Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode  లక్ష్మీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడం వల్ల విహారి చాలా  తనలో తాను నలిగిపోతున్నాడని ఎలా అయినా ఈ సమస్య పరిష్కారమవ్వాలని అందుకు నేను పరష్కారం చూపిస్తా.. ఈ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటా అని యమున లాయర్‌కి కాల్ చేస్తుంది. 

లక్ష్మీ ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే లక్ష్మీని ప్రకాశ్ చూస్తాడు. లక్ష్మీని బ్లాక్ మెయిల్ చేయాలని దగ్గరకు వెళ్తాడు. మరోవైపు సహస్ర వ్రతం పేరుతో ఆకలితో ఉంచేశారని ఆకలికి తట్టుకలేక బయటకు వచ్చి కారులో ఉండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటుంది. లక్ష్మీ ప్రకాశ్ పని చెప్తా అని లొకేషన్ ఎస్‌ఐ సంధ్యకు పెడుతుంది. సీక్రెట్‌గా ఎస్‌ఐకి కాల్ చేస్తుంది. నన్ను అమ్మేయాలి అని చూశావు కదా అని   ఎస్‌ఐకి అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఎస్‌ఐకి సీన్ అర్థమైపోతుంది. లక్ష్మీ ప్రకాశ్‌ని మాటల్లో పెడుతుంది. మరోవైపు సహస్ర పిజా లాగించేస్తుంది. అప్పుడే లక్ష్మీ ప్రకాశ్‌ని కొట్టడం చూస్తుంది. ఇంతలో పోలీసులు వచ్చి ప్రకాశ్‌ని అరెస్ట్ చేస్తారు. ప్రకాశ్‌ లక్ష్మీతో నిన్ను వదలను అంటే నిన్ను ఎవరు వదులుతారురా అని ఎస్ఐ అంటుంది. 

సహస్ర మొత్తం చూసి ప్రకాశ్‌ని లక్ష్మీ కొట్టడం ఏంటి, ప్రకాశ్‌ని పోలీసులు తీసుకెళ్లడం ఏంటి అనుకొని ప్రకాశ్‌ని కలిస్తే లక్ష్మీ మీద కోపంతో చెప్పేస్తాడని అనుకుంటుంది. మరోవైపు విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మీ రావడంతో ఎక్కడికి వెళ్లావ్.. నాకు చెప్పకుండా వెళ్తే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కోప్పడతాడు. కోపంలో అరిచినందుకు సారీ చెప్తాడు. లక్ష్మీ డల్‌గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. లక్ష్మీ యమునకు విషయం తెలిసి అనే విషయం విహారికి చెప్పకూడదు అని అనుకుంటుంది. విహారి లక్ష్మీ చేయి పట్టుకోగానే విడిపించేస్తుంది. విహారి షాక్ అయిపోతాడు. 

లక్ష్మీ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. సహస్ర ప్రకాశ్ దగ్గరకు వెళ్లి లక్ష్మీ నిన్ను కొట్టడం ఏంటి పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతుంది. నీకు ఆ లక్ష్మీ అంటే పడడు కదా అని ప్రకాశ్ అంటాడు. అవును పని మనిషిగా వచ్చి మా కంపెనీలకు ఎండీ అయిందని చెప్తుంది. ఏంటి లక్ష్మీ ఎండీ అయిందా అని షాక్ అయిపోతాడు. ఇక ఇద్దరూ లక్ష్మీ అంతు చూడాలని చేతులు కలుపుతారు. రాత్రి సహస్ర పూజ చేస్తుంది. అందరికీ హారతి ఇస్తుంది. సహస్ర పచ్చిమంచినీళ్లు కూడా ముట్టుకోలేదని పద్మాక్షి అంటుంది. అప్పుడే సహస్రకు తేన్పులు వస్తాయి. కాళీ కడుపుతో ఉండటం వల్ల అలా అయిందేమో అని అంబిక అంటుంది.

ఇక సహస్ర మనసులో నేను బయట తిన్నానని తెలిస్తే మా అమ్మ చంపేస్తుందని అనుకుంటుంది. యమున విహారితో సహస్రకు ప్రసాదం తినిపిస్తుంది. రకరకాల ప్రసాదాలు పెట్టి విహారితో తినిపిస్తుంది. సహస్ర తినలేను అని గోల చేస్తుంది. అయినా మొత్తం తినాలని యమున పట్టుపడుతుంది. అందరూ బలవంత పెట్టడంతో సహస్ర కష్టపడి తినలేక తినలకే మొత్తం తినేస్తుంది. పండు లక్ష్మీ కోసం ప్రసాదం పట్టుకొని బయల్దేరుతాడు. విహారి ఏమైందని అడిగితే సహస్రలా లక్ష్మీ కూడా వ్రతం చేసిందని అంటాడు. ఆ భోజనం విహారి లక్ష్మీ కోసం తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.