Seethe Ramudi Katnam Today Episode సీత కాళ్లు నొప్పి అంటే రామ్ కాళ్లు నొక్కుతాడు. మధుమితని ఇంటి నుంచి పంపించడానికి తాను ఈ పోటీ నుంచి ఎలా అయినా గెలవాలి అనుకుంటుంది. రామ్‌తో తాను ఈ పోటీలో ఎలా అయినా గెలవాలి అంటుంది. పందెం గురించి తెలియని రామ్ సరదా పోటీనే కదా గెలవకపోయినా ఏం కాదు అంటాడు. ఇక రామ్ సీత గెలిచాక తనకు ముద్దు ఇస్తావా అని అడుగుతాడు. సీత వంద ఇస్తా అని అంటుంది. ఇక ఇద్దరూ కబుర్లు చెప్పుకొని పడుకుంటారు.


సుమతి: నిన్న మహాలక్ష్మి నాకు ఎదురు పడింది. మారిన నా రూపాన్ని గుర్తుపట్టలేదు. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేవుడు నా రూపం మార్చాడేమో. అనుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న సుమతి రౌడీ రంగని చూస్తుంది. వాడిని ఏం చేసినా పాపం లేదు అనుకుంటూ  పక్కనే ఉన్న కర్ర తీసుకొని చితక్కొడుతుంది. రంగ పరుగెత్తుకుంటూ వెళ్లి మహాలక్ష్మి కారుని ఢీ కొడతాడు. 


మహాలక్ష్మి: రేయ్ ఏమైంది ఎందుకు పరుగెడుతున్నావ్.
రంగ: అమ్మా ఆవిడ ఎవరో నన్ను కొడుకుతుందమ్మా.. తట్టుకోలేక పారిపోయి వచ్చాను. 
మహాలక్ష్మి: ఎవరో లేడీ నిన్ను ఎందుకు కొట్టింది నువ్వు ఏం చేశావ్.
రంగ: నేను ఏం చేయలేదమ్మా. నా పాటికి నేను టీ తాగుతుంటే కర్ర పట్టుకొని వచ్చి చితక్కొట్టేసింది. యాక్సిడెంట్ చేసి చంపుతావా, నా జీవితాన్ని తల కిందుల చేసి చంపుతావా అని కొట్టింది మేడమ్.
మహాలక్ష్మి: కొంపతీసి తను సుమతి కాదు కదా. ఆ లేడీ ఎక్కడ ఉంది. పద చూద్దాం. 
రంగ: వద్దు మేడం మళ్లీ కొడుతుంది.
మహాలక్ష్మి: నేనున్నా కదా పద ఏం కాదు. అంటూ రంగని తీసుకొని మహాలక్ష్మి సుమతి రంగని కొట్టిన ప్లేస్‌కు వెళ్తుంది. అక్కడ సుమతి ఉండదు.  ఆ లేడీ ఎవరు అయింటారు. సుమతి యాక్సిడెంట్ గురించి ఎలా చెప్పింది. నిన్ను కొట్టిన ఆ లేడీని సరిగ్గా చూశావా తను సుమతి కాదు కదా. 
సీత: సీత నడుచుకుంటూ వస్తూ మహాలక్ష్మి కారు చూసి ఆగుతుంది. కారులో మహాలక్ష్మి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందా అని అనుకుంటుంది. అత్తయ్య ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందని వెతుకుతుంది. 
మహాలక్ష్మి: నిజం చెప్పు తను సుమతి కాదు కదా. తను నిన్ను కొట్టింది సుమతి యాక్సిడెంట్ గురించి.
రంగ: సుమతి అని ఎందుకు అనుకుంటున్నారు మేడం. నేను లారీతో గుద్ది చాలా మందిని చంపేశాను. వాళ్లలో ఈవిడ ఎవరి మనిషో అయింటుంది. 


