Seethe Ramudi Katnam Serial Today Episode సీతని వ్రతానికి రావొద్దని రామ్ చెప్తాడు. సీత రామ్‌తో ఓ ఆట ఆడుకుంటుంది. మిథునని టచ్ చేస్తే నీకు ఉంటుందని అంటుంది. రామ్ టచ్ చేయనని ప్రామిస్ చేస్తాడు. ఇక సీత మహాలక్ష్మీ అత్త నీకు రేపు ఉంటుంది దబిడదిబిడే అని అనుకుంటుంది. రేఖ సూసైడ్ నోట్ రాసి గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. గౌతమ్ చూసి షాక్ అయిపోతాడు.
గౌతమ్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావే అని అంటే ఫ్యాన్‌కి తాడు కట్టి ఉయ్యాలూగుతున్నా అని అంటుంది. ఇక లెటర్ తీసుకొని గౌతమ్ చదివి షాక్ అయిపోతాడు. మహాలక్ష్మీ, అర్చనలు అటుగా వెళ్తూ చూసి కంగారుగా లోపలికి వస్తారు. ఏమైంది అని అడిగితే మహాలక్ష్మీకి లెటర్ ఇస్తాడు గౌతమ్. అందులో గౌతమ్ మహాలక్ష్మీ కొడుకు అని గౌతమ్ సుమతిని హత్య చేసి చంపాడని అన్నీ రాస్తుంది. మహాలక్ష్మీ కోపంగా రేఖని కిందకి దించి ఏంటే నువ్వు చచ్చి మమల్ని చంపాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి రేఖ మరేం చేయాలి మీరు మాకు పెళ్లి చేయడం లేదు కానీ రామ్, మిథునలకు పెళ్లి చేశారు. వాళ్లతో వ్రతం చేయిస్తున్నారు. నగలన్నీ తనకే ఇస్తున్నారని అంటుంది. దానికి ఇచ్చే నగలు రెండు కోట్లు కూడా ఉండవని వాటిని ఆ మిథునకు ఇచ్చి దాని దగ్గరున్న కోట్లను ఎర వేసి తీసుకుందామని అంటుంది.
ఇంతలో రామ్ అక్కడికి వస్తాడు. అందరూ కంగారు పడతారు. ఏం మాట్లాడుతున్నారు అంటే వ్రతం గురించి అని రేఖ అంటుంది. సీతతో మాట్లాడాను వ్రతం సింపుల్‌గా చేయండి అని రామ్ చెప్తాడు. మహాలక్ష్మీ సరే అంటుంది. ఇంతలో రామ్ ఫ్యాన్‌కి ఉరి తాడు చూసి ఎవరో హ్యాంగ్ చేసుకునేలా ఉన్నారని అంటాడు. లేదని రేఖ ఇంట్లో పనులు అన్నీ చేస్తుంది ఫ్యాన్ క్లీన్ చేస్తుందని మహాలక్ష్మీ కవర్ చేస్తుంది. త్వరగా పెళ్లి చేయకపోతే ఈ సీన్ రిపీట్ అవుతుందని మహాలక్ష్మీని రేఖ బెదిరిస్తుంది. పోయి పోయి ఇదెక్కడ దొరికిందిరా నీకు అని మహాలక్ష్మీ గౌతమ్‌ని అడుగుతుంది.
వ్రతానికి అన్నీ ఏర్పాట్లు పూర్తవుతాయి. గౌతమ్, రేఖలు రావడంతో పంతులు జంట వచ్చేశారు కదా అంటారు. దాంతో అందరూ ఈ జంటకి ఇంకా పెళ్లి కాలేదని అంటారు. రామ్ ఒళ్లు తెలీకుండా తప్పు చేశాడని చలపతి అంటే రామ్ కోప్పడతాడు. మహాలక్ష్మీ కూల్ చేసి రామ్‌ని రెడీ అవ్వమని చెప్తుంది. రామ్ వెళ్తాడు. ఇంతలో మిథున వస్తుంది. మిథునని చూసిన గౌతమ్ అప్పుడు నిశ్చితార్థం ఆగకపోయి ఉంటే నేను మిథున వ్రతం చేసేవాళ్లం అనుకుంటాడు. దాంతో రేఖ గౌతమ్ పొట్ట మీద ఒక్కటిచ్చి నీ మనసులో ఏం ఉందో నాకు తెలుసు అంటుంది. ఇక చలపతి మిథునతో ఇలాగే వ్రతం చేస్తావా నువ్వు వచ్చింది వ్రతానికా పబ్‌కా ఆ డ్రస్ ఏంటి అంటాడు. మహాలక్ష్మీ గదిలో పట్టు చీర ఉంది కట్టుకొని రమ్మని చెప్తుంది.
రామ్ రెడీ అయి వస్తుంటే మిథున అడ్డు పడుతుంది. హాయ్ చెప్పి రామ్ ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఏంటి నాకు దూరం పెట్టమని సీత చెప్పిందా అని అడుగుతుంది. దానికి రామ్ నాకు నీకు దగ్గర అవ్వాలి అని లేదు అంటాడు. మనం భార్యాభర్తలం ఇంకా మన మధ్య దూరం ఏంటి అని అంటుంది. ఇక రామ్ ఈ డ్రస్‌లోనే వ్రతంలో కూర్చొంటావా అని అంటాడు. కాదు ఇది సెట్ అవ్వదని వేరే చీర కట్టుకోమని మహాలక్ష్మీ చెప్పారని అంటుంది. వ్రతం అని పలకడం రాదు వ్రతానికి ఎలా ఉండాలో తెలీదు నీకు వ్రతం కావాలా అని అడుగుతుంది. ఇద్దరూ పోట్లాడుకుంటారు.
మిథున చీర కట్టుకొని వస్తే రామ్ సీతని చూసినట్లు అలా చూస్తూ ఉండిపోతాడు. మహాలక్ష్మీ వాళ్లు చూసి రాజసం ఉట్టి పడుతుందని అంటారు. అందరూ మిథునని పొగుడుతారు. రామ్‌తో నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. దాంతో రామ్ అచ్చం సీతలా ఉన్నావు అంటాడు. అందరూ తను సీత కాదు మిథున అని అంటారు. ఇక మిథున ఒక్కసారిగా సీతలా ఏంటి మామ నేను సీతనే అంటుంది. అందరి ఫ్యూజ్‌లు అవుట్ అయిపోతాయి. నువ్వు సీతవా అని నోరెళ్ల పెడతారు. ఏం డౌటా అని సీత కళ్లద్దాలు పళ్ల క్లిప్ పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!