Seethe Ramudi Katnam Today Episode  : సుమతికి ముఖం సర్జరీ జరుగుతుంది. సీత, రామ్‌లు హాస్పిటల్‌కి వచ్చేసరికి సెల్ఫ్ డిశ్చార్జీ మీద సుమతి వెళ్లిపోయిందని తెలుసుకొని ఇద్దరూ బాధ పడతారు. అయితే సుమతి అదే హాస్పిటల్‌లో ఉండి కొడుకు కోడలు మాటలు విని బాధ పడుతుంది. 


సుమతి: రక్త సంబంధం అంటే ఇదే నేను నా కొడుకుని కాపాడు కుంటే రక్తం ఇచ్చి నా కొడుకు నన్ను కాపాడుకున్నాడు. 


సీత: బాధ పడకు మామ మనం ఆమె ఎవరో తెలీక అత్తమ్మ పేరు పెట్టుకున్నాం. మీ అమ్మ అనుకొని ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆవిడ గుర్తు పెట్టుకుంటుంది. 


రామ్:  నేను ఆవిడని హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడు ఆవిడ ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉందో ఏంటో.


సుమతి: నేను ఇకపై మీ వెన్నంటే ఉంటూ మీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటా. త్వరలోనే మీ ముందుకు వస్తా. 


సీత, రామ్‌లు ఇంటికి వెళ్లిపోతారు. సుమతి అది ఏడుస్తుంది. ఇక సుమతి దగ్గరకు డాక్టర్ వచ్చి మీ కోరిక ప్రకారం వాళ్లకి డిశ్చార్జ్ అయి మీరు వెళ్లిపోయారు అని చెప్పాను. మీకు కొత్త ముఖం అలవాటు అవడానికి కొంత టైం పడుతుందని అంటుంది. ఇక సుమతి ఈ కొత్త ముఖం తనకు చాలా అవసరం అని తాను వెళ్లిపోతానని అంటుంది. 


మరోవైపు సుమతి కోసం శివకృష్ణ ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఇంతలో సుమతి అన్నయ్యకి కాల్ చేస్తుంది. అందరూ సుమతితో మాట్లాడుతారు. సుమతి తన గురించి టెన్షన్ పడొద్దు అని ఇంటికి వచ్చే పరిస్థితుల్లో లేను అని కొన్ని రోజుల తర్వాత వస్తాను అని చెప్తుంది. ఇక తల్లి అన్నతో మాట్లాడి సుమతి కుమిలిపోతుంది.


సుమతికి ఏమైందో తెలీదని.. సుమతి వేరే వ్యక్తి ఫోన్ నుంచి ఫోన్ చేసిందని సుమతి తమకు దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నించినా దొరకదని శివకృష్ణ అంటాడు. ఇక అందరూ సుమతి తమ దగ్గరకు తొందర్లోనే వచ్చేలా చేయమని కోరుకుంటుంది. ఇక సీత ఆటోలో ఇంటికి వస్తుంది. రామ్ ఆఫీస్‌కు వెళ్లిపోతాడు. 


సీత ఇంటికి వచ్చేసరికి ఉష, ప్రీతిలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. జనార్థన్, గిరిధర్‌లు పొగుడుతూ ఉంటారు. ఇక డోర్ వేసేసి ఉంటారు. సీత డోర్ కొట్టినా ఎవరూ తలుపు తీయరు. దీంతో సీత బయట కిటికీ నుంచి చూస్తుంది. ఇద్దరు ఆడపడుచులు డ్యాన్స్ వేయడం చూసి వీళ్లు మళ్లీ కచేరి మొదలు పెట్టారా అనుకుంటుంది. తలుపు తీయమని అందర్ని పిలుస్తుంది. ఎవరూ పట్టించుకోరు. సీత తిట్టుకుంటుంది. 


ఇంతలో సాంబ పరుగున వస్తాడు. సీత  రాయి తీసుకొని రమ్మని పిలుస్తుంది. సాంబ రాయి తీసుకొని రావడంతో రాయిని సౌండ్ బాక్స్ మీదకు విసిరి కొడుతుంది. దీంతో పాటులు ఆగిపోతాయి. అందరూ సీతని చూస్తారు. షాక్ అయి నిలబడిపోతారు. రేవతి, చలపతి కూడా అక్కడికి వస్తారు. సీత తలుపు తీయమని అంటుంది. చలపతి వచ్చి తలుపు తీస్తాడు. 


సీత: ఏంటి మీ పిచ్చి గెంతులకు నిజంగానే కోతులు వస్తాయిని తలుపులు బిగించుకున్నారా.


గిరిధర్: నీకు పొగరు బాగా ఎక్కువ అయింది సీత. రాయి విసిరి స్పీకర్స్ మీద కొడతావా. 


సీత: ఏం చేయను తలుపులు కొట్టాను తీయలేదు. కాలింగ్ బెల్ కొట్టినా తీయలేదు. కిటికీ నుంచి పిలిచాను అయినా మీరు తలుపు తీయలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా అదో నాట్యమా వీళ్లు పిచ్చి గెంతులు వేస్తున్నారు. 


ఇక ప్రీతి, ఉషలు సీతని తిడతారు. మహాకు చెప్పి భరతం పడతామని అంటారు. దాంతో సీత మీదో భరత నాట్యం మీరు నా భరతం పడతారు అంటుంది. దీంతో మహా ఏంటి ఆ వెటకారం అంటూ ఎంట్రీ ఇస్తుంది. సీతకు ఒళ్లంతా కుళ్లు అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: ఎండీ అయినట్లు కలలు కంటున్న శైలేంద్ర – శైలేంద్రకు పిచ్చి పట్టిందన్న ధరణి