Serial Actress Varalakshmi Vratham: పవిత్రమైన శ్రావణమాసంలో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందులోనూ శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతీ మహిళ తప్పకుండా చేస్తారు. అన్ని పూజల్లోనూ ఈ వరలక్ష్మీ వ్రతం అంటే మహిళలకు ప్రత్యేక ప్రీతి.
సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పసుపు కుంకుమ, చీర, గాజులు కొని రకరకాల ప్రసాదాలు చేసి వాయినాలు ఇచ్చి తృప్తిగా పూజను పూర్తి చేస్తారు. ఈసారి వరలక్ష్మీ వ్రతం ఆగస్టు మొదటి వారంలో కొందరు చేస్తే రెండో వారంలో మరి కొంత మంది చేసుకోనున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే దాదాపు అందరూ ఆగస్టు మొదటి శుక్రవారంలోనే వరలక్ష్మీ పూజ చేసేశారు. ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోనున్న వాళ్లు కూడా తమ ప్రియుల్ని పక్కన కూర్చొపెట్టుకొని పూజలు చేసేశారు. తోటి నటుల్ని పిలిచి ఇచ్చానమ్మా వాయినం.. పుచ్చుకున్నానమ్మా వాయినాం.. మా ఇంటికి సాక్ష్యాత్తు వరమహాలక్ష్మీ వచ్చిందంటూ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం సెలబ్రిటీలు ఎంత సందడిగా వ్రతం చేసుకున్నారో ఒకసారి చూసేయండి.
సినీ నటి జూనియర్ శ్రీదేవి తన ఇంట్లో వరలక్ష్మీ పూజ చేసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఓసారి చూసేయండి.
సీరియల్ నటి విష్ణుప్రియ వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా పూర్తి చేసింది. భర్త సిద్ధార్థ్‌తో కలిసి డెకరేషన్ చేస్తూ సందడిగా పూజ పూర్తి చేసి తోటి నటులను పిలిచి వాయినం ఇచ్చింది. ఓ లుక్ ఇచ్చేయండి.
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన ప్రియుడు శివ్‌తో కలిసి వరలక్ష్మీ పూజ చేసింది. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు సాయం చేస్తూ ఎంత సందడిగా పూజ చేశారో లుక్ వేయండి.
కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల వరలక్ష్మీ పూజ వైభవంగా చేశారు. సీతే రాముడి కట్నంలో గడసరి అత్త మహాలక్ష్మీగా అల్లాడించిన ఈ మహాలక్ష్మీ పూజ చూసేయండి.
మరో బిగ్‌బాస్ బ్యూటీ హారిక వరలక్ష్మీ పూజ చేసి ప్రసాదం లాగించేస్తూ పొటోలకు ఫోజులిచ్చింది. ఓసారి చూసేయండి.
కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్‌లోని సహస్ర ఎంత చక్కగా పూజ చేసి సాక్ష్యాత్తు అమ్మవారితో ముచ్చట్లు పెట్టినట్లు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఓ లుక్ వేయండి.
వరమహాలక్ష్మీలు వాయినాలు ఇచ్చుకుంటూ ఎలా సందడి చేశారో చూసేయండి.
బిగ్‌బాస్ బ్యూటీ వరుణ్ సందేశ్ భార్య వితికాషెరూ ఎంత అందంగా అమ్మవారిని అలంకరించిందో చూసేయండి.