Trinayani October 14th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో
నయని: పెద్ద బొట్టమ్మ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు సుమన పెద్ద బొట్టమ్మని చూస్తే నా ఊలూచిని ఎందుకు దాచి పెట్టావు అని గొడవకు దిగుతుంది అని మనసులో భయపడుతుంది నయని.
సుమన: అయినా పాప ఎందుకు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాది అని చిరాకుగా అంటుంది సుమన.
పావనమూర్తి: పోనీ పాపని మాకు ఇవ్వమ్మా మేము జాగ్రత్తగా చూసుకుంటాము.
సుమన: అడగడానికి మీకు సిగ్గు ఉందా? నా పాపని అడగడానికి మీరెవరు?
దురంధర: మేమేమి నీ పాపని ఉంచుకుంటాము అనలేదు. ఏడుస్తుంది కదా జాగ్రత్తగా చూసుకుంటాము అన్నాము అంతే.
సుమన: సరే దానికోసం మీరు ఉచితంగా ఏం చేయనవసరం లేదు. నెలకు పాతికవేలు మీ మొఖాన్న కొడతాను.
విక్రాంత్: పొగరు, డబ్బు ఉందన్న బలుపు, లావైపోయాయి.
తిలోత్తమ: కోటీశ్వరురాలని సుమన ఇలా మాట్లాడడం లేదు. వాళ్లకు కూడా పాకెట్ మనీలా ఉంటుందని చెప్పింది అంతే.
పావనమూర్తి: నయనమ్మ దయవల్ల, హాసినమ్మ దయవల్ల మాకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు లెండి.
వల్లభ: అయినా ఉలుచి రెండో తల్లి అయిన పెద్ద బొట్టమ్మకి కూడా ఈ విషయం చెప్పాలి కదా.
సుమన: ఇంకొకసారి నా కంటికి కనబడని రెండు చేతులు కట్టేసి చంపేస్తాను ఆ పెద్ద బొట్టమ్మని.
తిలోత్తమ: ఇంకెక్కడ పెద్ద బొట్టమ్మ తన జాడే తెలీదు.
హాసిని: అంత అర్జెంట్ అయితే వెళ్లి పుట్టలు అన్ని వెతుక్కోండి అని అనగా అవసరం లేదు అని తిలోత్తమ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తిలోత్తమ తర్వాత హాసినితో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నయని మాత్రం పెద్ద బొట్టమ్మతో మాట్లాడుదామని ఆగుతుంది.
నయని: ఏంటి పెద్ద బొట్టమ్మ ఇప్పుడు వచ్చావు? మొన్నే ఉలూచిని దాచేసావు అని సుమన నీ మీద కోపంగా ఉంది.
పెద్ద బొట్టమ్మ: నేను దాచేయడమేంటమ్మ నా సొంత కూతుర్ని నేను ఎందుకు దాస్తాను? ఇదంతా తిలోత్తమ చేసిన పనే నాకు తెలుసు. దాని చావు గాయత్రమ్మ చేతిలో ఉందని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే ఒక కాటు వేస్తే ప్రాణాలు పోయేవి.
నయని: సరే లే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు సుమన చూస్తే బాగోదు.
పెద్ద బొట్టమ్మ: అప్పుడే వెళ్లిపోమంటావ్ ఏంటమ్మా నేను చూసి, దగ్గరుండి లాలించి కాటిక పెట్టి ముస్తాబు చేయాలి అని వచ్చాను అని ఆశగా చెప్తుంది.
నయని: సుమన చూసిందంటే ఇంకేమైనా ఉందా అని భయంగా అంటుంది నయని.
ఆ తర్వాత సీన్లో తిలోత్తమ వల్లభళ్ళిద్దరూ వాళ్ళ గదిలో కూర్చుని ఉంటారు.
తిలోత్తమ: ఆ నంబర్ ఇక్కడే ఎక్కడో ఉండాలి అని తన పుస్తకంలో ఉన్న ఫోన్ నెంబర్లను వెతుకుతూ ఉంటుంది.
వల్లభ: ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు కదా మమ్మీ.
తిలోత్తమ: ఇలాంటి నంబర్లు ఫోన్లో ఉండకూడదు రా అనే టైంలో హాసిని అక్కడికి వస్తుంది.
హాసిని: మీకోసం జ్యూస్ తెచ్చాను అత్తయ్య. ఇది దేవతలకు దేవుళ్ళకి ఇచ్చే జూసు మీకు దమ్ముంటే ఆపకుండా ఎత్తిన గ్లాస్ దించకుండా తాగండి అని ఛాలెంజ్ చేస్తుంది.
అప్పుడు వల్లభ పౌరుషంతో బలవంతంగా తిలోత్తమకి ఆ జ్యూస్ తాగించేస్తాడు.
తిలోత్తమ: ఓరి వెధవ అది వేపాకు రసం రా అని చెప్పి వళ్లభను కొట్టేస్తుంది.
హాసిని: అవును శివుడు కంఠంలో ఉంటుంది కదా విషం, అదే ఇది. వేపాకు రసాన్ని కూడా తాగలేకపోయారు పిల్లలకి పాలు మానిపిస్తారట అని నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్ లో ఉలూచి ఆపకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దురంధర సుమనకి కాఫీ తెస్తుంది.
దురంధర: పాప ఏడుస్తుంది కొంచెం పాలు ఇవ్వచ్చు కదే.
