Seethe Ramudi Katnam Serial Today ₹Episode సీత బొటిక్ ఓపినింగ్‌కి మీరంతా రావాలని వస్తారని సీతకి నేను మాట ఇచ్చేశాను అని రామ్ ఇంట్లో వాళ్లతో చెప్తాడు. దాంతో మహాలక్ష్మీ వస్తామని చెప్తుంది. రామ్ సంతోషంగా సీతకి విషయం చెప్పడానికి వెళ్తాడు. రామ్ కోసం మనం వెళ్లక తప్పదు అని మహా అంటుంది. సీత ఓవర్ చేస్తుందని గిరిధర్ అంటాడు. ఇక సీతతో రామ్ మా పిన్ని ఓకే చెప్పిందని అంటాడు. మధు సూర్యకి కాఫీ ఇస్తుంది. సూర్య సగం కాఫీ మధుకి ఇస్తాడు. జలజ అది చూసి పైసా సంపాదన లేదు కానీ ప్రేమలు ఎక్కువయ్యాయని అంటుంది. ఇక సూర్య అన్న వచ్చి సూర్యకి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డాక్టర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటాడని మూడు రోజుల్లో డబ్బులు ఏర్పాటు చేసుకోమని అన్నారని చెప్తాడు.
జలజ: ఇన్ని రోజులు ఏం చేయలేకపోయారు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు. నీ చెల్లికి డబ్బులు అడిగావ్ ఇంత వరకు ఏం లేదు. మీ తల్లిదండ్రులకు అడిగినా వాళ్లు ఇవ్వరు.
సూర్య: ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది వదిలేయండి.
జలజ: ఆ మహాలక్ష్మీ గారిని అడగొచ్చు కదా.
మధు: అక్కా నీకు ఆవిడ పేరు ఎత్తొద్దని చెప్పా కదా సూర్య కోసం నా ప్రాణం ఇస్తా కానీ ఆవిడ దగ్గర చేయి చాచను.
సూర్యఅన్న: నువ్వు నోరు మూసుకొని వెళ్లు. సూర్య మీ వదిన మాటలు పట్టించుకోకు.
సూర్య: డబ్బులు గురించి పట్టించుకోకు మధు వదిలేయ్ ఏదైనా రాసి పెట్టుంటే జరుగుతుంది కాళ్లు లేకపోయినా మనం కలిసే ఉంటాం కదా అది చాలు నాకు.
మధు: ఏదో ఒకటి చేయాలి ఈ మూడు రోజుల్లో ఎలా అయినా పది లక్షలు సంపాదించాలి.
సీత షాప్ ఓపినింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. సీత పిలిచి వాళ్లు అంతా వస్తారు. దాంతో వాళ్లతో సీత మీకు మొదటి రోజు మంచి డిస్కౌంట్‌తో చీరలు అమ్ముతున్నానని అంటుంది. ఇక షాప్ ఓపినింగ్ మా అత్తగారు చేస్తారని అంటుంది. మహాలక్ష్మీ ఇంటి దగ్గర ఉంటూ సీతతో పోటీ పడలేకపోతున్నానని అనుకుంటుంది. అర్చన వాళ్లు రెడీ అయి వస్తారు. సీత నీ చేత ఒపినింగ్ చేయిస్తుందో లేదో తెలీదని అర్చన వాళ్లు అంటారు. సీతని ఏదో రకంగా అవమానించాలని అనుకుంటారు. జనార్థన్ రావడం చూసిన మహాలక్ష్మీ మీ అన్నయ్య గారికి ఈ మధ్య కొత్తగా సుమతి మీద ప్రేమ వస్తుందని ఆవిడ పేరు బొటిక్‌కి చూసి ఎగిరి గంతేస్తారని అంటుంది. అందరూ షాప్ దగ్గరకు వెళ్తారు. సీత మహాలక్ష్మీ వాళ్లని పిలుస్తుంది.
సీత అందరి ముందు మహాలక్ష్మీని పొడుగుతుంది. మహాలక్ష్మీ గారు మాకు బాగా తెలుసని అందరూ అని మహాలక్ష్మీకి దండం పెడతారు. సీత తనకు వచ్చి రాని ఇంగ్లీష్‌తో మాట్లాడి అందరికీ తలనొప్పి వచ్చేలా చేస్తుంది. ఇక షాప్‌కి సుమతి పేరు పెడుతుందని మహాలక్ష్మీ టీమ్ అనుకుంటే సీత మాత్రం మహాలక్ష్మీ గారి కోడలు బొటిక్ అని పేరు పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటి పేరు ఎవరైనా పెడతారా అని అంటారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ!