నందు స్టైలిష్‌గా రెడీ అయి ఫైల్ పట్టుకుని ఉంటాడు. వెనక నుంచి చూసిన నందు వాళ్ల నాన్న ఎవరో వచ్చారని నందు ని పిలుస్తాడు. నందు తిరిగి చూడగానే ఆశ్యర్యపోతాడు. లోపలి నుంచి వాళ్ల అమ్మ నందును చూస్తూ సంతోషిస్తుంది. వాళ్ల నాన్న  కొత్తగా రెడీ  అయ్యావేంటి అని అడుగ్గానే నందు వాళ్ల అమ్మ నా కొడుకు స్థాయి ఇప్పుడు మారింది అందుకే ఇలా సూటు, బూటు వేశాడు అంటూ సంబరంగా చెప్తుంది. ఇంతలో తులసి రెడీ అయ్యి వస్తుంది. తులసి కూడా చాలా బాగా రెడీ అయ్యిందని అనుకుంటారు అందరూ.. హనీ వల్లే ఇలా రెడీ అయ్యానని తులసి చెప్తుంది.


నందు: నిజానికి ఇలా రెడీ అవ్వమని నేనే చెబుదామనుకున్నాను. ఏమనుకుంటావోనని ఆగిపోయాను. ఓ పెద్ద కంపెనీకి సీఈవో అన్నప్పుడు ఈ మాత్రం గెటప్‌ ఉండాలి.


నందు అమ్మ: లేకపోతే నాకు నీకు తేడా ఏముంటుందమ్మా?


తులసి: సూటు వేసుకునే సామ్రాట్‌ గారినే నేను సింపుల్‌గా మార్చేశాను. అలాంటిది ఇప్పుడు నేనిలా గెటప్‌ మార్చాను.


నీకింద పనిచేసే వాడే సూటు బూటు వేసుకుంటే లేనిది నువ్వు ఇలా తయారవడంలో తప్పు లేదమ్మా అంటారు ఇంతలో టైం అవుతుందని ఇద్దరూ వెళ్తారు. నందగోపాల్‌, తులసి ఆఫీసుకు వెళ్తున్న వీడియో  లాస్య చూసి.. కోపంగా


లాస్య: సిగ్గుండాలి మాజీ పెళ్లానికి ఇంతలా వంగి వంగి సేవలు చేస్తున్నాడు. మేడం గారు హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పైగా కులుక్కుంటున్నారు. నందు మీద కన్నేశాం అందుకే నీకు దూరం చేశామంటే మాత్రం అమ్మగారికి కోపం ఇంత పొడుగున వస్తుంది. వదిలేసిన వాడి వంక తిరిగి చూసేది లేదు అంటూ నీతులు చెప్తుంది. ఇద్దరూ కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు. వదిలిపెట్టను తులసి నందును ఆయుధంగా చేసుకుని నీ మీద యుద్దం మొదలుపెడతాను. నందు చేత తప్పులు చేయించి నీకు వ్యతిరేకంగా మారుస్తాను.


అంటూ లాస్య కోపంగా చూస్తుండిపోతుంది. మరోవైపు హనిమూన్‌లో ఉన్న విక్రమ్‌, దివ్య హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు.


విక్రమ్‌: అమ్మాయిగారికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో..? ఆరు బయట ప్రేమగా మొగుడికి తినిపిస్తున్నారు.


దివ్య: మనం ఎలాగూ పర్మినెంట్‌గా ఇక్కడ ఉండము. అదే నా ధైర్యం. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.


విక్రమ్‌ : నాది ఒక్కటే పాలసీ ప్రేమ ఉన్నచోట భయం ఉండకూడదు. భయపడేవాడు అసలు ప్రేమించకూడదు.


దివ్య: వావ్‌ ఏం చెప్పారు మాస్టారూ మనసు లాగేశారు.


విక్రమ్‌: కొత్తగా ఇప్పుడు లాక్కోవడం ఏంటి? ఎప్పుడో జరిగిపోయింది. అందుకే ఈ మహారాణి నాలో సగభాగం అయ్యింది.


అనగానే జాను, బసవయ్య ఇద్దరూ కలిసి వస్తుంటారు. వాళ్లను చూసిన విక్రమ్‌.. ఆ తండ్రీ కూతుళ్లు మనవైపే వస్తున్నారు. వాళ్ళు మనల్ని చూస్తే ఇక అంతే అంటూ కంగారు పడుతుండగానే వాళ్లిద్దరూ విక్రమ్‌, దివ్యలు కూర్చున్న టేబుల్‌ దగ్గరకు వచ్చి వాళ్లకు ఎదురుగా కూర్చుంటారు. జాను ఇడ్లీ ఆర్డర్‌ చేస్తుంది. ఇడ్లీ తినాలంటే ముసుగు తీసయాలని బయవయ్య గుర్తు చేస్తాడు. ఇడ్లీ సాంబారు దివ్య మీద వేసి వాళ్లిద్దర్ని డిస్టర్బ్‌ చేయడానికి ఆర్డర్ చేశానని జాను చెప్తుంది. ఇంతలో ఇడ్లీ సాంబారు రాగానే.. సాంబారు చాలా ఉందని మీరు ఇంత తీసుకోండని జాను, దివ్యకు సాంబారు ఇవ్వబోతుంటే దివ్య వద్దని చేతితో సాంబారు ప్లేటును తోస్తుంది. సాంబారు బసవయ్య మీద పడుతుంది. దీంతో బసవయ్య అక్కడి నుంచి కుయ్యో మొర్రో అంటూ పరుగెత్తుతాడు. జాను అయన వెనకాలే వెళ్తుంది.   


