Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు క్యూట్‌గా రెడీ అయి వస్తుంది. అందరూ షాక్ అవుతారు. అంజును చాలా బాగా రెడీ చేశావని భాగీని మెచ్చుకుంటారు. దీంతో అంజు అందరినీ తిడుతుంది. నేను అందంగా ఉన్నాను కాబట్టే కనిపిస్తున్నాను అంటుంది. ఇంతలో నిర్మల వచ్చి దుర్గామాత డాలర్ ఉన్న గోల్డ్ చైన్ ను అంజు మెడలో వేయమని భాగీకి ఇస్తుంది. సరేనని భాగీ చెప్తుంది. మరోవైపు కింద ఘోర ఇచ్చిన పొడిని ఎక్కడ పెట్టాలా? అని మనోహరి ఆలోచిస్తుంది. ఆరు కూడా తాను తయారు చేసిన గిఫ్ట్ ఎక్కడ పెట్టాలా అని చూస్తుంది. ఇంతలో పై నుంచి అంజును తీసుకుని భాగీ, పిల్లలు, కరుణ వస్తారు.
అమర్: మెనీ మెనీ రిటర్న్ ఆఫ్ ది డే..
అంజు: ఈ డ్రెస్ చాలా బాగుంది డాడ్.
అమర్: నీకు నచ్చిందా?
అంజు: చాలా నచ్చింది.
రణవీర్: హ్యాపీ బర్తుడే అంజు పాప
అంజు: థాంక్యూ అంకుల్ కానీ గిఫ్ట్ ఇప్పుడే ఇవ్వకూడదు. కేక్ కట్ చేసిన తర్వాత ఇవ్వాలి.
నిర్మల: అంజు పాప దేవుడికి దండం పెట్టుకుని వద్దువు రా.. రండి అందరూ రండి.
భాగీ: అత్తయ్యా ఇలా ఇవ్వండి. అంజు నాన్న దగ్గర అశీర్వాదం తీసుకో..
శివరాం: నాన్న దగ్గరే కాదమ్మా.. నాన్న దగ్గర, మిస్సమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో..
అమర్: అంజు రాథోడ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో..
రాథోడ్: నేనెందుకులే సార్..
అమ్ము: మామయ్యా మామయ్యా అంటావు కదా రాథోడ్ కమాన్ అంజు రా..
రాథోడ్: ఎప్పటిలాగా సున్నాలు కాకుండా సున్నాల పక్కన ఒక్కటి వచ్చేలా తెచ్చుకో..
శివరాం: అంజు… రణవీర్, మనోహరి దగ్గర ఆశీర్వాదం తీసుకో..
అంజు: ఇన్ని సార్లు బెండు అవ్వడం నా వల్ల కాదు.. నా వల్ల కాదు కానీ మీరిద్దరూ ఒక్కదగ్గరికి రండి
అంటూ రణవీర్, మనోహరిని దగ్గరకు చేర్చి ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఆరు: నీ సమక్షంలోనే అందరినీ ఒక్క దగ్గరికీ తీసుకొచ్చావా? స్వామి. ప్రేమ లేని తండ్రి, స్వార్థంతో నిండిన తండ్రి. ఇదేనా నువ్వు అంజుకు రాసిన తలరాత
అంటూ ఆరు బాధపడుతుంది. ఐదు నిమిషాల్లో అన్ని రెడీ చేస్తాను. రాథోడ్ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి అని అక్షింతలు దేవుడి రూంలో పెట్టి వెళ్లిపోతుంది. అక్షింతలు చూసిన మనోహరి ఘోర ఇచ్చిన పొడిని అక్షింతల్లో కలపాలని వెళ్లి కలుపుతుంది. ఆరు దేవుడి రూంలోకి రాలేదని ఎందుకైనా మంచిది బయట పెడదామని తీసుకొచ్చి బయట టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు ఆరును గుప్త పిలుస్తాడు.
ఆరు: ఏంటి గుప్త గారు..?
గుప్త: బహుమతి ఇచ్చి వెను వెంటనే వచ్చేదని చెప్తివి.. అది చేయడం లేదు.
ఆరు: జస్ట్ అక్షింతలు తీసుకుని నా కూతురిని ఆశీర్వదించి వచ్చేస్తాను.
గుప్త: ఇటువంటివే చేయరాదని చెప్పితిని. నా మాట వినుము. ఆ ఘోర నీకోసం ఎచ్చట ఉచ్చు పెట్టెనె తెలియడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండవలెను.
ఆరు: దేవుడి ముందు ఉన్న అక్షింతలు ఏం చేయగలరు గుప్తగారు. ఒకవేళ ఏమైనా చేసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఏం కాదు.
అంటూ ఆరు వెళ్లిపోతుంది. మనోహరి దూరంగా వచ్చి అక్షింతల వైపే చూస్తుంది. ఇంతలో ఆరు వెళ్లి అక్షింతలు ఉన్న పల్లెం తీసుకోవడం చూసి హ్యాపీగా ఘోర రూంలోకి వెళ్తుంది.
మనోహరి: ఘోర బంధించేశావా? చెప్పు ఘోర బంధించేశావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎవ్వరి కంట పడకుండా వెళ్లిపో.. కావాలంటే నేనే పూజ దగ్గరకు వస్తాను. ఏంటి ఘోర ఇంకా అలాగే ఉన్నావు.
ఘోర: ఎక్కడికి వెళ్లేది. ఆ ఆత్మను బందించలేదు.
మనోహరి: బంధించలేదా? ఏం మాట్లాడుతున్నావు ఘోర బంధించలేదా? అంటే నీ మంత్రం పని చేయలేదా? అంటే దాన్ని ఎప్పటికీ బంధించలేమా?
ఘోర: లేదు అలా జరిగే అవకాశమే లేదు. అసలు పొడిని దేని మీద వేశావు.
మనోహరి: అక్షింతల్లో వేశాను.
ఘోర: దేవుడికి వాడే పవిత్రమైన పసుపులో మన పొడిని కలిపితే అసలు ఎలా పనిచేస్తుంది అనుకున్నావు.
అని ఘోర చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. కింద కూలబడిపోతుంది. మరోవైపు అక్షింతలు తీసుకుని ఆరు, అంజు దగ్గరకు వెళ్లి ఆశీర్వదిస్తుంది. తనపై అక్షింతలు పడటంతో అంజు భయపడుతుంది. ఎవ్వరూ లేకుండా తనపై అక్షింతలు పడ్డాయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన భాగీ ఆరును చూసి పలకరిస్తుంది. మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడుగుతుంది. తర్వాత మీరు వెళ్లి పార్టీలో జాయిన్ అవ్వండి నేను వస్తాను అని చెప్పి భాగీ లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: శారదకు గుండు కొట్టించబోయిన అపూర్వ- ఇందును గుడికి