Seethe Ramudi Katnam Today Episode : స్వీట్స్ కోసం ప్రీతి సుమతికి ముద్దు పెడుతుంది. సుమతి కూడా ప్రీతికి ముద్దు పెడుతుంది. ఉష అది చూస్తుంది. వెంటనే మహాలక్ష్మి, అర్చనల దగ్గరకు వెళ్లి ప్రీతి ఆ టీచర్‌కు ముద్దు పెట్టిందని చెప్తుంది. ప్రీతి ముద్దు పెట్టి స్వీట్స్ తీసుకుందని చెప్తుంది. ఇంతలో ప్రీతి స్వీట్స్ తింటూ అక్కడికి వస్తుంది. మహా ప్రీతి దగ్గరకు వెళ్తుంది.
మహాలక్ష్మి: స్వీట్స్ నీకు ఎవరు ఇచ్చారు.
ప్రీతి: విద్యాదేవి టీచర్ ఇచ్చారు పిన్ని.
మహాలక్ష్మి: ఆ టీచర్‌కు నువ్వు ఏం ఇచ్చావ్.
ప్రీతి: అది.. పిన్ని..
మహాలక్ష్మి: సిగ్గు లేదా నీకు ఆ సీతని పందెంలో ఓడించాలి అని మనం ట్రై చేస్తుంటే మనల్ని గెలవడానికి ఆ సీత ఆ టీచర్‌ని తీసుకుకొచ్చింది. అలాంటిదానికి నువ్వు ముద్దు పెడతావా. బుద్ధి లేదా. నిన్నూ.. అంటూ మహాలక్ష్మి ప్రీతిని కొట్టడానికి చేయి ఎత్తితే సుమతి(విద్యాదేవి) అడ్డుకుంటుంది.
విద్యాదేవి: ప్రీతిని ఎందుకు కొడుతున్నారు.
మహాలక్ష్మి: నా కూతురు నా ఇష్టం అడగటానికి నువ్వు ఎవరు.
విద్యాదేవి: ప్రీతి నీ కన్న కూతురు కాదు కదా. సీత చెప్పింది. మీరు ప్రీతికి సవతి తల్లి కదా అందుకేనా మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు.
మహాలక్ష్మి: నేను సవతి తల్లిని కాదు సొంత తల్లి కంటే ఎక్కువ.
విద్యాదేవి: అలాంటప్పుడు మీరు ప్రీతికి ఇష్టమైనవి చేసి పెట్టాలి కానీ తనకిష్టమైన స్వీట్స్ తింటుంటే ఎందుకు కొడుతున్నారు.
మహాలక్ష్మి: అవి నువ్వు చేసినవి కాబట్టి ప్రీతి నీకు ముద్దు పెట్టింది కాబట్టి.
సీత: తల్లి లాంటి ఆవిడకు ప్రీతి ముద్దు పెడితే తప్పు ఏముంది. కూతురు లాంటి ప్రీతికి టీచర్ స్వీట్స్ పెడితే తప్పేముంది. అది నేరమా..
మహాలక్ష్మి: ప్రీతి, ఉషల ఏ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు.
సీత: టీచర్ స్వీట్స్ ఇస్తే బదులుగా ప్రీతి ముద్దు పెట్టింది. దాన్ని మీరు సహించలేకపోతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి. సుమతి అత్తయ్య చనిపోయిన తర్వాత మీరు మామకు ప్రేమను పంచి ఉండొచ్చు అంత మాత్రానా వారిపై మీకు సర్వ హక్కులు ఉన్నాయి అనుకోవడం తప్పు.
మహాలక్ష్మి: నాకు కాక ఇంకెవరికి ఉంటాయి.
సీత: కనిపెంచిన పిల్లలపై కన్న తల్లికి మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి. మిగతా వారికి ఆ పిల్లలపై బాధ్యత మాత్రమే ఉంటుంది.
మహాలక్ష్మి: ఆ బాధ్యత తీసుకున్నవాళ్లు కన్న తల్లిదండ్రులతో సమానం.
సీత: నేను ఏం కాదు అనలేదే. మీలాగే టీచర్ కూడా బాధ్యత తీసుకున్నారు.
అర్చన: అంటే నీ దృష్టిలో మహా, ఆ టీచర్ ఒకటేనా.
సీత: ప్రేమ విషయంలో ఎవరైనా ఒకటే అంటున్నాను.
అర్చన: రామ్, ప్రీతిల మీద ప్రేమతో మహా తనకు పిల్లలే వద్దు అనుకుంది అంత త్యాగం ఎవరు చేస్తారు.
సీత: అది త్యాగమో తన అందం మీద వ్యామోహమో ఎవరికి తెలుసు.
మహాలక్ష్మి: సీత.