మరోవైపు మహాలక్ష్మి రంగతో మాట్లాడటం సీత చూస్తుంది. దగ్గరకు వస్తుంటుంది. సీత వచ్చి మహాలక్ష్మి ఎదురుగా నిల్చొంటుంది. ఎప్పుడొచ్చావని సీతని అడుగుతుంది. సీత తనకు అంతా తెలుసు అని అంటుంది.


సీత: ఎందుకు అత్తయ్య అలా చేశారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా. మామయ్య ఏమంటారో తెలుసా. మామ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా సమాధానం చెప్పండి. నేను ఇంట్లో ఎప్పుడూ సుమతి అత్తయ్య ప్రస్తావన తెచ్చినా మీరు విసుక్కుంటారు. మీరు మాత్రం రోడ్డు పక్కన కారు ఆపి ఆరు బయట ఈ వ్యక్తితో సుమతి అత్తయ్య గురించి మాట్లాడుతున్నారు. మీరిద్దరూ సుమతి అత్తయ్య గారి గురించి ఏం మాట్లాడుతున్నారు. 
మహాలక్ష్మి: టైం గాడ్ ఇదేమీ వినలేదన్నమాట.
సీత: సుమతి అత్తయ్య గురించి నేను మాట్లాడటం తప్పు అయినప్పుడు ముక్కు ముఖం తెలియని ఈ వ్యక్తితో మీరు సుమతి అత్తయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ఇది తప్పు కాదా.
మహాలక్ష్మి: ఇది నిజంగా పిచ్చిదే. నన్ను భయపెట్టేలా మాట్లాడి ఏదేదో మాట్లాడుతుంది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్.
సీత: మార్కెట్‌కి అని బయల్దేరా మీ కారు చూసి వచ్చా. వీడు మన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లాడు కదా. మళ్లీ ఎందుకు వచ్చాడు.
మహాలక్ష్మి: సుమతి పేరుతో మళ్లీ డొనేషన్‌కి వచ్చాడు. 
సీత: అత్తయ్య మీరు ఏదో రహస్యం దాస్తున్నారు అని పిస్తుంది. ఏదో ఒక రోజు అది బయట పడుతుంది. మీరు అతనికి డొనేషన్ ఇస్తున్నారో మరేమైనా ఇస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. 


మధు ఏదో ఆలోచిస్తూ ఉంటే మహా గ్యాంగ్ అంతా అక్కడికి వస్తారు. సీతని తక్కువ అంచనా వేయొద్దని సీత పంతం పడితే సాధించిన వరకు వదలదని అంటుంది. సీత గెలిచే వరకు వదిలి పెట్టదని, సీతకు చదువు తప్ప మిగతా అన్నీ వేగంగా నేర్చుకుంటుందని మధు చెప్తుంది. 


మధు: ఇప్పటికే ఈ ఇంట్లో జరిగిన ఎన్నో గొడవల్లో సీత మీకు ఊహించని ట్విస్ట్‌లు ఇస్తూ మీ మీద పై చేయి సాధిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ డ్యాన్స్ పోటీల్లో కూడా సీత ఏదో రకంగా గెలిస్తే ఇబ్బందే కదా.
అర్చన: అలా జరిగే అవకాశమే లేదు మధు. ప్రీతి, ఉషలు చిన్నప్పటి నుంచి భరతనాట్యం చేస్తున్నారు. 
 
మరోవైపు సీత తాను ఎలా అయినా ఈ పందెంలో గెలిచి అక్కా బావలను కలపాలి అనుకుంటుంది. ఇక సూర్యను కలవడానికి శివకృష్ణ వస్తాడు. మరోవైపు సూర్యని జైలులోని మిగతా ఖైదీలు హేళన చేస్తారు. సూర్య భార్య వేరే వాడితో కులుకుతుందని అంటారు. ఆ మాటలు విన్న సూర్య తన కర్రతో వాళ్లని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ భర్త ఆత్మహత్య? ఆమె మరణించిన కొద్ది రోజుల్లోనే..