వల్లభ రంపంతో పెట్టెను కోసే ప్రయత్నం చేయడంతో వల్లభకు షాక్ కొట్టింది. ఈ విషయాన్ని పావనమూర్తి అందరికీ చెప్పడంతో అందరూ వల్లభకు చీవాట్లు పెట్టారు. తప్పు చేయాలని చూస్తే అమ్మవారు ఎవరినీ వదలదని నయని సీరియస్ అయింది. ఆ పెట్టె చాలా పవర్‌ఫుల్ అని విశాల్, నయని అందరికీ జాగ్రత్తలు చెప్పారు. దీంతో తిలోత్తమ తన పెద్దకొడుకును అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఇక రాత్రి నయని, విశాల్, హాసిని, దురంధర, పావనమూర్తి అందరూ ఓ చోట కూర్చొని ఆ చెక్క పెట్టెను ఎలా తెరవాలా అని, చెక్క పెట్టె షాక్ కొట్టడం ఏంటని రకరకాలుగా ఆలోచించారు.
నయని: ఆ పెట్టెకు నా భవిష్యత్తుకు ఏదో సంబంధం ముడిపడి ఉందనిపిస్తుంది. గురువుగారు, విశాలాక్షి, డమ్మక్క వీరందరూ పరోక్షంగా అదే విషయాన్ని మరీ మరీ చెప్తూ గుర్తుచేస్తున్నట్లు అనిపించింది.
విశాల్: నయని అలాంటప్పుడు స్వామి వారిని ఇంటికి పిలిపించి అడిగితే ఎలా పెట్టెను ఓపెన్ చేయాలో చెప్పారు కదా.
పావనమూర్తి: ఐడియా బాగుంది అల్లుడు. మనం రిస్క్ తీసుకుని గాయాలపాలవ్వడం కంటే పెద్దల సలహాలు తీసుకొని శాంతిపూజలు జరిగి పెట్టెను తెరవవచ్చు. రేపు గురువుగారు ఇంటికి వస్తున్నారు అంతే.
ఇక మరోవైపు వల్లభ భయంతో గజగజ వణికిపోతుంటాడు. వాళ్ల అమ్మ వల్లభకు ధైర్యం చెప్తుంది. వల్లభ, తిలోత్తమ కూడా పెట్టె గురించే మాట్లాడుకుంటారు. తనకు చెప్పకుండా వెళ్లావని తిలోత్తమ చీవాట్లు పెట్టింది.
తిలోత్తమ: ఆ పెట్టె నయనికి కలలో కనిపించిందని.. అది దొరికితే తనేంటో, తన భవిష్యత్ ఏంటో తెలుసుకునే ఆస్కారం ఉందని చెప్పింది. ఇప్పటికే బంగారం లాంటి జీవితం గడుపుతోన్న నయనికి మిగతా వాళ్లతో పనేముంది.
వల్లభ: మమ్మీ నయనికీ ఏదైనా కనిపించింది అంటే అది ఎవరికైనా వచ్చే ఆపదకు లింక్ అయి ఉంటుంది. ఆ పెట్టెకు ఇంకెవరి ప్రాణాలకు అయినా లింక్ ఉందా అనిపిస్తోంది
తిలోత్తమ: కరెక్టే.. అమ్మవారి శక్తి ఉన్న ఆ పెట్టెకు చితి పెట్టించుకునే వారికి సంబంధం ఉండే ఉంటుంది. కానీ అది ఎవరు ఏంటి అనేది తెలీదు.
వల్లభ: ఓపిక పట్టి చూస్తే రెండు రోజుల్లో తెలుస్తుంది మమ్మీ..
మరోవైపు నాగులాపురం దగ్గర కనిపించి స్వామీజి పెట్టె తెరిసే సమయం ఆసన్నమైంది కాలా అంటూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక విశాల్ కుటుంబ సభ్యులందరినీ హాల్‌లోకి పిలిచాడు. పెట్టెను తెరవాలి అనుకుంటున్నానని చెప్తాడు. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు.
గురువుగారు: ఆ పెట్టె ఆట వస్తువు కాదు తిలోత్తమ.. విశాలాక్షి అమ్మవారు ఆడే ఆటకు ప్రతీకారం.
