Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతిని తన ఫ్రెండ్ విక్కీ బ్లాక్ మెయిల్ చేసిన సంగతి ప్రీతి సీతకు చెప్తుంది. సీత ప్రీతిని తీసుకొని విక్కీ చెప్పిన అడ్రస్‌కి బయల్దేరుతుంది. మహాలక్ష్మీ వాళ్లు ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని అడిగితే వచ్చి చెప్తానని అంటుంది. చెప్పమంటే చెప్పకుండా వెళ్తున్నావ్ ఏంటి అని జనార్థన్ అడిగితే ఇది ఆగి చెప్పాల్సిన టైం కాదని అంటుంది. ఇక రామ్ కిందకి రావడంతో అందరూ సీత ప్రీతిని తీసుకెళ్లడం లేదని అడిగితే చెప్పకుండా వెళ్తుందని అంటారు.
జనార్థన్: నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే సీత ఇలా చేస్తుంది రామ్.
మహాలక్ష్మీ: ప్రీతిని సీత ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు అయినా చెప్పిందా రామ్.
రామ్: లేదు పిన్ని. ఎందుకు ఇలా చేసిందో తిరిగి వచ్చాక అడుగుతా.
విద్యాదేవి: మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సీత ప్రీతిని ఏం చేయదు.
అర్చన: మొన్నే కదా కిడ్నాప్ చేసింది.
రామ్: ఇంతకీ సీత ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లినట్లు.
విక్కీ తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. విక్కీ ఫ్రెండ్స్ నీ ప్రీతి వస్తుందా అంటే తప్పకుండా వస్తుందని అంటాడు. ఇక మొన్నటిలా పోలీస్ మామతో వస్తే అని అంటే మీరు మామతో పెళ్లి చేసుకోండి నేను కోడలితో ఫస్ట్ నైట్ చేసుకుంటా అంటాడు. ఇంతలో సీత ప్రీతిని తీసుకొని వస్తుంది. ప్రీతి ఒక్కదాన్నే విక్కీ దగ్గరకు పంపుతుంది. విక్కీ వాళ్లు సీత, ప్రీతిని చూసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే సీత మరో నలుగురు అమ్మాయిల్ని తీసుకొస్తుంది. దానికి విక్కీ నా పాత గల్‌ఫ్రెండ్స్ అందర్నీ తీసుకొచ్చావని అంటాడు. ఇక సీత వాళ్లందరికీ కమాన్ అంటే వాళ్లు క్రికెట్ బ్యాట్‌లు తీసుకొని వస్తారు. విక్కీ ఇద్దరు ఫ్రెండ్స్ బయపడతారు. సీత విక్కీని పట్టుకొని చితక్కొడితే మిగతా అమ్మాయిలు మిగతా ఇద్దరినీ చితక్కొడతారు. ముగ్గురూ కుయ్యోమోర్రో అనుకుంటూ ప్రీతి కాళ్లు పట్టుకుంటారు. తర్వాత సీత ప్రీతిని తీసుకొని ఇంటికి వస్తుంది.
అందరూ సీతతో ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లావని ప్రశ్నిస్తారు. ప్రీతితో చీరలు అమ్మించడానికి తీసుకెళ్లావా అని అడుగుతారు.. మా పరువు తీసేస్తున్నావ్ అని జనార్థన్ అంటాడు. ఇక ప్రీతి వదిన మన పరువు కాపాడిందని జరిగిందంతా చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మహాలక్ష్మీ వల్లే ఇదంతా అయిందని విక్కీకి ఆ చనువు ఇచ్చింది నువ్వే అని అంటుంది. ఇక ఎవరూ తనని అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకోవా అని సీత ప్రశ్నిస్తుంది. ఇక ఈ ప్రాబ్లమ్‌కి ప్రీతి పెళ్లి చేయడం సొల్యూషన్ అని అంటుంది. సీత కూడా పెళ్లి చేద్దామని అంటుంది. రామ్ కూడా అదే కరెక్ట్ అంటాడు. దానికి మహాలక్ష్మీ ప్రీతికి ఎప్పుడు ఎలా ఏం చేయాలో నాకు తెలుసని అంటుంది. ఇక తనకు తెలిసిన పెద్ద సంబంధం ఉందని అంటుంది. దాన్ని ఫిక్స్ చేస్తానని అంటుంది.
ఉదయం ఇద్దరు దంపతులు మహాలక్ష్మీ ఇంటికి వస్తారు. ఇద్దరినీ మహాలక్ష్మీ, జనార్థన్ వాళ్లని పిలుస్తారు. తన కొడుకు రాకేష్‌కి ప్రీతికి పెళ్లి చేద్దామని అంటారు. రాకేష్ ఫొటో తీసుకుంటారు. ఇక ప్రీతి ఫొటోని వాళ్లకి ఇస్తారు. రాకేష్ రేపే వస్తాడని అనడంతో పెళ్లి చూపులు చేద్దామని అంటారు. ఇక వాళ్లు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటామని అంటారు. కట్ చేస్తే రాకేశ్ జైలులో ఉంటాడు. రాకేశ్ గొడవలు పడి అమ్మాయిలతో తిరుగుతూ విచ్చలవిడిగా ఉంటాడు. తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ ఉన్న వాళ్లు కావడంతో వాళ్లు రాకేశ్ అమెరికాలో ఉన్నాడని అందరికీ చెప్తుంటారు. అదే విధంగా మహాలక్ష్మీ వాళ్లకి కూడా రాకేశ్ అమెరికాలో ఉన్నాడని చెప్పి పెళ్లి ఫిక్స్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి సపోర్ట్ చేస్తూ పిన్నికి షాక్ ఇచ్చిన రామ్.. ప్రీతికి బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ!