Madhuranagarilo July 12th: పూజారి మధుర వాళ్ళతో పుట్టలో పాలు పోస్తే అనుకున్నది నెరవేరుతుందని చెప్పటంతో ఇక అందరూ పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోస్తారు. అందరు ఎవరి మొక్కులు వాళ్ళు మొక్కుతారు. సంయుక్త.. శ్యామ్ తో తన పెళ్లి అవ్వాలని రాధ దూరం కావాలి అని మొక్కుతుంది. శ్యామ్ తనకు, రాధకు పెళ్లి కావాలని మొక్కి పాలు పోస్తాడు. రాధ పండు వాళ్ళ నాన్నతో త్వరగా తిరిగి రావాలి అని పండు ఆరోగ్యం కుదుటపడాలి అని పాలు పోస్తుంది.
ఆ తర్వాత పండుతో పాలు పోయిస్తుండగా పుట్టలో తన ఉంగరం జారి పడుతుంది. ఇక ఆ విషయం అందరికీ చెప్పి తన అక్క ఇచ్చిన ఒకటి ఒక గుర్తింపు అని బాధపడుతుంది. ఇక అప్పుడే పూజారి వచ్చి ఏం కాదని ఏదో మంచి జరగడానికి అలా జరిగింది అనుకోమని అనడంతో అందరూ అక్కడ నుంచి వెళ్తారు. ఇక రాధ వెనక్కి చూసేసరికి శ్యామ్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంటాడు.
వెంటనే రాధ సర్ అంటూ గట్టిగా అరిచి శ్యామ్ ను పట్టుకుంటుంది. మధుర, సంయుక్త వాళ్ళు కూడా శ్యామ్ ని పిలుస్తూ ఏం జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే శ్యామ్ చేతి మీద పాము కాటు వేసి ఉండటంతో నోట్లో నుంచి బురుగు వస్తుంది. వెంటనే రాధ విషం తలకు ఎక్కకుండా చున్ని గట్టిగా కడుతుంది. అంతేకాకుండా కాటు వేసిన దగ్గర విషం తీసి బయటికి ఉమ్మి వేస్తుంది.
పూజారి పసరు వైద్యుని తీసుకొని వస్తాడు. వైద్యం చేసిన తర్వాత స్పృహలోకి వస్తాడు. కట్టు కట్టి విషం తీయడం వల్ల విషం తలకు ఎక్కలేదు అని అనటంతో మధుర రాధకు థాంక్స్ చెబుతుంది. పాము దగ్గరికి ఎందుకు వెళ్లావు అని శ్యామ్ ని అడగటంతో.. శ్యామ్ అందరు వెళ్లాక తను పుట్టలో చెయ్యి పెట్టి ఉంగరం తీస్తుండగా పాము కాటు వేస్తుంది.
ఇక శ్యామ్ తన జేబులో ఉన్న ఉంగరం తీసి రాధకి ఇవ్వటంతో అందరూ షాక్ అవుతారు. రాధ ఉంగరం కోసం పుట్టలో చేయి పెట్టాను అనటంతో వెంటనే సంయుక్త ఆఫ్ట్రాల్ ఉంగరం కోసం అలా చేస్తావా అని అంటుంది. అది నీకు ఆఫ్టర్ లేము కానీ రాధ చాలా బాధపడింది అని అంటాడు. ఆ తర్వాత రాధ తన సంతోషం కోసం శ్యామ్ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు అని.. తను నన్ను అంతలా ప్రేమిస్తున్నాడా అని అనుకుంటుంది.
ఏ అమ్మాయికైనా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే అబ్బాయి వస్తే చాలా అదృష్టమని.. కానీ తనకు అదృష్టం లేదు అని ఎందుకంటే మరో రెండు రోజుల్లో శ్యాం పెళ్లి అవుతుంది అని బాధపడుతుంది. కానీ ఎలాగైనా శ్యామ్ సర్ ను తన ఆలోచన నుండి తప్పించాలి అని అనుకుంటుంది. ఓ వైపు శ్యామ్ జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అక్కడికి మధుర వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది.
సంయుక్త తో నాకు పెళ్లి కావడానికి రాసి పెట్టలేదేమో అందుకే ఇలా జరుగుతుంది ఇది ఒక అపషకనం లాగా ఉంది అనటంతో ఏమి కాదు నువ్వు పుట్టలో చేయి పెట్టినందుకు అలా జరిగింది అని సర్ది చెబుతుంది. ఇప్పుడే భోజనం పంపిస్తాను తినేసి రెస్ట్ తీసుకోమని అంటుంది. తరువాయి భాగంలో రాధ శ్యామ్ కు అన్నం తినిపిస్తూ ఉండగా సంయుక్త వచ్చి చూసి షాక్ అవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial