Seethe Ramudi Katnam Serial Today Episode రేవతి అన్నలిద్దరికీ ఆస్తిలో వాటా అడుగుతుంది. అందుకోసం సీత చిన్నరాయుడమ్మ వేషం వేసుకొని ఇచ్చి వాటా ఇవ్వాలని చెప్తుంది. ఇంతలో మహాలక్ష్మీ కూడా పెద్దరాయుడమ్మ వేషం వేసుకొని వస్తుంది. సీత కూర్చొడానికి సిద్ధమైన కుర్చీని తన కండువాతో చుట్టి ఇంద్ర స్టైల్‌లో లాగి పెద్దరాయుడమ్మ మహాలక్ష్మీ కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చొంటుంది.
మహాలక్ష్మీ: ఇంట్లో పెద్దరాయుడమ్మ ఉండగా చిన్న రాయుడమ్మ నోరు లేవడం ఏంటి?
సీత: నేను తీర్పు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వడం ఏంటి.
మహాలక్ష్మీ: నువ్వు కింద కోర్టు అయితే నేను సుప్రీం కోర్టు. నువ్వు ఇచ్చిన తీర్పులో ఒ తప్పు ఉంది. నేను ఆడపిల్లకి ఆస్తిలో సమాన వాటా ఉందని చట్టాన్ని ఒప్పుకుంటాను. కాదు అనను. కానీ ఆస్తి పంచి ఇవ్వడానికి మేం ఎవరం ఈ ఆస్తి అంతా సుమతిది. ఆస్తి పంచడానికి అయినా దానం చేయడానికి అయినా వాటా ఇవ్వడానికి అయితే సుమతికే సర్వహక్కులు ఉంటాయి. కానీ మాకు కాదు. ఆస్తి పంచాలి అంటే సుమతి రావాలి. కావాలి సుమతి వచ్చాకే పంపకాలు జరగాలి అని నేను తీర్పు ఇస్తున్నా.
రామ్: అందరూ క్లాప్స్ కొడతారు. ఈ తీర్పు కూడా కరెక్టే సీత.
మహాలక్ష్మీ: ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉంటూ రేవతి కూడా అనుభవించింది కదా.
జనార్థన్: కరెక్ట్ మహా ఆస్తి అనుభవించడానికే మనం హక్కు దారులమే కానీ అమ్మడానికి పంచడానికి కాదు
గిరిధర్: నీకు ఆస్తి కావాలంటే సుమతి వదిన వచ్చాక రా రేవతి. అప్పుడు వరకు ఇటు వైపు రాకు.
అర్చన: పంచాయితీ అని ఎగేసుకుంటూ వచ్చారు వెళ్లండి వెళ్లండి.
అర్చన, కిరణ్ వెళ్లిపోతారు. సీత వాళ్ల వెనకే వెళ్లి క్షమాపణ చెప్తుంది. వదిన ఇలా చేస్తుందని తెలుస్తుంది కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు అంటుంది. ఇక సీత ఏదో ఒక రోజు మీకు వాటా ఇప్పించే బాధ్యత నాది అని అంటుంది. దానికి రేవతి మాకు ఆస్తి అవసరం లేదు కానీ నువ్వు చెప్పినందుకు వచ్చామని అంటుంది. ఇక సీత ఈ సారి ఆస్తి డాక్యుమెంట్లు రెడీ చేసుకొని రండి అంటుంది. ఇక సీత ఈ సారి మీకు ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అన్ని తవ్వుతానని అంటుంది. కిరణ్ సీతతో మేం ఎలా అయినా బతుకుతాం జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాను అని అంటాడు. ఇక సీత నేను మీకు న్యాయం చేస్తానని అంటుంది. ఇక మహాలక్ష్మీని అర్చన, గిరిధర్, జనార్థన్లు మహాలక్ష్మీని పొగిడేస్తారు. ఇప్పుడూ ఇలాగే సీత మీద గెలవాలని దెబ్బ మీద దెబ్బ కొట్టాలని అంటారు. ఇంతలో చలపతి వచ్చి సీతతో అంత ఈజీ కాదు అని అంటాడు. సీతని తక్కువ అంచనా వేయొద్దని సీత అనుకుంటే రేవతి గారికి ఆస్తి ఇప్పిస్తుందని అంటే మహాలక్ష్మీ చలపతిని నోరుమూయమని అంటుంది. సీత, మహాలక్ష్మీలు ఒకరికి ఒకరు సినిమాలోని డైలాగ్స్ అన్నీ చెప్పుకుంటారు.
రామ్ ప్రీతి దగ్గరకు వెళ్లి సంబంధం విషయంలో తొందరపడ్డాను సారీ అని చెప్తాడు. సీత చెప్పినా వినలేదు అని అంటాడు. దానికి ప్రీతి వదిన ఎప్పుడూ మన మంచి గురించే చెప్తుందని అంటుంది. విద్యాదేవి వచ్చి రేపు నీకు మీ మామయ్య ఇంట్లో పెళ్లి చూపులు అని చెప్తుంది. సీత కూడా వస్తుంది. ప్రీతిని పెళ్లికి ఒప్పుకోమని విద్యాదేవి చెప్తుంది. మీ అమ్మ ఇంట్లో ఉండి ఉంటే మీ బతుకు మరోలా ఉండేదని విద్యాదేవి అంటుంది. ప్రీతి అమ్మలా అందరూ మాటలు చెప్పగలరు కానీ అమ్మ కాలేరు కదా అని ఎమోషనల్ అవుతుంది. సీత రామ్, ప్రీతిలకు ధైర్యం చెప్పి అమ్మ వస్తుందని అంటుంది. విద్యాదేవి ఒక్కర్తే పిల్లలు నా కోసం చాలా బాధపడుతున్నారని తనని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న మహాలక్ష్మీకి ఎదురు దెబ్బ తగిలితే తప్ప నా బాధ అర్థం కాదు అనుకుంటుంది. ఇక మహాలక్ష్మీ పెళ్లి విషయంలో జరిగింది అంతా గుర్తు చేసుకొని కారులో వెళ్తుంటుంది. ప్రీతి విషయంలో ఓడిపోయానని ఏదో ఒకటి చేసి శివకృష్ణ తెచ్చిన సంబంధం ఆపేయాలి అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌కి ఆశలు ఉంటాయ్ నువ్వు భార్యగా ఉండాల్సిందే: అనసూయ మాటలకు ఆలోచనలో దీప