సీత: ఇలా అంటే మీకు కోపం వస్తుంది అని నాకు తెలుసు అత్తయ్య, ఆ రోజు మామని ఒకరు కాపాడారు కదా ఆవిడ మీతో సమానమే కదా. ఇంకా చెప్పాలి అంటే తను సుమతి అత్తమ్మతో సమానం. ఈ రోజు సుమతి అత్తయ్యలా మా టీచర్ రామ్, ప్రీతిలకు స్వీట్స్ చేసి పెట్టింది అంటే ఈవిడ కూడా మా సుమతి అత్తయ్యతో సమానమే కదా. టీచర్ వీళ్లకి ఏం చెప్పినా అర్థం కాదు. పదండి.
చలపతి, రేవతిలు భరతనాట్యం పోటీ గురించి శివకృష్ణకు ఫోన్ చేసి చెప్తారు. శివకృష్ణ కుటుంబం మొత్తం షాక్ అవుతారు. సీతని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి మహా కుట్ర చేస్తుంది అని సీత కూడా మధుమితని ఇంటి నుంచి పంపడానికి పందెం కాసింది అని చెప్తారు. ఇక సీత పంతానికి పోయి పందానికి ఒప్పుకుందని లీలా అంటుంది. సీతకి అస్సలు డ్యాన్స్ రాదు అని మధుమిత కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని లలిత అంటుంది. సీతని ఒప్పించమని శివకృష్ణకు చెప్తారు. కావాలి అంటే మధుని బెదిరించి అయినా ఇంటికి తీసుకొచ్చేమని శివకృష్ణ తల్లి చెప్తుంది.
ఇక ఉదయం సీత దేవుడికి దండం పెట్టుకుంటుంది. అయితే దేవుడి దగ్గర ముత్యాల హారం కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. అర్చన, మహాలక్ష్మిలు వచ్చి ఏమైనా పోగొట్టుకున్నావా. ముత్యాల హారం పోయిందా అని అడగుతారు.
సీత: ఆ హారం మీరే తీశారా.. అది నాకు సెంటిమెంట్ మర్యాదగా ఇవ్వండి.
మహాలక్ష్మి: సెంటిమెంటా ఆ హారం వల్ల నీకు ఏం కలిసి వచ్చింది. అది మీ అక్క దగ్గర ఉంది.
సీత: నా హారం మా అక్క ఎలా తీసుకుంటుంది.
మహాలక్ష్మి: అది మాకు అడిగితే ఎలా తెలుస్తుంది. వెళ్లి మీ అక్కనే అడుగు.
సీత: అడుగుతాను ఇప్పుడే తేల్చుతాను. అక్క.. ఏంటి నువ్వు చేసిన పని. దేవుడి దగ్గర పెట్టిన నా ముత్యాల హారం ఎందుకు తీసుకున్నావు.
మధు: ఇది నీ హారమా. దీనిపైన రాసి ఉందా.
సీత: వెటకారం వద్దు అక్క. నాది నాకు ఇవ్వు.
విద్యాదేవి: సీత ఆ హారం ఏంటి.. సీత జరిగింది చెప్తుంది.
సీత: ఆ హారాన్ని నేను దేవుడి గదిలో పెట్టుకొని ఎంతో పవిత్రంగా చూసుకుంటుంటే ఇప్పుడు మా అక్క తీసుకుంది.
మధు: దీన్ని నేను తీసుకోలేదు. రామ్ గారు ఇచ్చారు.
సీత: నిజంగా ఆయనే ఇచ్చారా..
మహాలక్ష్మి: రామ్ స్వయంగా ఇచ్చాడు అంటే అది మధు దగ్గరే ఉండాలి.
విద్యాదేవి: అలా ఎలా చెప్తారు అండి స్వామి వారి సన్నిధిలో ఈ హారం తమ దంపతుల మీద పడింది అని సీత చెప్తుంది. అంతే సీత దగ్గరే ఉండాలి కదా.
మహాలక్ష్మి: ఇది మా ఇంటి విషయం ప్రతీ సారి నువ్వు దూరక్కర్లేదు.
సీత రామ్‌ని పిలిచి ఆ హారం మధుకి ఇచ్చారా అని అడుగుతుంది. రామ్ ఇచ్చాను అని చెప్తాడు. సీత, సుమతి షాక్ అవుతారు. సీత ఎందుకు ఇచ్చావని అడుగుతుంది. ఇక రామ్ తన పిన్ని ఇవ్వమని చెప్పిందని ఈ హారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ల జీవితం బాగుంటుందని తన పిన్ని చెప్పిందని అందుకే మధుకి ఇచ్చానని చెప్తాడు. మధు కూడా సీతకు తన స్వార్థమే తప్ప నా గురించి పట్టించుకోదు అని అంటుంది. ఇక మధుకి ఆ హారం ఇవ్వడం వల్ల సీత ఫీలవుతుందని హారం సీతకి ఇచ్చేమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మాస్ కా దాస్‌కు.. గాడ్ ఆఫ్ మాస్ సపోర్ట్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం బాలయ్య గ్రాండ్ ఎంట్రీ