Trinayani October 11th Written Update: ఈరోజు ఎపిసోడ్లో
తిలోత్తమ: ఈరోజు గాయత్రి వల్లే నేను నడవగలుగుతున్నాను. ఆ పాప గంట వేయడం వల్ల దాని మీద పడి ఇప్పటి వరకు ఎన్నో పాట్లు పడుతూ నడుస్తూ వస్తున్న కానీ ఇప్పుడు కాలు బాగు అయిపోయింది. తను చేసిన మంచి పనికి తన నుదుటిన ముద్దు పెట్టాలి.
అఖండస్వామి: నీ మృత్యువుకి ముద్దు పెట్టాలనుకుంటున్నావా తిలోత్తమా? అని అనగా ఒకేసారి తిలోత్తమ, వల్లభలు షాక్ అవుతారు.
తిలోత్తమ: ఏంటి స్వామి మీరు మాట్లాడుతున్నది? నా మృత్యువుకి తను కారణమేంటి?
అఖండస్వామి: మీ కుటుంబంలో గాయత్రి దేవి చేతిలో నీ మృతువు ఉన్న సంగతి నీకు తెలుసు. అయితే ఆ చిన్న పాప చేతిలోనే నీకు చావు ఉంది, ఇది తెలుసుకో.
తిలోత్తమ: అంటే ఆ గాయత్రి దత్తకు తీసుకున్న పాప కాదా? నయనికి పుట్టిన సొంత బిడ్డా?
అఖండ స్వామి: నేను నీకు విషయం మాత్రమే చెప్పగలను వివరాలు నువ్వే తేల్చుకోవాలి. ఆ గాయత్రి పాప మాత్రం గాయత్రి దేవి అంసే. తన చేతుల్లో నీ చావు మాత్రం తథ్యం, మిగిలినవన్నీ నువ్వే తెలుసుకో.
తిలోత్తమ: ఇప్పుడే వెళ్తాను స్వామి. వెళ్లి తాడోపెడో తేల్చుకొని వస్తాను అని వెంటనే వల్లభను తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది తిలోత్తమ.
మరోవైపు నయని గది నిండా అమాంతమైన గాలి వచ్చి పేపర్లని ఎగిరిపోతూ ఉంటాయి. అప్పుడు గాయత్రీ దేవి ఫోటో కూడా ఆ గాలికి ఊగి కింద పడిపోతు ఉండగా నయని హాసినిలిద్దరూ ఒకేసారి వచ్చి ఆ ఫోటోని పట్టుకుంటారు.
నయని: మనిద్దరం కానీ సమయానికి రాకపోయి ఉంటే గాయత్రి అమ్మ గారి ఫోటో బద్దలైపోయేది అని అనగా అప్పుడే ఎద్దులయ్య అక్కడికి వస్తాడు.
ఎద్దులయ్య: ఫ్యాన్ ఆపి, కిటికీలు అన్నీ వేసి ఉంటే మీకు గాలి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అమ్మగారి ఫోటో కింద పడుతుందంటే మీకు ఏదో ఒక ప్రమాదం ముంచుకుని వస్తుందని ప్రకృతి చెప్తుంది. జాగ్రత్త అని కిందకు వచ్చేస్తాడు.
మరోవైపు తిలోత్తమ, వల్లభలు ఇంటికి చేరువలో ఉంటారు. అదే సమయంలో కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉంటారు.
ఎద్దులయ్య: ప్రమాదం రానున్నది. గాయత్రీని నాకు ఇస్తే నేను తనని ఎత్తుకెళ్లి పోతాను.
సుమన: చూశారా మీ కళ్లముందే ఎత్తుకెళ్లిపోతాను అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో.
నయని: శివ భక్తులు ఏం చెప్పినా దానికి ఒక కారణం ఉంటుంది. అయినా ప్రమాదం వస్తే నాకు తెలియాలి కదా ఎద్దులయ్య?
ఎద్దులయ్య: ఆ ప్రమాదం గురించి నీకు తెలియదు అమ్మ. వెంటనే గాయత్రి పాపను ఇస్తే నేను అలా తీసుకుని వెళ్లి తిప్పుతాను అని అంటాడు. అదే సమయంలో తిలోత్తమ, వల్లభలు ఇంటి వరకు వస్తారు.
వల్లభ: ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావ్ మమ్మీ?
తిలోత్తమ: ఒకవేళ స్వామి చెప్పింది నిజమైతే నా చేతిలో ఆ గాయత్రి మరణం తథ్యం. ముందు ఆ గాయత్రిని ఎలా చంపేనో అదే విధంగా ఈ గాయత్రిని కూడా చంపుతాను. ఈ ఇంట్లో మరణం అయితే తథ్యం. నేను తనని చంపుతానా, తనే నన్ను చంపుతుందా, లేకపోతే ఇద్దరూ చస్తామా అనేది వెళ్లి తెలుసుకోవాల్సిన విషయం అని ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు.
దురంధర: ఎక్కడికి వెళ్లారు ఇప్పటి దాకా?
తిలోత్తమ: మరణాన్ని వెతుక్కుంటూ వెళ్లాము. గండానికి కారణం ఎవరో తెలుసుకున్నాము.
నయని: ఇంట్లో ఎవరికైనా ప్రాణ గండం ఉందా అత్తయ్య?
తిలోత్తమ: ఉంది కానీ అంతకుముందు వల్లభ వెళ్లి గాయత్రీని ఎత్తుకొని రా
వల్లభ: వద్దు మమ్మీ ప్లీజ్ నేను ఎత్తుకోను.
హాసిని: చిన్నపిల్లను చూసి భయపడతారు ఎందుకు?
వల్లభ: అది పిల్ల కాదు అదే సమస్య అని చెప్పి తిలోత్తమ బెదిరించడంతో భయం భయంగా వెళ్లి గాయత్రిని ఎత్తుకుంటాడు వల్లభ.
తిలోత్తమ: విషయం ఏమిటంటే ఈ గాయత్రి ఎవరో కాదు ఆ గాయత్రి అక్క అంశమని అనగానే ఒకేసారి అందరి ముఖ చిత్రాలు మారిపోతాయి. నయని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
నయని: ఏమిటి అత్తయ్య మీరు చెప్పేది. దత్తకు తీసుకున్న పాపే నా సొంత కూతురా? అంటే తప్పిపోయిందనుకున్న నా పాపని నేను మళ్లీ దత్తత తీసుకున్నానా? అయినా మీకు ఈ విషయం ఎవరు చెప్పారు గురువుగారు చెప్పారా? అని ఆనంద పడిపోతూ ఉంటుంది.
హాసిని: ఒక నిమిషం అందరూ ఆగండి. అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అయినా గాయత్రి నయని సొంత కూతురు అంటే నేను నమ్మను. ఎందుకంటే గాయత్రి అనే పేరు పెట్టినంత మాత్రాన సొంత కూతురు అయిపోదు కదా.
సుమన: ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే దత్తకు ఇచ్చిన వాళ్లని మనం స్వయంగా చూసాము. వాళ్ల కుటుంబం అంతా తెలుసు. వాళ్ల కళ్లముందే దత్తత కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు వచ్చి మా అక్క సొంత కూతురు అంటే ఎలా నమ్మేది? అని అడుగుతుంది సుమన. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial