Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ, విద్యాదేవి, లలిత, జనార్థన్‌లు చక్కగా మాట్లాడుకుంటారు. ఇక సీతని మహాలక్ష్మీ తీసుకొని వస్తుంది. సీత జనార్థన్, విద్యాదేవిల ఆశీర్వాదం తీసుకుంటుంది. అత్తామామల ఆశీర్వాదం తీసుకోమంటే మామయ్య, టీచర్ల ఆశీర్వాదం తీసుకున్నానేంటి అనుకుంటుంది. మహాలక్ష్మీ కోపంతో చూస్తుంది. మనసులో కాసేపటి తర్వాత నేను పేల్చిన బాంబ్‌కి అందరి మైండ్ బ్లాంక్ అయిపోతుందని అనుకుంటుంది. ఇక సీతకి మహాలక్ష్మీ పాల గ్లాస్ అందించి గదిలోకి తీసుకెళ్తుంది. సీత మహాలక్ష్మీకి థ్యాంక్స్ చెప్తుంది.
లలిత: ఈ కార్యం మీ చేతుల మీదుగా అవ్వడం చాలా సంతోషంగా ఉంది వదినా.
విద్యాదేవి: మహాలక్ష్మీ గారు మనకంటే చాలా సంతోషిస్తున్నారు వదినగారు.
శివకృష్ణ: కన్న తల్లి కాకపోయినా తల్లే కదమ్మా ఆమాత్రం ప్రేమ ఉంటుంది కదా.
మహాలక్ష్మీ: మనసులో తీరిగ్గా కూర్చొని నా మీద సెటైర్లు వేస్తున్నారు కదా మీ పని చెప్తా
జనార్థన్: మీరు మహాని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ తను రామ్, సీతల్ని మహానే ఒక్కటి చేసింది
శివకృష్ణ: మా చెల్లిలి మంచి గురించి మాకు తెలీదా బావ గారు పైకి అలా కనిపించినా మంచిది.
లలిత: పైకి కరుడుగా కనిపించినా మనసు వెన్న మా వదినది.
సీత పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్తుంది. రామ్ సీతని చూస్తూ అలా ఉండిపోతాడు. సీత రామ్ దగ్గరు వెళ్లి సిగ్గు పడితే కొత్తగా సిగ్గు ఏంటి సీత అంటాడు. ఇలాంటి టైంలో కూడా నేను సిగ్గు పడకపోతే నువ్వు ఫీలవుతావని అంటుంది. అంటే నటిస్తున్నావా అని రామ్ అంటే నీ దగ్గర నాకు సిగ్గు ఏంటి మామ నువ్వు పాతబడిపోయిన మొగుడివే కదా అని అంటుంది. ఏంటా ఆ మాటలు అని రామ్ అంటాడు. ఇక సీత మహాలక్ష్మీనే తనని రెడీ చేసి పాల గ్లాస్ చేతిలో పెట్టి పంపించిందని సీత రామ్‌కి చెప్తాడు. దానికి రామ్ మా పిన్ని మంచితనం అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు. రామ్ సగం పాలు తాగి సీతకి ఇస్తాడు. సీత కూడా తాగుతుంది.. ఇక మహాలక్ష్మీ అర్చన కాల్ చేయాలి కదా ఏంటి ఇంకా చేయడం లేదు అని ఆలోచిస్తుంది. ఇంతలో అర్చన కాల్ చేస్తుంది. కావాలనే మహాలక్ష్మీ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది.
అర్చన: మహాలక్ష్మీ ఇందాక సుమతి అక్క నాకు ఫోన్ చేసి మన ఇంటికి వస్తాను అని చెప్పింది మహా.
జనార్థన్: సుమతి ఫోన్ చేసిందా.
మహాలక్ష్మీ: ఏంటి అర్చన నువ్వు అనేది సుమతి ఫోన్ చేయడం ఏంటి.
అర్చన: అవును మహా ఏం చేయాలో నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు ఆయన కూడా లేరు మహా. సుమతి బావగారిని ప్రీతిని, రామ్‌ని వెంటనే చూడాలని ఉందని చెప్పింది మహా. అందుకే టెన్షన్‌గా ఉంది.
మహాలక్ష్మీ: దానికి టెన్షన్ ఎందుకు మేం ఇప్పుడే వస్తాం రామ్, ప్రీతిని తీసుకొని వస్తాం. ప్రీతి పెళ్లికి సుమతి వస్తుంది అన్నయ్యగారు ప్రీతికి మీరు చూసిన సంబంధమే అవుతుంది. ఈ రోజు అన్నీ శుభాలే జరుగుతున్నాయని అంటాది. సుమతి ఎందుకు చేస్తుంది. ఫేక్ కాల్ అయింటుందని లలిత అంటే జనార్థన్కి కాల్ చేసింది లెటర్స్ వచ్చాయి అన అంటుంది. ఇక జనార్థన్ శివ వాళ్లతో మీకు అభ్యంతరం ఏంటి అని అడుగుతాడు. శుభకార్యం జరుగుతుంటే సుమతి ఇక్కడికి రావాలి కానీ అక్కడికి రావడం ఏంటి.. అని విద్యాదేవి అంటే దానికి మహాలక్ష్మీ సుమతి కంటే తొలిరేయి ముఖ్యమా అని ప్రీతిని పిలుస్తుంది. ప్రీతి చాలా సంతోషిస్తుంది. ఇక మహాలక్ష్మీ రామ్, సీతని పిలవడానికి వెళ్తుంది. విద్యాదేవి పిలవొద్దని అంటుంది. లలిత కూడా కార్యం ఆపొద్దని అంటుంది. అయినా వినకుండా మహాలక్ష్మీ ఆపడానికే ప్రయత్నిస్తుంది. రామ్, సీతల గది డోర్ కొడుతుంది. సిటీకీ వెళ్లాలని చెప్తుంది. ఏం చేయలేకపోతున్నానని విద్యాదేవి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌కి 5 కోట్లు ఇచ్చిన మహదేవయ్య కోడలిలో ఛాలెంజ్.. సంజయ్ సంధ్యని ట్రాప్ చేస్తాడా!