Trinayani Serial Today Episode కుండ ఎందుకు పగలగొట్టారని నయని అడుగుతుంది. మిషన్ సెటప్ కొత్తగా ఉంది ఏం ప్రయోగం చేశారని విక్రాంత్ కూడా అడుగుతాడు. ఇక విశాల్ ఈ సారి సక్సెస్ అవుతావులే అంటే దురంధర అలా అయితే మళ్లీ పెద్ద వదిన రావాలి కదా అని అంటుంది.
నయని: అమ్మగారికి బావగారు చేసే ప్రయోగానికి సంబంధం ఏంటి పిన్ని.
పావనా: దానికి దీనికి లింక్ లేదులే అమ్మ.
డమ్మక్క: భలే భలే అందరూ ఒకే విషయాన్ని ఒకరికి తెలిసి ఇంకొకరికి తెలియక అందరికీ తెలియని పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారని అనిపిస్తుంది.
విక్రాంత్: అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తారేంటి.
తిలోత్తమ: ఏం లేదులే అందరూ వెళ్లండి.
వల్లభ: నువ్వేంట్రా ఇంకా వెళ్లవు.
విక్రాంత్: బ్రో ఆ మెషిన్ చూస్తుంటే అది సూక్ష్మంగా లో లో మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేస్తుందని అనిపిస్తుంది. మీరు ఏదో చేయబోయి మీ ప్రయోగం వికటించిందని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం మీరు గాయత్రీ పెద్దమ్మ మాటలు రికార్డ్ చేయాలని చూశారు.
తిలోత్తమ: ఏడ్చావ్ వెళ్లు.
విశాల్ తన తల్లి ఫొటో పట్టుకొని చూస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉన్నారని నయని అంటే తల్లి మాటలు వినడం చాలా సంతోషంగా ఉందని అమ్మ మాటలు ఇంకా నా చెవిలో వినపడుతున్నట్లే ఉందని చెప్తాడు. ఇక గాయత్రీదేవి గారు పసి పాపగా ఎక్కడున్నారని అన్నారు అని నయని అంటుంది. సరిగా వినలేదు అని విశాల్ అంటాడు. అమ్మ చెప్పింది కానీ ఆనందంలో సరిగా వినలేదు అని అంటాడు. అంత పెద్ద విషయాన్ని లైట్ తీసుకున్నారేంటని నయని అంటుంది. మరోసారి అడిగితే అమ్మగారు చెప్పకపోవచ్చని బంగారం లాంటి అవకాశం పొగొట్టేశారని అని నయని వెళ్లిపోతుంది.
తిలోత్తమ కుడి చేతికి వల్లభ గ్లౌజ్ తొడుగుతాడు. చేతికి గ్లౌజ్ అందంగా ఉందని, జీవం లేని చేతితో కుండ పగలగొట్టావంటే నువ్వు ఎంత గొప్పదానివో అని అంటాడు. విశాల్‌కి ఏం చెప్పిందో తెలుసుకోలేకపోయామని తిలోత్తమ అంటుంది.
వల్లభ: మమ్మీ గాయత్రీ పెద్దమ్మ ఆత్మ నీకు దగ్గరగా వచ్చి నిన్ను ఏం చేయలేదు అంటే సవతి అని నీ మీద జాలి పడింది అని అనుకోవాలి కదా.
తిలోత్తమ: గాయత్రీ అక్క ఆత్మగా వచ్చినా సరే నన్ను నలిపేస్తుంది కానీ ప్రాణాలు తీయదు. నన్ను బలి తీసుకునేది కేవలం తను పసి బిడ్డగా ఉన్నది మాత్రమే. పసి బిడ్డగా గాయత్రీ అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి. విశాల్ వినుంటాడు. నయని అడుగుతుంది. మనం తెలుసుకోవాలి.
ఉదయం పావనా మూర్తి అందర్ని హడావుడిగా పిలుస్తాడు. త్వరలో నయని కవల పిల్లల పుట్టిన రోజు వస్తుందని దాని కోసం మాట్లాడటానికి పిలిచానని అంటాడు. పుండరీనాథం, గానవి ఒకే రోజు పిలిచారు అని తిలోత్తమ అంటే విశాల్ గాయత్రీ పాప అటూ ఇటూ రోజుల్లో పుట్టిందని ఆ పాప పుట్టిన రోజు కూడా అదే రోజు జరుపుదామని అంటాడు. సుమన వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఈ వారంలో ఉలూచి పుట్టిన రోజు ఉందని ఎవరూ తన గురించి మాట్లాడకుండా ఒకటో తారీఖున రాబోతున్న మిగతా వారి పుట్టిన రోజు గురించి మాట్లాడుతున్నారని అలిగిపోతుంది. ఇక విశాల్ ఉలూచి పుట్టిన రోజుని కూడా ఘనంగా చేసేద్దామని అంటాడు. విక్రాంత్ వద్దు అనేస్తాడు. ఎందుకని అందరూ అడిగితే పెద్ద బొట్టమ్మ వస్తే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉందని అంటాడు.
తిలోత్తమ: అలా అని తన సరదా ఆపేస్తారా. ఉలూచి పుట్టిన రోజు వేడుకలా జరగాలి ఖర్చు నేను పెట్టుకుంటా.
సుమన: థ్యాంక్స్ అత్తయ్య. అయితే ఒక విషయం గాయత్రీ పాప పుట్టిన రోజు 1న జరిపించకండి. ఎప్పుడు పుట్టిందో తెలీని పిల్లని గానవి, పుండరీనాథంతో కలిపి చేసి హడావుడి చేయొద్దు.
నయని: నువ్వేం టెన్షన్ పడకు చెల్లి. ఆ రోజే గాయత్రీ దేవి పుట్టిన రోజు కూడా జరుగుతుంది. అంటే అమ్మగారు ఆలోపే ఇంటికి వస్తారు. తీసుకొని వస్తాం సరేనా.
గాయత్రీ ఆడుకుంటూ బాల్ బయటకు విసిరేస్తుంది. విశాల్ హడావుడిగా పరుగెడతాడు. ఎదురుగా గురువుగారు వస్తారు. గురువుగారు ముఖ్యమైన విషయం చెప్పాలని అందుకే వచ్చానని అంటారు. మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండని అందరికీ చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు అలా అన్నారని విశాల్ అడుగుతాడు. దాంతో గురువుగారు నలుగురి పిల్లల చుట్టూ మృత్యుదోషం తిరుగుతుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.