Seethe Ramudi Katnam Serial Today Episode సీత కొంగులో బాంబ్ పట్టుకొని మహాలక్ష్మీ ఇంటికి కొంగు తిప్పుకుంటూ వస్తుంది. మహాలక్ష్మీ వాళ్లతో మాట్లాడి సెటైర్లు వేసి తన ముత్యాలహారం తీసుకెళ్లడానికి వచ్చానని రామ్ దగ్గరకు వెళ్తుంది. మహాలక్ష్మీ సీత సంగతి తేల్చుతా అంటే సాంబ వచ్చి సీత కొంగులో బాంబ్ ఉంది. మీరు ఏమైనా తేడా చేస్తే పేల్చేస్తా అని అంటోందని చెప్పి మహాలక్ష్మీని ఆపుతాడు.
సీత రామ్ గదిలోకి వెళ్తుంది. అక్కడ రామ్ ముందు తగుతూ ఉంటాడు. సీత, రామ్‌ల పెళ్లి ఫొటో చూస్తూ మాట్లాడుతాడు. సీత వెళ్లి రామ్ ఎదురుగా నిల్చొంటుంది. మత్తులో ఉన్నా రామ్ఎందుకు సీత ఇలా కలలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడతావ్ నువ్వు నాకు వద్దు అని చెప్పి ఇంట్లో నుంచి తరిమేశాను కాదా అయినా ఎందుకు నా వెంటపడతావని బాధ పడతాడు. నా కళ్లు ముందు నుంచి వెళ్లిపో అని అంటాడు. రామ్ పడిపోబోతే సీత పట్టుకుంటుంది. సీత నిజంగానే వచ్చిందని అనుకుంటాడు. ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. మన ప్రేమకు గుర్తుగా ఉన్న ముత్యాల హారం కోసం వచ్చాను మామ అని బీరువాలో ముత్యాల హారం తీసుకుంటుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన మనం ఇలా నీ వల్ల విడిపోయాం అని రామ్ అంటాడు. దానికి సీత నువ్వు అబద్ధంలో ఉన్నావ్ నా వైపు వస్తే నిజం తెలుస్తుందని అంటుంది. సీత తన చేతితో రామ్‌కి వడ్డిస్తా అంటే రామ్ వద్దని అంటాడు. ఇక రామ్‌ని తీసుకొని సీత కిందకి వస్తుంది. చలపతి, గిరిలు మళ్లీ ఎందుకు వచ్చావ్ అని సీతని అడుగుతారు. మాకు ఇంకా విడాకులు లేవు కదా అని సీత అంటుంది.
సీత చేతిలో బాంబ్ ఉందని మహా అర్చనలు ఏం అనరు. నా మామ తిన్నాడా లేదా అని ఒక్కరైనా అడుగుతున్నారా.. శ్రీరాముడి లాంటి నా మామని తాగుబోతుని చేశారని అంటుంది. మామని పట్టించుకోరని మామయ్య మీద అరుస్తుంది. ఇక మహాలక్ష్మీ సీతని వెళ్లిపోమని అంటే నా మామ తినలేదు భోజనం పెట్టి వెళ్లా అని రామ్‌ని డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. నువ్వు తినకపోతే నేను వెళ్లను అని సీత అంటే మహాలక్ష్మీ, అర్చనలు త్వరగా ఓ నాలుగు ముద్దలు తినేయ్ రామ్ వెళ్లిపోతుందని అంటారు. నా మీద కోపంతో తినమంటున్నారు కానీ మామ మీద ప్రేమతో తినమనడం లేదని అంటుంది. ఇక అందరితో నేను వెళ్తున్నా అని హ్యాపీగా ఫీలవకండి నా మనసు మొత్తం మామ చుట్టూనే తిరుగుతుందని అంటుంది.
సీత వెళ్తుంటే రామ్ వెనకాలే వెళ్లి సీత ఇలా రా అని పిలుస్తాడు. సీత చాలా సంతోషంతో రామ్ దగ్గరకు పరుగులు తీస్తుంది. ఇలా పదే పదే మా ఇంటికి రావొద్దు.. నాకు నన్ను ఇక్కడ చూడటం ఇష్టం లేదు సీత.. నన్ను నేను పట్టించుకోను నాకు ఎవరి అవసరం లేదు నీ అవసరం కూడా లేదు అని చెప్తాడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్లీ మాఇంటికి రావొద్దు అని వెళ్లిపోమని సీతతో చెప్తాడు. సీత చాలా బాధ పడుతుంది. మహాలక్ష్మీ, అర్చన, గిరిలు నవ్వుతారు. దాంతో సీత తన కొంగుకున్న తాడు బాంబ్ తీసి పడేస్తుంది. ముగ్గురు పరుగున వెళ్లి దాక్కుంటారు. బాంబ్ పేలలేదు ఏంటి సీతమ్మా అని సాంబ అడిగితే అది బాంబ్ కాదు సాంబన్న బీట్ రూట్ దుంప అని అంటుంది. మహాలక్ష్మీ రేవతికి కాల్ చేస్తుంది. సీతని మీ ఇంట్లో పెట్టుకొని మా ఇంటికి యుద్దానికి పంపుతున్నారా అని అడుగుతుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!