తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ చూస్తే... ప్రతి వారం 'కార్తీక దీపం 2' నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఈ వారం కూడా ఆ సీరియల్ మొదటి స్థానంలో నిలిచింది. అది పక్కన పెడితే... అసలు 10 ప్లస్ రేటింగ్ దాటిన సీరియల్స్ ఎన్ని ఉన్నాయి? అనేది చూస్తే... నాలుగు అంటే నాలుగు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అన్నీ స్టార్ మా సీరియల్స్ కావడం గమనార్హం. 'జీ తెలుగు' ఛానల్ విషయానికి వస్తే... లాస్ట్ వీక్ టాప్ ప్లేసులో ఉన్న 'మేఘ సందేశం' ఈ వారం కూడా మొదటి స్థానంలో నిలిచింది. స్టార్ మా, జీ తెలుగు ఛానళ్లలో ఏయే సీరియల్స్ ఎంత రేటింగ్స్ సాధించాయి? అనేది చూస్తే.... 

'స్టార్ మా'లో 10 ప్లస్ దాటినవి నాలుగుTRP ratings of Telugu serials Star Maa TV: స్టార్ మా ఛానల్ ఫ్రంట్ రన్నర్ 'కార్తీక దీపం 2 నవ వసంతం' సీరియల్ ఈ వారం 12.26 టీఆర్పీ సాధించింది. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఇంతే రావడం విశేషం. 10 ప్లస్ టీఆర్పీ సాధించిన మిగతా సీరియల్స్ మూడు ఏమిటంటే... 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (11.79), 'గుండె నిండా గుడిగంటలు' (10.47) 'ఇంటింటి రామాయణం' (10.46). 

'స్టార్ మా' మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'చిన్ని' (8.23), 'నువ్వుంటే నా జతగా' (7.17), 'బ్రహ్మముడి' (6.94), 'పలుకే బంగారమాయెనే' (6.02), 'నిన్ను కోరి' (5.79), 'మగువా ఓ మగువా' (5.34), 'పాపే మా జీవనజ్యోతి' (5.18), 'వంటలక్క' (4.67), 'మామగారు' (4.94) రేటింగ్ సాధించాయి.

మళ్ళీ 'మేఘ సందేశం' టాప్...'జీ తెలుగు'లో మిగతా సీరియల్స్?'జీ తెలుగు' ఛానల్ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'మేఘ సందేశం' లాస్ట్ వీక్ 5.80 టీఆర్పీ సాధించింది. ఈ వారం 7.16 టీఆర్పీతో తన టాప్ ప్లేస్ అలా నిలబెట్టుకుంది. 'చామంతి' 6.86, 'జగద్ధాత్రి' 6.85, 'లక్ష్మీ నివాసం' 6.04 టీఆర్పీతో ఆ తర్వాత మూడు స్థానాల్లో నిలిచాయి. 'అమ్మాయి గారు' సీరియల్ 5.20 టీఆర్పీతో ఐదో స్థానంలో ఉంది. లాస్ట్ వీక్ ఆ సీరియల్ పొజిషన్ కూడా సేమ్.

Also Read: 'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'కు మించి మణి తీశారా? సినిమా హిట్టా? ఫట్టా?

'జీ తెలుగు'లో మిగతా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే... 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (4.24), 'గుండమ్మ కథ' (4.23), 'పడమటి సంధ్యారాగం' (4.22), 'ఉమ్మడి కుటంబం' (4.18), 'దీర్ఘ సుమంగళీ భవ' (4.02), 'ప్రేమ ఎంత మధురం' (3.47) టీఆర్పీ సాధించాయి. 

ఈటీవీ సీరియల్స్‌లో 'రంగులరాట్నం' 3.46, 'ఝాన్సీ' 3.06 టీఆర్పీతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.‌ 'బొమ్మరిల్లు' (2.93), 'శతమానం భవతి' (2.01) టీఆర్పీ సాధించాయి.‌ ఈటీవీలో ఐదో ప్లేస్ 'కలిసుందాం రా' సీరియల్‌ది. దానికి 1.24 టీఆర్పీ వచ్చింది.‌ ప్రతి వారం వన్ ప్లస్ టీఆర్పీ సాధిస్తూ జెమినీ టీవీలో టాప్ ప్లేస్‌లో ఉంటున్న 'భైరవి' ఈ వారం 1.24 టీఆర్పీ సాధించింది. ఈటీవీలో ఇటీవల మొదలైన కొత్త సీరియల్స్‌ రెండు మూడు వారాలు అయితే పికప్ అవుతాయేమో చూడాలి.

Also Readసెన్సార్, వీఎఫ్ఎక్స్ సమస్యల నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... హరిహర వీరమల్లు వాయిదాపై ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్