Rangula Ratnam June 23th: తల్లి గారి ఇంటికి వచ్చిన వర్ష రేఖతో తన తల్లిదండ్రులను ఒకటి చేయమని వేడుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళను కలిపాక ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అమాయకంగా చెబుతుంది. దాంతో రేఖ వెటకారం చేస్తుంది. అయినా కూడా వర్ష తనను కాళ్లు పట్టుకొని బతిపడుతుంది. వెంటనే రేఖ తన జుట్టు పట్టుకొని లేపి క్రూరంగా మాట్లాడుతుంది.


ఏం చేసినా వారిని ఒకటి చేయను అని వర్షను పక్కకు నెట్టుతుంది. దాంతో వర్ష కోపంతో శరీరాన్ని చూపిస్తూ మాయమాటలు చెప్పి డబ్బులు సంపాదించే దానివి అంటూ కోపంతో అనటంతో వెంటనే ఏక వర్ష చెంపపై గట్టిగా కొట్టడంతో అదే సమయంలో శంకర్ ప్రసాద్ వచ్చి తన కూతుర్ని పట్టుకుంటాడు. నా కూతుర్నే కొడతావా అంటూ తిరిగి రేఖ చెంప గట్టిగా పగలగొడతాడు.


దాంతో నీ కూతురు ఏమన్నాదో తెలుసా అని రేఖ అనటంతో.. తనకు అనే హక్కు ఉంది.. అంతేకానీ నీకు కొట్టే హక్కు లేదు అంటూ.. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కానీ నా కూతుర్నే కొడతావా అంటూ చీదరించుకుంటాడు. నువ్వెంత నీ బతుకెంత.. రోడ్డు మీద బతికే దానికి అంటూ నానా రకాలుగా ఫైర్ అవుతాడు. నా కొడుకులు నీ గురించి చెప్పినప్పుడు వినలేదు అని.. నిన్ను వెనకేసుకొస్తున్నందుకు తలపై కూర్చున్నావు అని కోపంగా అరుస్తాడు. ఉంటే ఇంట్లో సైలెంట్ గా ఉండు లేదంటే వెళ్ళిపో అని అనటంతో రేఖ కోపంగా తన గదిలోకి వెళుతుంది.


ఇక వర్ష తన తండ్రి తో ఇప్పటికైనా రేఖ గురించి తెలుసుకున్నావు నాన్న అంటూ ఇంకొక్క విషయం తెలుసుకుంటే అని అనటంతో అర్చన విషయం గురించి మాత్రం మాట్లాడకు అని అంటాడు. ఇక వర్ష తన గురించి ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆ విషయం గురించి మాట్లాడదమ్మ అని అంటాడు. వర్ష ఇంటికి బయలుదేరుతుండగా నర్సింగ్ తో కార్ లో పంపిస్తాడు.


మరో వైపు రఘు ఇంటికి లాయర్ తీసుకొని రావటంతో ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది పూర్ణ. దాంతో రఘు రేఖ చేస్తున్న మోసాన్ని బయట పెట్టి నిన్ను నాన్నను కలపడానికి న్యాయం గెలిపించడానికి తీసుకొచ్చాను అని అంటాడు. ఇక లాయర్ కూడా మీరు ఒక్కసారి చేస్తే న్యాయం గెలిస్తుంది అని అనటంతో దానికి పూర్ణ ఒప్పుకోదు. తన భర్త కలిసే వరకు ఎన్ని రోజులైనా ఎదురు చూశాను కానీ.. తన భర్తను కోర్టు మెట్లు ఎక్కనివ్వను అని అంటుంది.


దాంతో రఘు ఆ ఒక్క విషయంలోనే కాకుండా వ్యాపార విషయంలో కూడా రేఖ మోసం చేస్తుందని ఆ విషయంలో కూడా తను చేస్తున్న మోసాలు అన్ని కోర్టులో బయటపడతాయి అని చెప్పినా కూడా పూర్ణ అస్సలు వినదు. మరోవైపు జరిగిన దాని గురించి రేఖ తలచుకొని కోపంతో రగిలిపోతుంది. ఇప్పటివరకు తనను కొట్టిన వాళ్లకు తిరిగి వారికి తగిన దెబ్బ కొట్టాను అని.. ఇప్పుడు నువ్వు కొట్టినందుకు అసలు ఊరుకోను అని నేరుగా ఆఫీస్ కి వెళ్లి అక్కడ శంకర్ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బోర్డ్ ను కింద పడేయించి రేఖ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పెట్టిస్తుంది. ఇక అది చూసిన నర్సి శంకర్ ప్రసాద్ కి చెప్పటంతో శంకర్ ఆఫీస్ కి వచ్చి అది చూసి షాక్ అవుతాడు.


Also Read: Prema Entha Madhuram June 23th: ఆస్తుల కోసం బరితెగించేస్తున్న మాన్సీ-మరో సీక్రెట్ ప్లేస్ కు చేరుకున్న అను?