ఆఫీసుకు వచ్చిన తులసి, నందగోపాల్‌కు ఆఫీసు స్టాప్‌ గ్రాండ్‌ వెల్‌కం చెప్తారు.


తులసి: ఈ డెకరేషన్‌  అంతా ఏంటి ఏమైనా స్పెషల్‌ డే నా?


మేనేజర్‌: మేమంతా ఇష్టపడే మా బాస్‌ తులసి గారు సీఈవో గా రావడం కంటే స్పెషల్‌ డే ఏముంటుంది మేడం.


స్టాప్‌: ఈరోజు మా అందరి ఇళ్లల్లో నిజమైన దీపావళి జరుపుకుంటున్నాం. దేవుడు మా ప్రార్థనలు విన్నాడు. మేము కోరుకున్న వరాన్ని ప్రసాదించారు.


తులసి: ఇక ఆపుతారా? నాకు పొగడ్తలు పడవని మీకు తెలుసుగా!


మేనేజర్‌: మేం పొగడకుండా ఉండలేమని మీరు తెలుసుకోవాలి మేడం.


స్టాప్‌: సామ్రాట్‌ గారితో పాటు మా అందరి జీవితాలు కూడా సమాధి అయినట్లే అనుకున్నాం.


అనగానే తులసి అందరం కలిసి బాగా కష్టపడి ఈ కంపెనీని అభివృద్ది పథంలోకి తీసుకెళ్దాం. అంటూ అందరికీ విషెష్‌ చెప్పి సీఈవో చాంబర్‌లోకి వెళ్లిన తులసి సీఈవో చైర్‌లో కూర్చోకుండా ఏదో ఆలోచిస్తుంటే


నంద: ఆగిపోయావేం తులసి?


తులసి: జ్ఙాపకాలు నా కాళ్లకు సంకేళ్లు వేశాయి. అడుగు ముందుకు పడకుండా ఆపేశాయి. ఈ క్యాబిన్‌లో కూర్చోవడం నావల్ల కాదు.


నంద: మొదటి అడుగులోనే  వెనకడుగు వేస్తే ఎలా? చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎన్నో మరెన్నో జ్క్షాపకాలు తట్టుకుని నిలబడాలి. ఆ సీట్లో కూర్చోవాల్సింది ఇలా బేలగా దిగులు పడే తులసి కాదు. నిన్నటి బోర్డు మీటింగ్‌లో వీరంగం ఆడిన తులసి.


తులసి: అది బాధలోంచి పుట్టుకొచ్చిన కోపం. సామ్రాట్‌ గారి చైర్‌లో కూర్చున్న ధనంజయ్‌ గారిని చూస్తే పుట్టుకువచ్చిన కోపం. అది నేను కోరుకునే తులసి కాదు.


నంద: కానీ అందరూ కోరుకునే తులసి తనే కూర్చో తులసి.


అనగానే వేరే చైర్‌ వేసుకుని తులసి కూర్చుంటుంది. దీంతో నంద గోపాల్‌ ఆశ్యర్యంగా చూస్తుంటే ఎందుకలా చూస్తున్నారు అంటూ తులసి అడుగుతుంది. ఏం లేదు నీ సంస్కారం చూసే సామ్రాట్‌ గారు నీకీ బాధ్యతలు అప్పజెప్పాడనిపిస్తుంది అని నంద చెప్తాడు. ఇక  లాస్య కంపెనీలో ఉన్న రాజుకు ఫోన్‌ చేస్తుంది. నందగోపాల్‌ ను పొగిడి ఆయన చేత తప్పులు చేయించాలని సూచిస్తుంది. అలాగే చేస్తాను మేడం అంటూ ఇప్పటి నుంచి నేను అదే పనిలో ఉంటానంటాడు రాజు.


హోటల్‌ రూంలో కాలు తుడుచుకుంటూ బాధపడుతుంటాడు బసవయ్య ఇంతలో జాను అక్కడికి వస్తుంది.


బసవయ్య: ఎంకి పెళ్లి సుబ్బి చావు కు వచ్చిందన్నట్లు.. నీ పెళ్లి నా చావుకు వచ్చింది కదే ఈ సాంబారు ప్లాన్‌ ఏంటే..?


జాను: ప్లాన్‌ పవరేంటే కాలు తోలూడిన నీకింకా అర్థం కాలేదా? డాడీ దివ్య మీద పడాల్సిన వేడి వేడి సాంబారు పొరపాటున నీ మీద పడింది. లేకపోతేనా ఈ పాటికి హనిమూన్‌కు పులిస్టాఫ్‌ పెట్టి బావ వాళ్లు ఇంటికి బయలుదేరేవాళ్లు. సారీ డాడీ నేను కావాలని చేయలేదు.


బసవయ్య: నా గ్రహచారం ఇలా అఘోరించింది. నువ్వు మాత్రం ఏం చేస్తావ్‌ కానీ.


అంటూ బాధపడుతుంటే విక్రమ్‌, దివ్య వచ్చి ఎలా ఉందని అడుగుతారు. డాక్టర్‌ దగ్గరకు వెళ్దామని చెప్తారు. అయితే దివ్య కిందపడేటట్లు చేస్తుంది జాను. కింద పడ్డ దివ్యను విక్రమ్‌ తన చేతులతో ఎత్తుకుని పోతుంటే జాను, బసవయ్య బాధగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.