Seethe Ramudi Katnam Today Episode మధుమిత బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అని చెప్తుంది. దాంతో సీత లేటుగా అయినా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అక్క. ఇప్పటికైనా మేల్కొన్నావు. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వెంటనే మన అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపో అని సీత మధుతో చెప్తుంది. 


మధు: నేను ఎక్కడికి వెళ్లాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. 
మహాలక్ష్మి: నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే ఉండు మధు.
రేవతి: తను వెళ్తాను అంటే వద్దంటావ్ ఏంటి వదినా. ఇక్కడ ఉండటం మధుకి ఇష్టం లేదేమో పంపించేసే వదినా.
మహాలక్ష్మి: నువ్వు నోరు మూస్తావా.. మధు కష్టాల్లో ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాను. తన కష్టం తీర్చకుండా ఇక్కడి నుంచి పంపను.
సీత: మా అక్క కష్టం తీర్చడానికి మా అమ్మానాన్నలు ఉన్నారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. 
మధు: నా కష్టం నువ్వేనే నీ వల్లే నేను వెళ్లిపోవాలి అనుకుంటున్నాను.
సీత: మంచిది బయల్దేరు. 
మహాలక్ష్మి: నా గెస్ట్‌ని వెళ్లిపోమని చెప్పడానికి నువ్వు ఎవరు సీత.
సీత: నేను ఈ ఇంటి కోడలిని. తను మా అక్క.
మహాలక్ష్మి: నేను నీ అత్తయ్యని. ఈ ఇంటికి యజమానురాలిని. 
రేవతి: ఎన్నాళ్లు అని మధుని మన ఇంటిలో పెట్టుకుంటాం.
మహాలక్ష్మి: అసలు నువ్వు ఎన్నాళ్ల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నావో తెలుసా. నువ్వు ఉండగా లేనిది మధు ఉంటే తప్పా. అసలు మధు ఎందుకు వెళ్లిపోవాలి అనుకుంటుందో మీలో ఎవరికైనా తెలుసా.. ఈ సీత మధుని సూటిపోటి మాటలతో అవమానించింది. మధుని నెట్టేసి గదిలో బంధించి అమర్యాదకరంగా ప్రవర్తించింది. సొంత చెల్లే అలా చేసినందుకు మధు తట్టుకోలేకపోయింది. నీ వల్ల మధు హర్ట్ అయింది తనకు సారీ చెప్పు. 
సీత: నేను సారీ చెప్పను. తను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంక బయటకు దయచేయు అక్క. వెళ్లిపో. ఎవరు ఏం చెప్పినా నేను నీకు సారీ చెప్పను. నువ్వు వెళ్లిపోతే థ్యాంక్స్ చెప్తాను.
రామ్: స్టాపిట్ సీత. ఎందుకు తనని హర్ట్ చేస్తున్నావ్. నేను అంతా విన్నాను. నువ్వు మీ అక్క మనసు గాయపడేలా చేశావు. నువ్వు సారీ చెప్తే తను ఇక్కడ ఉండిపోతుంది. 
సీత: సారీ మామ నేను తనకి సారీ చెప్పను. తను ఇక్కడ ఉండకూడదు అనే సారీ చెప్పను అంటున్నాను.
మహాలక్ష్మి: రామ్ చెప్పినా వినవా నువ్వు. 
సీత: ఈ విషయంలో దేవుడు చెప్పినా వినను. మా అక్క తప్పుగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడే ఉండే ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఇది నీ ఇళ్లు కాదు. నీకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపో. 


సీత మాటలకు మధు ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంటుంది. ఇంతలో రామ్ మధుని ఆపుతాడు. వెళ్లొద్దని రామ్ చెప్తాడు. దీంతో మహాలక్ష్మి రామ్‌కి నువ్వు ఇక్కడే ఉండిపోవడం ఇష్టం ఇక నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది. మహాలక్ష్మి మధుని మళ్లీ తన గదికి పంపేస్తుంది. సీత కోపంతో రగిలిపోతుంది. 


మహాలక్ష్మి మధుమిత దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటుంది. నువ్వు చాలా లక్కీ అని రామ్ నీకు సారీ చెప్పి ఇంట్లో ఉన్నమన్నాడు అని అంటుంది. 


మహాలక్ష్మి: రామ్ నిన్ను ఇష్టపడుతున్నాడు మధు. నువ్వు ఇక్కడే తన కళ్ల ముందు ఉండాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు అంటే తనకి ఎంత ఇష్టం లేకపోతే సీత మాట కాదని నిన్ను ఇక్కడే ఉంచుతాడు. నీకు మేం మొదటి నుంచి చెప్తున్నాం మధు. రామ్‌ మొదటి సారి నిన్నే ఇష్టపడ్డాడు. తొలిచూపులో ఏర్పడిన ప్రేమ అంత ఈజీగా పోదు. రామ్ మనసులో ఇంకా నువ్వే ఉన్నావు. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. అందుకే సీత చెప్పలేని సారీ తను చెప్పి నిన్ను వెళ్లనివ్వకుండా ఆపాడు. ఇది తప్పా ఒప్పా, నైతికమా అనైతికమా అని ఆలోచించకు మధు. లైఫ్‌లో తెలీక కొన్ని పొరపాట్లు చేస్తుంటామ్. అలా నువ్వు సూర్యని, రామ్ సీతని పెళ్లి చేసుకున్నాడు. మీ రెండు జంటలు పెళ్లి చేసుకున్నారు. కానీ మనసులు కలవలేదు. శరీరాలు కలవలేదు. దేవుడు ఒక్కోసారి మనకు రెండో అవకాశం ఇస్తాడు. అలా నీకు సూర్య నిజస్వరూపం తెలిసింది. ఈ రోజు మనసు ఏంటో కూడా నీకు అర్థమైంది. ఏ అవకాశం దొరికినా మేం సీతని బయటకు పంపి నిన్ను ఈ ఇంట్లో పర్మినెంట్‌గా ఉంచుకుంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా మధు సీతకు బదులుగా నిన్ను ఈ ఇంటి కోడలి స్థానాన్ని ఇస్తా. నిన్ను రామ్ భార్యని చేస్తా. ఇది జరుగుతుందా లేదా అని ఆలోచించకు. నీకు ఇష్టమా లేదా అని నిర్ణయించుకో. 


మరోవైపు సీత అలిగి ఉంటే రామ్ హగ్ చేసుకొని సీతని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. సీత రామ్ మీద కోప్పడుతుంది. సీతని మధు గురించి నచ్చ చెప్తాడు.  మరోవైపు మధుమిత మోడ్రన్‌గా రెడీ అయి ప్రీతి, ఉషలతో కలిసి వస్తుంది. రేవతి చూసి షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే పబ్‌కి వెళ్తున్నాం అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కళ్లు తిరిగి పడిపోయిన ముకుందకు టెస్ట్‌ చేసి కంగుతిన్న కృష్ణ.. నిజం బయట పెడుతుందా!