల్లభకు చెప్తుంది. చేయి ఏం కాలదు కర్పూరం వెలిగించమని పోచమ్మ నయనికి చెప్తుంది. నయని కర్పూరం వెలిగిస్తుంది.  పోచమ్మ పాట పాడుతూ హారతి ఇస్తుంది. హారతి కొండెక్కిపోతుంది. అయినా పోచమ్మ ఒట్టి చేతిని తిప్పుతుంది. అలా ఎందుకని హాసిని అడిగితే పూజలో పరవశించిపోయానని పోచమ్మ అంటుంది. ఇక ప్రసాదం తాను పంచుతాను అని పోచమ్మ అంటే స్నానం చేయలేదు, చేయి కడుక్కోలేదు నీ లాంటి మురికి ముసలి ప్రసాదం ఇస్తే తీసుకోమని అంటుంది. ప్రసాదం వద్దని తిలోత్తమ అంటే విశాల్ అమ్మవారి ప్రసాదం వద్దని అనకూడదని అంటాడు. ఇక పోచమ్మ వాళ్ల ఇష్టమే తింటే తనని లేకుంటే లేదు అని అంటుంది. ఇక పోచమ్మ మిగతా వాళ్లకి ప్రసాదం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక చేతులు కడిగావా అని తిలోత్తమ అంటే ఉగాదికి చేతులు కడిగానని చెప్తుంది. దాంతో తిలోత్తమ తమకు ప్రసాదం వద్దని అంటుంది. ఇక పోచమ్మ తన చేతిలోని వేప రెమ్మతో ప్రసాదం ఇస్తాను తినమని అంటుంది. 


కుండలో వేప మండలం పెట్టగానే రసాయనం ప్రసాదం కాస్త మంచిగా మారిపోతుంది. అందరూ కళ్లకు హత్తుకొని ప్రసాదం తీసుకుంటారు. చాలా బాగుందని లొట్టలు వేసుకొని తింటారు. పిల్లలకు కూడా ప్రసాదం పెట్టమని పోచమ్మ అంటుంది. తిలోత్తమ, హాసిని, వల్లభలు షాక్ అవుతారు. ఇక ప్రసాదం తిన్న వాళ్లు చక్కగా ఉంటారు కానీ వీళ్లు ముగ్గురు కడుపు పట్టుకొని ఇబ్బంది పడతారు. ముగ్గురు పరుగులు తీస్తారు. లోపలకి వెళ్లి కింద పడిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఏం తిన్నారో ఇలా అయిందని నయని అంటే పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదని సుమన అంటుంది. ప్రసాదం తిననందుకే ఇలా అయిందని పోచమ్మని అనరాని మాటలు అన్నందుకే ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది. ఇక పోచమ్మ లోపలికి వచ్చి కడుపారా తినే ప్రసాదాన్ని ఎవరూ తినకుండా చేస్తే ఇలా అవుతుందని అంటుంది. ఇక విశాల్ ఏం చేశారని అంటుంది. అమ్మవారిని తలచుకుంటే పోతుందని పోచమ్మ అంటుంది. అమ్మా అని ఆర్తితో తెలిసో తెలియక తప్పు చేశానని అర్థించి అరవమని అంటుంది. ఇక తన చేతిలో కర్రతో ముగ్గురి కడుపు మీద కొట్టాలని పోచమ్మ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీకి దెబ్బ మీద దెబ్బ ముందు ప్రీతి, ఇప్పుడు ఎస్‌ఐ.. సీత ప్లాన్ మామూలుగా లేదుగా!