సుమన: అది ఇందాకటి నుంచి ఏడుపాపట్లేదు నన్నేం చేయమంటారు. ముందు నాకు కాఫీ ఇవ్వండి ఇందాకటి నుంచి ఆకలేస్తుందని చేతిలో ఉన్న కాఫీ ని తీసుకుని తాగుతుంది.
దురంధర: ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తావు కాని పాప గురించి అసలు పట్టించుకోవు అని కొంచెం చిరాకుగా అంటుంది.
సుమన: ఎందుకు ఏ విషయం గురించి అయినా నన్నే వచ్చి అంటారు? ఆగండి ఇప్పుడే వెళ్లి పాలు తెస్తాను అని పాలు తేవడానికి కిందకి వెళ్తుంది సుమన.
అదే సమయంలో దురంధరకి ఒక ఫోన్ రాగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే నయని పెద్ద బొట్టమ్మని చాటుగా అక్కడికి తీసుకొని వస్తుంది. ఉలూచి ని ఏడుస్తూ చూసిన పెద్ద గొట్టమ్మ వెంటనే అక్కడ కూర్చొని తనని ఊళ్లో పెట్టి లాలిస్తుంది.
నయని: పాపని చూసావు కదా పెద్ద బొట్టమ్మ ఇంక నువ్వు వెళ్ళవా? సుమను చూస్తే చాలా పెద్ద గొడవ అయిపోతుంది
పెద్ద బొట్టమ్మ: పాప నా కూతురు కూడా కదా. నాకు పాపని అలంకరించాలని ఉండ్ అని పౌడర్ తీసుకొని ముఖమంతా రాసి కాటిక పెడుతుంది. మరోవైపు నయని కంగారుగా ఉంటుంది. అప్పుడే సుమన మెట్లు పైకి రావడానికి గమనిస్తుంది నయని. ఇంతలో హాసిని పైకి వస్తుంది.
హాసిని: ఏమైంది నయని కంగారు పడుతున్నట్టున్నావు?
నయని: పెద్ద బొట్టమ్మ వచ్చిందక్క.
హాసిని: పెద్ద బొట్టమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు నువ్వు కనిపించవు కానీ సుమనకి కనిపిస్తావు కదా. ముందే నీ మీద కోపంగా ఉంది. వెళ్లిపోవా ప్లీజ్ అని బతిమిలాడుతుంది కానీ పెద్ద బొట్టమ్మ మాత్రం ఏమి పట్టనట్టు పాపని లాలిస్తుంది.
ఇంక చేసేదేమీ లేక నయని వెంటనే పెద్ద డబ్బాలో చపాతి పిండిని తెస్తుంది. పాపని పెద్ద బొట్టమ్మ దగ్గర లాక్కొని హాసిని దగ్గర పెడుతుంది. ఆ పిండిని పెద్ద బొట్టమ్మ మీద జల్లగా పెద్ద బొట్టమ్మ ఆ పిండితోపాటు చపాతి ముద్దలా అయిపోతుంది. ఆ ముద్దని పక్కన పెడుతుంది నయని. ఇంతలో సుమన వాళ్ళందరూ అక్కడికి వస్తారు.
సుమన: నా పాపని నువ్వెందుకు ఎత్తుకున్నావు అక్క?
హాసిని: పిండి పాప మీద పడుతుంది ఏమో అని ఎత్తుకున్నాను చిట్టి.
సుమన: మా అక్క కావాలనే ఈ విధంగా చేసింది. లేకపోతే పిండిని ఎందుకు ఇక్కడ వచ్చి జల్లుతాది అయినా పిండి ముద్దగా ఉందేన్టీ ఏదో జరుగుతుంది.
విశాల్: ఏమైంది నయని ఏదైనా సమస్య.
నయని: ఏం లేదు బాబు గారు ఉంటే మీకు చెప్తాను కదా.
తిలోత్తమ: నాకేదో అనుమానంగా ఉంది.
సుమన: అవును నాకు అనుమానంగా ఉంది. పాపకి నేను కాటుక పెట్టి ముస్తాబు చేయలేదు. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు చేసి ఉంటారు నిజం చెప్పండి అని గట్టిగా అడుగుతుంది.
నయని: నేనే ముస్తాబు చేశాను అని తడబడుతూ చెప్తుంది నయని.
తిలోత్తమ: ఇక్కడ ఏదో జరిగింది చాలా చాలా తేడాగా మాట్లాడుతున్నారు అందరూ. అని అనుకుంటుంది.
దురంధర: మీరు ఎన్నైనా మాట్లాడుకోండి మాకు ముందు ఆకలేస్తుంది అని చెప్పి చపాతి పిండిని కిందకు తీసుకొని వెళ్తుంది. ఆ చపాతీ పిండితో చపాతీలు చేస్తూ ఉంటుంది.
ఇంతలో పైన ఉన్న వాళ్ళందరూ ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
నయని: పిన్నికి పెద్ద బొట్టమ్మ గురించి చెప్పలేదు ఇప్పుడు వెళ్లి చపాతీలను వేయించేస్తాదేమో అని హాసినితో పాటు పరిగెత్తుకుంటూ మెట్లు దిగుతుంది.
వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్లడం చూసిన తిలోత్తమ, వల్లభలు వాళ్ళని వెంబడిస్తారు.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial