Brahmamudi Serial Today Episode : కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లననడంతో అపర్ణ కోప్పడుతుంది. దీంతో కళ్యాణ్‌ కూడా అపర్ణపై కోప్పడతాడు. అన్నయ్యను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించావ్. అది నా సమస్య కాదు. కంపెనీ గురించి మాట్లాడే ముందు నువ్వే ఓసారి ఆలోచిస్తే మంచిది అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ.


సుభాష్‌: ఎందుకు కోపం తెచ్చుకుంటావు. చిన్నవాడైనా సత్యం చెప్పాడు. ఏడాది క్రితం రాజ్‌కు మించినవాడు లేడు అని పట్టాభిషేకం చేశాము. ఇప్పుడు రాజ్‌ను తప్పించావ్. ఇప్పుడు ఇద్దరూ తప్పుకుంటే కంపెనీ ఎవరు చూసుకుంటారు.


కళ్యాణ్‌: సారీ పెద్దమ్మ. నిన్ను బాధపెట్టాలని కాదు. అయోధ్యపురిని ఎంతమంది పాలించిన అది రామ రాజ్యం అంటారు. కంపెనీ నిలవాలంటే అది అన్నయ్య వల్లే (అంటూ అనామికను చూస్తూ..) నువ్ ఎంత ఓండ్రు పెట్టినా నేను కవిత్వం రాయడం ఆపను. కంపెనీకు పోను. ఉంటే ఉండు లేకుంటే పో. లేదంటే మళ్లీ వెళ్లి పోలీస్ కేసు పెట్టుకో..


అంటూ అనామికను తిట్టి రాజ్‌కు సారీ చెప్పి వెళ్లిపోతాడు కల్యాణ్. ఇంట్లో జరుగతున్న గోడవలు  చూసి ఇందిరాదేవి బాధపడుతుంది. తర్వాత  ఆఫీస్‌కు రెడీ అవుతుంటాడు రాహుల్.


రుద్రాణి: ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు


రాహుల్‌: మమ్మీ నేను కంపెనీకి సీఈవో కాలేదు. జస్ట్ మెనెజింగ్ డైరెక్టర్‌ను మాత్రమే


రుద్రాణి: ఓరే  రాహుల్‌ చుట్టు ఉన్న అవకాశాలు చూడు. రాజ్ ఆఫీస్‌కు వచ్చే అవకాశం లేదు. కల్యాణ్ అసలే రావడం లేడు. ఆ కావ్య ఉంటుందా పోతుందా అన్నట్లు ఉంది. నువ్ ఒక్కడివే కంపెనీని చూసుకోగలవని చూపించు. ఇక్కడ కూడా వక్ర బుద్ధి చూపించకు.


స్వప్న: ఆహా.. మీ నోటి నుంచి నీతి వ్యాఖ్యాలు వినడం భలేగా ఉంది. కానీ, రాహుల్‌ను మీరు కాదు.. ఇంట్లో వాళ్లు నమ్మితే మీరు అనుకుంది జరుగుతుంది. కానీ, రాహుల్‌లో ఉంది మీ రక్తం. మీ నరనరాల్లోనే తప్పుడు చేసే ఆలోచన ఉంది. ముందు అక్కడి నుంచి మానుకుంటే తప్పా మంచి జరగదు.


అనగానే రాహుల్‌ వెళ్లిపోతాడు. మరోవైపు సుభాష్‌తో మాట్లాడుతుంది.


కావ్య: ఆయన్ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పంచారు. కవిగారు వెళ్లనంటున్నారు. రాహుల్ ఒక్కడే ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీ ఏమవుతుందో  మామయ్య.  కంపెనీని సమర్ధవంతంగా నడవాలంటే అత్తయ్య గారికి ఆయన మీద కోపం పోవాలి.


సుభాష్‌: అలా జరగాలంటే అపర్ణకు నిజం తెలియాలి. అందుకే నేను నిజం చెప్తానమ్మా!


కావ్య: ఈ పరిస్థితుల్లో  నిజం తెలిస్తే అత్తయ్యగారు ఏమైపోతారు. అసలు బాబు విషయంలో, తల్లి విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.


అంటూ బిడ్డ గురించి బిడ్డ తల్లి గురించి కావ్య అడుగుతుంది దీంతో మాయ గురించి డీటెయిల్స్‌ చెప్తాడు సుభాష్‌. డబ్బు కోసం నన్ను బ్లాక్‌ మెయిల్‌  చేస్తుందని ఇంతలో రాజ్‌ వచ్చి నన్ను సేవ్‌  చేశాడని చెప్తాడు సుభాష్‌. అయితే  మీరు ఇంకా డబ్బు పంపిస్తున్నారా?  అని కావ్య అడగ్గానే..  నెల క్రితమే పంపించానని సుభాష్‌ చెప్తాడు.. ఇదంతా వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నిజనిజాలు తెలుసుకోవాలి మామయ్యా అంటూ ఆ మాయ అడ్రస్ తెలుసా అని కావ్య అడుగుతుంది. సరే ఆవిడకు నెల నెల డబ్బు పంపించే అకౌంట్‌కు రెసిడెన్స్ అడ్రస్ ఉంటుంది కదా అని కావ్య అడిగితే.. పంపిస్తాను అని సుభాష్ అంటాడు. కావ్య, రాజ్‌ ఎవరి కారులో వారు మాయ దగ్గరికి వెళ్తుంటారు.


రాజ్‌: కళావతి నా కారు వెనుకే వస్తుంది. నన్ను ఫాలో అవుతుందా?


 అనుకుంటూ లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్‌కు వెళ్తాడు రాజ్‌. డ్రైవర్ రాజ్ గురించి కావ్యకు చెబితే.. ఆయన ట్రాఫిక్ రూల్స్ అలాగే ఉంటాయి. ఆయన ఎటు వెళ్తే మనకేంటి నువ్ స్టైట్‌గా వెళ్లు అని చెబుతుంది కావ్య. తర్వాత బస్తీ లోపలికి కారు వెళ్లదని డ్రైవర్‌ చెప్పడంతో కావ్య నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. బస్తీలో ఉన్న రౌడీలు కావ్యను చూసి కిడ్నాప్‌ చేయాలనుకుంటారు. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్