Trinayani Today Episode తిలోత్తమ మంచి నీటిలో విషం కలిపేస్తుంది. ఆ నీటిని గురువుగారికి ఇవ్వమని సుమనతో చెప్తుంది. విషయం తెలియని సుమన తన చేతులతో గురువుగారికి ఇస్తుంది. తిలోత్తమ మనసులో నయని విషం గురించి తెలుసుకున్నా తన చెల్లే విష ప్రయోగం చేసిందని అనుకుంటుందని అనుకుంటుంది.
వల్లభ: మమ్మీ నువ్వు కిచెన్‌లోకి వెళ్లినప్పుడు గురువుగారు చెప్పిన ఓ బంగారు లాంటి మాట వినలేదు.
తిలోత్తమ: ఏమన్నారు..
నయని: గాయత్రీ దేవి అమ్మగారి యోగ క్షేమాలు చెప్పడానికి గురువుగారు ఇంటికి వచ్చారు అత్తయ్య.
తిలోత్తమ: అలాగా ఎంత మంచి అన్నారు గురువుగారు. మీరు తలచుకుంటే గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో కూడా చెప్పేయగలరు అన్న నమ్మకం మాకు ఉంది.
విశాల్: అమ్మ స్వామి వారిని బలవంత పెట్టేయకండి. మన శ్రేయస్సు కోరే వారు మా అమ్మ ఎక్కడుందో తెలిసి ఉంటే ఇప్పటి వరకు చెప్పకుండా ఎలా ఉండే వారు.
నయని: గురువుగారు మీరు ముందు మంచి నీళ్లు తాగండి.
డమ్మక్క: తాగుతారా గురువుగారు.
గురువుగారు: దప్పిక లేకపోయినా అతిథి మర్యాదలు చేసినప్పుడు అతిథి పూర్వకంగా స్వీకరించాలి డమ్మక్క.
గురువుగారు మంచి నీరు తాగేస్తారు. దీంతో వల్లభ ఓం శాంతి అని అంటాడు. హాసిని తిడుతుంది. ఇక తిలోత్తమ మనసులో నయని రియాక్ట్ అవ్వలేదు అని అనుకుంటుంది.
తిలోత్తమ: మనసులో.. విచిత్రంగా ఉందే నయని అడ్డుకోలేదు. గురువుగారు ప్రాణం వదిలే ముందు గాయత్రీ అక్క గురించి నిజం చెప్తారు అని మాకు ఉన్నట్లు తనకు కూడా ఏమైనా ఆలోచన వచ్చి ఉండొచ్చా..
నయని: గురువుగారు నా పెద్ద కూతురు క్షేమంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది కదా. ఆ సమాచారం ఇవ్వండి చాలు.
గురువుగారు: బిడ్డ తల్లి ఒడిలో ఉంది. నువ్వు అనుకున్నట్లే ఉంటుంది నయని.
సుమన: మా అక్క ఎత్తుకుంది ఈ గాయత్రీని గురువుగారు. తను అడిగింది తన కన్న కూతురు గురించి.
హాసిని: అదే కదా చెప్పారు గురువుగారు.
తిలోత్తమ: అంటే..
విశాల్: అదే అమ్మ మా అమ్మ కూడా విశాలాక్షి అమ్మవారి భక్తురాలు కదా అందుకే అలా అన్నారు.
విక్రాంత్: అంటే అమ్మవారి సన్నిధిలో ఉన్నదని అర్థం.
సుమన: అయితే పెద్దత్తయ్య కూడా ఎక్కడో ఆశ్రమం పొందుంటుంది..
విక్రాంత్: నువ్వు వెటకారంగా అన్నావ్ అని అర్థమైంది.
గురువుగారు: ఐదు నిమిషాలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి.
విశాల్: ఏమైంది గురువుగారు.
వల్లభ: రండి గురువుగారు ఏర్పాట్లు చేశాను.
హాసిని: విషయం పూర్తిగా చెప్పకుండా వెళ్లిపోయారు గురువుగారు.
డమ్మక్క: అసలు విషయం ఉంది కాబోలు..
వల్లభ, తిలోత్తమ గురువుగారిని తీసుకొని వస్తారు. గురువుగారు విష ప్రభావం వల్ల గొంతు పట్టుకొని ఇబ్బంది పడతారు. తిలోత్తమ గురువుగారితో విషం స్వీకరించారు ప్రాణం పోతుందని అంటుంది. గురువుగారు చాలా ఇబ్బంది పడతారు. అయినా తిలోత్తమ అదేం పట్టించుకోకుండా గాయత్రీ దేవి గురించి చెప్పాలని అంటుంది. గురువుగారిని బెదిరిస్తుంది. దీంతో ఒక్కసారిగా గురువుగారు పెద్దగా నవ్వుతారు. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. గురువుగారు చనిపోలేదేంటని ఆశ్చర్యపోతారు.
గురువుగారు: సుమన చేత ఇప్పించిన మంచి నీళ్లు చాలా తీయగా ఉన్నాయి తిలోత్తమ. విషం అయితే చేదుగా ఉండాలి కదా.
తిలోత్తమ: అంటే మీరు తాగలేదా..