వల్లభ: నా బలం చాలదనా గురువుగారిని రప్పించారు. నా అంత కండపుష్టి లేని మహర్షి గారిని రప్పించారు.
విశాల్: బ్రదర్ వారికి ఉన్నంత బుద్దిబలం మనకు లేకపోవచ్చు.
డమ్మక్క: మనకి అంటే నీకే పుత్ర(వల్లభను ఉద్దేశించి)
తిలోత్తమ: డమ్మక్క నువ్వు వివరించక్కర్లేదు. తాడే తెగడం లేదు. గొళ్లెమే తెరచుకోలేనప్పుడు గురువు గారు వచ్చి ఏం చేస్తారు అని అంటున్నాడు. అంతే
డమ్మక్క: అసలు ఎందుకు ఆ పెట్టె తెరచుకోవడం లేదు అది ఆలోచించారా. లేదు.. గురువయ్యా అది అర్ధమయ్యేలా చెప్పండి.
గురువుగారు: నయనికీ కలలో కనిపించిన ఈ పెట్టెను నాగులాపురం నాగలక్ష్మి గుడిదగ్గర రెండు పుష్కరాల పిమ్మటే అంటే 24 ఏళ్ల క్రితమే భద్రంగా దాచిపెట్టింది ఎవరో తెలుసా అని అడిగి గాయత్రీ దేవి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
తిలోత్తమ: గాయత్రీ అక్క పెట్టెను అంత దూరం వెళ్లి దాచిపెట్టడం వెనక అర్థమేంటి గురువుగారు
గురువుగారు: భద్రత కోసం అని చెప్పారు.
దీంతో అందరూ ఆ పెట్టె ఎలా తెరుచుకుంటుంది మరీ అని ఆలోచిస్తుంటే ఇంతలో డమ్మక్క గాయత్రీ దేవే వచ్చి తెరవాలి అంటుంది. దీంతో సుమన, తిలోత్తమ, వల్లభ గట్టిగా నవ్వుతారు.
తిలోత్తమ: పొద్దు పొద్దునే ఇలా నవ్విస్తారు అనుకోలేదు గురువుగారు
గురువుగారు: హాస్యంగా నీకు ఏది అనిపించింది.
తిలోత్తమ: గాయత్రి అక్కను ఏడాది అయినా వెతికి పట్టుకోలేనప్పుడు ఇప్పుడు అక్క వచ్చి పెట్టె తెరవాలి అంటే ఎలా గురువుగారు
వల్లభ: రేయ్ .. విశాల్ మీ అమ్మని ఈ జన్మలో అయినా చూడాలని పరితపించేవాడివి కదా.. చూడు చూడు ఇప్పుడు మీ అమ్మే వచ్చి ఆ పెట్టె తెరుస్తుందంట
నయని: బాబు గారు బాధ పడతారు అన్న ఇంకితం కూడా లేదు కదా మీకు
సుమన: అక్క గాయత్రి అత్తయ్య ఆత్మ వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు రావాలంటే అక్కడ ఆడుకుంటోంది చూడు ఆ పసి పాప వచ్చి పెట్టె తెరవాలి.
తిలోత్తమ: సాధ్యమయ్యేది చెప్తే చెవులారా వింటాం. కనులారా చూస్తాం.
దీంతో ఎద్దులయ్య ఏంటి పెద్దమాత గాయత్రి దేవిని చూడాలని ఉందా అని అడుగుతారు. దీంతో తిలోత్తమ చూపించు ఎద్దులయ్య 10 రూపాయలు ఇస్తా అని వెటకారం చేస్తుంది. దీంతో వల్లభ, సుమన నవ్వుతారు. ఇక నయని పరిహాసాలు ఆడకండి మంచిది కాదు అని హెచ్చిరిస్తుంది. ఇంతలో డమ్మక్క అద్భుతాలు జరగనున్నప్పుడు బుద్ధి లేని వారే ఇలా నవ్వుతారు అంటుంది. దీంతో సుమన అయితే ఇప్పుడు అద్భుతం జరగబోతుందా అని ప్రశ్నిస్తుంది. మా అక్క కన్న పెద్ద కూతురు ఆకాశం నుంచి ఊడి పడుతుందా అని సుమన ప్రశ్నించడంతో ఇవాళ్టి ఏపిసోడ్ పూర్తవుతుంది.