Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌కి మత్తు మందు కలిపిన పాలు ఇచ్చి రామ్‌తో ఏకాంతంగా గడిపి రామ్ మిథునతో తప్పు చేశాడన్నట్లు రామ్తో గొడవ పడుతుంది. నీ వల్ల నేను చాలా లాస్ అయ్యాను మీ పిన్ని దగ్గరకు వెళ్దామని అంటుంది. మనమే సెటిల్ చేసుకుందామని రామ్ అంటాడు. ఏంటి సెటిల్ చేసుకునేది ఇలా జరిగింది అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని మిథున గొడవ చేస్తుంది. రామ్ కుప్పకూలిపోయి బాధ పడతాడు. మిథునలా ఉన్న సీత చూసి సారీ మామ నీ కోసమే ఇదంతా చేస్తున్నా నువ్వు ఈ రోజు బాధ పడినా నిజం తెలిసిన రోజు నీకే అర్థమవుతుందని ఏడుస్తుంది. రామ్ కూడా ఏడుస్తాడు.
మహాలక్ష్మీ, అర్చన ఇద్దరూ రామ్, మిథునల గురించి ఆలోచిస్తుంటారు. ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అని టెన్షన్ పడతారు. ఇంతలో ముఖర్జీ భార్యతో కలిసి ఇంటికి వస్తారు. మిథున అర్జెంటుగా మాట్లాడాలి అని మిథున రమ్మని చెప్పిందని అంటారు. అందరూ ఏమైందా అని టెన్షన్ పడతారు. మిథున, రామ్‌లు ఇంటికి వస్తుంటారు. నిన్ను అస్సలు వదలను రామ్ అని మిథున చెప్తుంది. ఇద్దరూ ఇంటికి వస్తారు. రామ్ ఆపినా ఆగకుండా మిథున ఇంట్లోకి సీరియస్‌గా వస్తుంది. తర్వాత ఇద్దరూ తప్పు చేసిన వాళ్లలా అందరి ముందు తల దించుకుంటారు.
మిథున: మ్యాటర్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా రామ్. మీ రామ్ చాలా మంచోడు జంటిల్ మ్యాన్ అనుకున్నా ఇంత చీప్‌గా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. జనార్థన్: మైండ్ యువర్ ల్యాంగ్‌వేజ్ మిథున. రామ్ని చీప్ క్యారెక్టర్అనొద్దు. అర్చన: ఏం చేశాడు మిథున మారామ్.మహాలక్ష్మీ: ఏం చేశావ్ రామ్. రామ్: అది పిన్ని అది అది..చలపతి: ఏంటి రామ్ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా.మిథున: గొడవ కాదు అంతకు మించి జరిగింది. మిథున ఏడుస్తూ నైట్ రామ్ డ్రింక్ చేసి ఆ మత్తులో నన్ను అని తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. నేను చెప్పలేను మామ్. నైట్ అంతా అయిపోయింది. తండ్రిని కూడా హగ్ చేసుకొని ఎస్ డాడ్ నా జీవితం నాశనం అయింది. అర్చన: మహా ప్లాన్ సక్సెస్.మహాలక్ష్మీ: ఎస్ మిథున మన ప్లాన్ సక్సెస్ చేసింది. ఇప్పుడు కథ నేను నడిపిస్తా.రేఖ: మీ అన్నదమ్ములు ఇంతేనా. ఒంటరిగా ఆడది కనిపిస్తే వదలరా.గౌతమ్: రామ్ అలాంటోడు కాదు అనుకున్నా వాడు నా టైపే అన్నమాట.
ముఖర్జీ, సుశీల ఇద్దరూ మహాలక్ష్మీని నిలదీస్తారు. జనార్థన్ వాళ్లతో మా రామ్ అలాంటి వాడు కాదు అని అంటారు. మహాలక్ష్మీ రామ్‌ని అడిగితే నేను కావాలని చేయలేదు పిన్ని జరిగింది ఏంటో నాకు తెలీదు అంటాడు. గౌతమ్‌తో నిశ్చితార్థం అన్నారు గౌతమ్ ఫ్రాడ్ అని తేలింది ఇప్పుడు రామ్ నా జీవితంతో ఆడుకున్నాడు నాకు ఎవరు న్యాయం చేస్తారు అని మిథున నిలదీస్తుంది. దాంతో మహాలక్ష్మీ నేను న్యాయం చేస్తానని పసుపు తాడు తీసుకొచ్చి మిథునకు సారీ చెప్పి నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇదే అని తాళి చూపిస్తుంది. రామ్ షాక్ అయిపోతాడు.
రామ్ మిథున మెడలో తాళి కట్టు అంటుంది. దానికి రామ్ నాకు ఇప్పటికే పెళ్లి అయింది సీత ఉంది ఇప్పుడు మరొకరి మెడలో ఎలా తాళి కడతాను పిన్ని అని అడుగుతాడు. మిథున మీద చేయి వేయక ముందు అది తెలియాల్సింది అప్పుడు సీత గుర్తు రాలేదా అని మహాలక్ష్మీ అడుగుతుంది. మిథునని పెళ్లి చేసుకొని తీరాలని అంటుంది. దానికి రామ్ మిథునకు న్యాయం చేయడానికి సీతని అన్యాయం చేయను అని అంటాడు. మరి నాకు అన్యాయం చేస్తావా రామ్ అని మిథున అడుగుతుంది. సీత పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది.
ముఖర్జీ ఈ విషయం లీగల్‌గా తేల్చుకుందామని రామ్ మీద కేసు పెట్టి ఈ ఫ్యామిలీని కోర్టుకి ఈడ్చుకెళ్దామని అంటారు. మహాలక్ష్మీ వాళ్లని ఆపుతుంది. కేసులు కోర్టులు అనొద్దని రామ్తో నేను మాట్లాడి ఒప్పిస్తానని అంటుంది. జనార్థన్, మహాలక్ష్మీ, గిరి, అర్చన అందరూ రామ్‌ని పెళ్లి చేసుకోమని చెప్తారు. రామ్ తాళి తీసుకుంటాడు. అర్చనకు అక్షింతలు తీసుకురమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!