గురువుగారు: తాగనివ్వలేదు..
వల్లభ: ఎవరు.
గురువుగారు: శివ.. మాటలు నేర్చిన చిలుక నన్ను కాపాడింది తిలోత్తమ.
ఫ్లాష్‌బ్యాక్
తిలోత్తమ విషం కలుపుతున్నప్పుడు చిలక అక్కడికి వస్తుంది. తిలోత్తమ ఓ బ్రహ్మరాక్షసి అని తనని మస్కా కొట్టాలి అనుకొని తిలోత్తమ మంచి నీటి కోసం గ్లాస్ కడుగుతున్నప్పుడు చిలుక విషాన్ని తన చిలుక ముక్కతో పీల్చి బయట పడేసి అందులో నీటిని కలిపేస్తుంది. అది తెలియని తిలోత్తమ నీటినే విషం అనుకొని కలిపుతుంది..
తిలోత్తమ: గురువుగారు మేం చేసిన తప్పునకు క్షమించమని అడుగుతున్నాం. పెద్ద మనసు చేసుకొని ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. రేయ్ కాళ్లకు దండం పెట్టరా.
మరోవైపు సుమన చేతికి గాజులు తీసేస్తుంది. అది చూసిన విక్రాంత్ ఏమైంది అని అడిగితే చేయి నొప్పి వచ్చి మందు పెట్టుకుంటే గాజులు సౌండ్ వచ్చి చిరాకు పెడుతున్నాయి అంటుంది. దీంతో విక్రాంత్ సుమనను తిడతాడు. ఇంట్లో గురువుగారు ఉన్నారని ఆయన ఉన్న వరకు అయినా గాజులు వేసుకో అంటాడు. దీంతో సుమన నేను ఎలా ఉన్నా ఆయన నన్ను గుర్తుపడతారు కానీ మీరే నన్ను గుర్తించడం లేదని అంటుంది. అసలు గురువుగారికి నీళ్లు ఇవ్వడం వల్లే తనకు చేయి నొప్పి వచ్చిందని సుమన అంటుంది. మరోవైపు నయని మంచి నీళ్ల గ్లాస్ పట్టుకొని తిలోత్తమ, వల్లభలకు ఎదురొస్తుంది.
నయని: మంచి నీళ్లు తాగండి అత్తయ్య.
తిలోత్తమ: నేను అడగలేదే..
నయని: మింగుడు పడని విషయం తెలిసినప్పుడు తడి ఆరిపోతుంది గొంతు.
తిలోత్తమ: ఏంటి ఆ విషయం.
వల్లభ: మమ్మీ గురువుగారికి సుమన ఇచ్చిన మంచినీళ్ల గ్లాస్ ఇది.
తిలోత్తమ: నువ్వు నోరు మూసుకోరా..
నయని: అమాయకులు ఆలోచించకుండా మాట్లాడుతారు అత్తయ్య. మా చెల్లిని అడ్డుపెట్టుకొని స్వామి గారి మీద విష ప్రయోగం చేయబోయింది మీ అమ్మ.
వల్లభ: క్యాచ్ చేశావే.
నయని: ఎప్పుడో.
తిలోత్తమ: ఏం తెలీనట్లు ఊరుకున్నావెందుకు..
నయని: మీ వేషాలు ఎంత వరకు వెళ్తాయో చూడాలి అని ఓపిక పట్టాను. శివకు చెప్పింది నేనే.
ఫ్లాష్ బ్యాక్
నయనికి తన దివ్యదృష్టి వల్ల గురువుగారికి అపాయం తలెత్తుతుందని తెలుస్తుంది. ఇంతలో చిలుక శివ ఇక్కడికి వస్తుంది. దీంతో గురువుగారికి అపాయం రాకుండా చూసుకోవాలి అని చిలుకతో నయని చెప్తుంది.
తిలోత్తమ: మహాత్ములని కాపాడి ఏం సాధించావ్ నయని నువ్వు.
నయని: ఈ మాట అనడానికి నోరు ఎలా వస్తుంది అత్తయ్య మీకు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంటి మేలు కోరిన వారిని కూడా ప్రాణ హాని తలపెట్టారు అంటే మీరు ఎంత నీచులో అర్థమవుతుంది. దయ గల వారు కాబట్టి మిమల్ని వదిలేశారు. లేదంటే మిమల్ని శపించేసే వారు.
వల్లభ: అసలు మేం ఆయన్ను స్వర్గానికి పంపాలి అనుకున్నది ఎందుకో తెలుసా..
తిలోత్తమ: రేయ్ చెప్పకురా..
నయని: ఎందుకు.
తిలోత్తమ: చెప్పము నయని. శ్రేయాభిలాషి అయిన ఆయనే మీకు ఇలా ఎందుకు చేశారా అని కుమిలిపోతావ్.
నయని: ఎందుకు ఇలా అన్నారు వీరు. నన్ను ఆలోచనలో పడేయాలి అని ఇలా అన్నారా.
మరోవైపు హాల్‌లోకి వచ్చిన పావనామూర్తి ముడుపు కట్టినట్లు ఉన్న ఓ మూట చూస్తాడు. హాసిని, తిలోత్తమ అందరూ అక్కడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.