Trinayani October 12th Written Update: ఈరోజు ఎపిసోడ్​లో


సుమన: ఆ ఫోటోలో ఉన్న గాయత్రి దేవి అత్తయ్య ఎక్కడా.. అనాధగా తెచ్చుకున్న ఈ గాయత్రీ ఎక్కడ? పోల్చుతున్నాను అని ఏమనుకోవద్దు కానీ ఇదే నిజం.


నయని: ఆధారాలు ఏమైనా ఉంటే అందరికీ నమ్మకం వచ్చేస్తుంది.


హాసిని: అయితే ఆధారాలు చూపించండి. అప్పుడు నమ్ముతాము లేకపోతే నమ్మము.


తిలోత్తమ: ఆధారాలు ఉన్నాయి. అన్నీ పకడ్బందీగానే ఆలోచించి వచ్చాము. ఆ పాపే కానీ నిజంగా గాయత్రి అక్క అయితే తన కుడి చేతి మీద నాకు కుడి చేయి పెడితే అప్పుడు నిరూపించవచ్చు అని అనగా నయనికి గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.


నయని: అవును గురువుగారు కూడా ఒకవేళ గాయత్రి అత్తయ్య చేయి తిలోత్తమ అత్తయ్య మీద పడితే అప్పుడు మంటలు వస్తాయి అని చెప్పారు. అది తేలిస్తే సరిపోతుంది.


దురంధర: మంటలు వస్తే కాలుతదేమో జాగ్రత్త.


తిలోత్తమ: అన్నిటికి తెగించే వచ్చాను. అని అనగా వల్లభ గాయత్రి కుడి చేతిని ముందుకు చాచుతాడు.


వల్లభ: జాగ్రత్త మమ్మీ గాయత్రిని, ఎత్తుకునేది నేనే. ఒకవేళ మంటలు వస్తే వెంటనే నా మీద నీళ్లు వేసేయండి అని భయపడిపోతాడు.


హాసిని: విశాల్.. ఏదో ఒకటి చెయ్ అని అంటుంది.


విశాల్: చేసేదేముంది అంత గట్టిగా ఫిక్స్ అయ్యారు కదా నేనేమీ చేయలేను అని చేతులెత్తేస్తాడు.


అప్పుడు తిలోత్తమ కొంచెం భయంగా తన కుడి చేతిని గాయత్రి కుడి చేతి మీద పెడుతుంది కానీ అక్కడ మంటలు ఏవి రావు. తన ఎడమ చేతిని కూడా పెడుతుంది.. రెండు చేతుల్ని కలిపి ముట్టుకుంటుంది. కానీ మంటలు ఎంతకీ రాకపోయేసరికి నిరాశ పడిపోతుంది తిలోత్తమ.


సుమన: మంటలు రావాలి కదా మంటలు ఏవి?


నయని: ఏం పర్వాలేదు శాస్త్రి గారి మనవరాలే గాయత్రి అయితే బాగుండు అనుకున్నాను ఏం పర్లేదు నా సొంత కూతురుతో సమానం అమ్మ నువ్వు అని గాయత్రిని వల్లభ దగ్గర నుంచి ఎత్తుకుంటుంది నయని.


విశాల్: ఇంక నేను గాయత్రిని పడుకోపెడతాను అని చెప్పి నయని దగ్గర నుంచి గాయత్రిని తీసుకొని వెళ్ళిపోతాడు.


మరోవైపు తిలోత్తమ వల్లభలు వాళ్ల గదిలో కూర్చుని ఉంటారు.


వల్లభ: అమ్మ అఖండ స్వామి నీకేమైనా బాకీ ఉన్నారా? లేకపోతే ఎందుకు లేనిపోని విషయాలన్నీ చెప్తారు. నిజంగా గాయత్రీ, గాయత్రి పెద్దమ్మ అయితే ఈ పాటకి మాటలు రావాలి కదా.


తిలోత్తమ: మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు?


వల్లభ: గాయత్రి పెద్దమ్మని కనిపెట్టాలి. ఎలాగో ఆ గాయత్రి, గాయత్రీ దేవి పెద్దమ్మ కాదని మనకి తెలిసిపోయింది. కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైనా గాయత్రి పెద్దమ్మ అవ్వచ్చు అందుకే ఆ వైబ్రేషన్స్ నీ మీద పడుతున్నాయి ఏమో.


తిలోత్తమ: అవును. గాయత్రి అక్కని ఈ ఇంటి ఉన్న స్థలం దగ్గరే పూడ్చేశాము. కాబట్టి ఆ వైబ్రేషన్స్ నా మీద ఉన్నాయి. అయితే ఇంట్లో ఉన్న నలుగురు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే నయని ప్రసవించిన రెండో సంవత్సరం వస్తే నా ప్రాణానికి ప్రమాదం వచ్చినట్టే.


వల్లభ: అలాగే దేవీ నవరాత్రులలో ఒకరోజు పిల్లలకి పాలు దొరకదు కదా ఆ రోజు ఎవరైతే పాలు లేకుండా కూడా ఆరోగ్యంగా ఉంటారో వాళ్లని కూడా గమనించాలి.


తిలోత్తమ: ఏంటి వల్లభ ఈ రోజు ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు? నువ్వు నా కొడుకువేనా? అని అంటుంది.


ఆ తర్వాత సీన్​లో హాసిని విశాల్ దగ్గరికి వస్తుంది.


హాసిని: అదేంటి విశాల్ ఏం జరుగుతుంది? ఒకవేళ గాయత్రి మా అత్తయ్య చేతిని తాకితే మంటలు రావాలి కదా. అక్కడ రాలేదేంటి అంటే ఈ గాయత్రి మా అత్తయ్య కాదా?


విశాల్: ఈ గాయత్రి మా అమ్మే అని అనగా ఒక మూల నుంచి ఆ మాటలని ఎవరో వీడియోలో రికార్డ్ చేస్తారు.


విశాల్: అసలు ఏం జరిగిందంటే అని కథ చెప్పుకుంటూ వస్తాడు.


అఖండస్వామి తిలోత్తమ వాళ్లకి గాయత్రి గురించి నిజం చెప్పగా ఒక మూల నుంచి విశాల్ ఆ మాటలను వింటాడు. వెంటనే గాయత్రి దగ్గరకు వెళ్లి తన చేతులకి చల్లటి పదార్థం ఒకటి రాస్తాడు.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial