Madhuranagarilo July 1st: డాన్స్ ప్రాక్టీస్ లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సంయుక్త, శ్యామ్ లతో డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక శ్యామ్ సంయుక్త వెనకాల నిలబడి తన వీపు మీద పుట్టుమచ్చ ఉందా లేదా చూస్తూ ఉంటాడు. ఇక ఆ విషయాన్ని రాధ గమనిస్తూ ఉంటుంది. రాధ సంయుక్త  దగ్గరికి వెళ్లి ఇలా డాన్స్ చేయాలి అని శ్యామ్ కి చూపిస్తుంది.


ఇక శ్యామ్ సంయుక్తను పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటూ పుట్టుమచ్చ ఉందా లేదా గమనిస్తూ ఉంటాడు. ఇక అద్దంలో తనకు సంయుక్త వీపు మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించడంతో వెంటనే తనను కిందికి పడేస్తాడు. ఇక రాధ కూడా సంయుక్తకు పుట్టుమచ్చ ఉందని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక సంయుక్త కింద పడటంతో అందరూ తనను లేపుతారు. శ్యామ్ చాలా ఫీల్ అవుతూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు.


మరోవైపు విల్సన్ రోడ్డుపై నడుస్తూ ఉండగా అందరూ శోభనం కాలేదా అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని అనటంతో మైక్ లో మాట్లాడావు కదా అని అంటుంది ఒక ఆవిడ. వెంటనే గన్నవరం అంటూ అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇక సంయుక్త తన ఫ్రెండ్ తో డాన్స్ చేస్తూ శ్యామ్ ను వలలో వేసుకోవాలి అని అనుకున్నాను అని కానీ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అని అంటుంది. ఇక శ్యామ్ కిరణ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పుట్టుమచ్చ సంయుక్తకు కూడా ఉంది అని.. తనకు సంయుక్త తో పెళ్లవుతుందేమో అని బాధపడుతూ ఉంటాడు.


రాధ తో పెళ్లి జరగదేమో అని.. తలుచుకుంటేనే బతకాలని లేదు అని అనటంతో ఆ మాటలు రాధ విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విల్సన్ ఇంటికి వెళ్లగా శోభనం గురించి మైకులో చెప్పినందుకు బాగా చితకొడుతుంది. ఇక రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లడంతో తనకు గన్నవరం ఎదురవుతాడు. ఇక గన్నవరంతో మైకులో వినబడేలాగా ఎందుకు చేశావు అంటూ అరుస్తాడు.


మరోవైపు మధురకు డాన్స్ చేయడం వల్ల బాగా కాళ్లు నొప్పి రావడంతో రాధ నేను నొక్కుతాను అని తను కాలు నొక్కుతూ ఉంటుంది. ఇక మధుర రాధని చూసి సంతోషంగా ఫీల్ అవుతుంది. నువ్వు చాలా మంచి దానివి నీకు మంచి మనసు ఉంది అంటూ.. సంయుక్త కంటే ముందు నువ్వే వచ్చి పెళ్లి కాకుండా ఉంటే నిన్నే కోడలుగా చేసుకునే దాన్ని అని అంటుంది.


వెంటనే రాధ ఆ మాటలకు ఆశ్చర్యపోయి.. అటువంటి మాటలు అనకండి సంయుక్త వింటే బాధపడుతుంది అని అంటుంది. ఆ తర్వాత రాధ గదిలోకి వెళ్ళగా అక్కడ పండు కనిపించడు. బయటికి వెళ్లి చూడటంతో శ్యామ్ పండుని ఎత్తుకొని నిద్రపుచ్చుతాడు. మీరెందుకు నిద్రపుచ్చుతున్నారు అని అనటంతో.. మా ఇద్దరి మధ్య తండ్రి కొడుకు లాంటి సంబంధం ఉంది అంటాడు. ఆ తర్వాత శ్యామ్ పండుని గదిలో పడుకోబెడతాడు.  ఇక రాధ తో నీకు నిజంగానే పెళ్లి జరిగిందా అంటూ మళ్ళీ పెళ్లి టాపిక్ తీస్తాడు. ఒకవేళ జరిగితే ఆ రోజే మీ ఆయన గుడికి రావాలి కదా అనగా.. మేమిద్దరం విడిపోయాక మళ్ళీ ఎందుకు కలుస్తాము అని రాధ అంటుంది.


also read it : Prema Entha Madhuram July 31th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: వర్ధన్ ఇంట్లో ఎమోషనల్ డ్రామా ప్లే చేసిన మాన్సీ.. అను ప్లాన్ చేసిన బిజినెస్ కి సపోర్ట్ ఇచ్చిన ఆర్య?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial