పాపులర్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇక సుమ తన ఫిట్ నెస్, ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ద తీసుకుంటారు. సుమ మాత్రమే కాకుండా ఆమె తల్లి కూడా వర్కౌట్లు చేస్తుంటారు. సుమతో పాటుగా సుమ మదర్ కూడా జిమ్ ఏరియాలో సందడి చేస్తుంటారు. సుమ ఇది వరకే తన తాత గురించి చెప్పింది. కేరళలో తన తాత లాయర్, జడ్జ్‌గా పని చేశారని చెప్పేవారు. ఆయన వయసు వందేళ్లు అని... ఇప్పటికీ తన సొంత ఆఫీస్‌కి వెళ్లి కేసులు చూస్తుంటారు అని సుమ చెప్పారు.

సుమ తాతయ్య వయసు వందేళ్లు!సుమ కనకాల తాజాగా తన తాతయ్యను చూపించారు. ఆయన ఎంత యాక్టివ్‌గా ఉన్నారు... ఎలా మాట్లాడుతున్నారు... అనేది చూపించారు. వంద ఏళ్లు.. కానీ ఇంకా లా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటూ సుమ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. వయసు అనేది శరీరానికే కానీ.. మనసుకి, మెదడుకి కాదు అని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండటం అంటే గ్రేట్ అని తాత ఇంకా ఇలానే చాలా ఏళ్లు హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Also ReadRam Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

సుమ తాత గారిని చూస్తే.. అతడు సినిమాలోని డైలాగ్ కచ్చితంగా గుర్తుకు రావాల్సిందే. ముసలోడే కానీ మహానుభావుడు అని అంతా అనాల్సిందే. ఇక రాజీవ్ కనకాల సైతం ఈ మధ్య చాలా మారిపోయాడు. ఒకప్పుడు భారీకాయంతో కనిపించేవాడు. కానీ ఇప్పుడు మళ్లీ డైట్ మెయింటైన్ చేస్తూ, వర్కౌట్లతో కష్టపడుతూ హెల్దీగా మారినట్టు కనిపిస్తోంది. సుమ, రాజీవ్ కనకాల ఇద్దరూ కలిసి ఈ మధ్య యాడ్స్ కూడా చేస్తున్నారు. సుమ బుల్లితెరపై బిజీగా ఉంటే.. రాజీవ్ వరుస ప్రాజెక్టులతో వెండితెరపై బిజీగా ఉంటున్నాడు. మరో వైపు రోషన్ హీరోగా ఓ హిట్టు కొట్టేందుకు, ఇండస్ట్రీలో నిలబడేందుకు ట్రై చేస్తున్నాడు.

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?