Seethe Ramudi Katnam Serial Today Episode సీత, శివకృష్ణ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి గతంతో సుమతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తారు. ఆ ఆకతాయి గౌతమ్‌ అని సీత ఫొటో చూసి గుర్తు పడుతుంది. వీడు మహాలక్ష్మీ అత్తయ్య అక్క కొడుకు గౌతమ్‌ అని మా ఇంట్లోనే ఉన్నాడని సీత చెప్తుంది. సుమతి అత్తయ్య హత్యతో వాడికి సంబంధం ఉంటుందని వెళ్లి నిలదీయాలని సీత చెప్తుంది. ఇద్దరూ గౌతమ్‌ని నిలదీయడానికి మహాలక్ష్మీ ఇంటికి బయల్దేరుతారు.


గౌతమ్‌ ఇంట్లో సోఫాలో కూర్చొని రిలాక్స్‌గా ఫోన్ చేస్తుంటాడు. సీత డోర్ తన్నుకొని ఇంట్లోకి వెళ్తుంది. కొంగులోనే తన వెంట తీసుకొచ్చిన గన్ దాచిపెడుతుంది. గౌతమ్ కాలర్ పట్టుకొని మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేయించింది నువ్వే అని తెలిసింది అది మనసులో పెట్టుకొనే మా అత్తమ్మని చంపుంటావ్ మర్యాదగా నిజం ఒప్పుకో అని సీత గన్ గురి పెడుతుంది. గౌతమ్‌తో పాటు శివకృష్ణ కూడా గన్‌ చూసి షాక్ అయిపోతాడు.. 


శివకృష్ణ: సీత నా గన్ ఎందుకు తీసుకొచ్చావ్.
సీత: సారీ నాన్న ఈ రోజు వీడు నిజం చెప్పాలి. అని గౌతమ్ పరిగెడితే సర్వీస్ గన్‌తో గౌతమ్‌ వైపు గన్ పేల్చుతుంది. గౌతమ్ గుండె మీద కాలు చెప్తావా చస్తావా అని అడుతుంది.
రామ్: సీత ఏం చేస్తున్నావ్.
సీత: అత్తమ్మని చంపింది వీడే మామ. 
గౌతమ్: నాకు ఏం సంబంధం లేదు.
సీత: నువ్వే చంపావ్ నిజం చెప్పకపోతే నా చేతిలో చస్తావ్. శివకృష్ణ సీత దగ్గర గన్ తీసుకుంటాడు.
మహాలక్ష్మీ: ఏ ఆధారాలతో గౌతమ్ మీద నింద వేస్తున్నావ్ సీత.
సీత: ఈవ్ టీజింగ్ పేరుతో అత్తమ్మ వీడిని అరెస్ట్ చేయించింది. ఆ కక్షతోనే చంపేశాడు.
గౌతమ్: నేను ఎవరినీ చంపలేదు నా మీద ఏ కేసు లేదు.
మహాలక్ష్మీ: ఇదో కట్ట కథా సీత.
సీత: వీడు ముంబయి నుంచి రాలేదు వీడు ఇక్కడే ఉన్నాడు. 
రామ్: ఏ ఆధారంతో చెప్తున్నావ్ సీత.


సీత కానిస్టేబుల్‌ని పిలిచి మీ ఫోన్‌లో ఉన్న ఫొటో చూపించు అంటే ఏ ఫొటో గౌతమ్ ఎవరు అని నందకిషోర్ మాట మార్చేస్తాడు. సీత, శివకృష్ణ షాక్ అయిపోతారు. ఇక సీఐ త్రిలోక్ వచ్చి శివకృష్ణ మీద సీరియస్ అవుతాడు. నా స్టేషన్‌కి వచ్చి నా కానిస్టేబుల్‌ని బెదిరించావెందుకు అని అడుగుతాడు. దాంతో కానిస్టేబుల్ గౌతమే సుమతిని చంపమన్నారని మాట మార్చేస్తాడు. గౌతమ్‌కి ఏం సంబంధం లేదని చెప్పి త్రిలోక్ వాళ్లు వెళ్లిపోతారు. నేను వాడు ఒకటి కాదని అర్థమైందా అనవసరంగా నా మీద నింద వేశారని గౌతమ్ అంటాడు. సీత గౌతమే చంపాడని అనడంతో రామ్ సీతని తిడతాడు. ఇంటి నుంచి పంపినా బుద్ధి రాలేదని తిడతాడు. దానికి శివకృష్ణ నీ ఫ్యామిలీకే బుద్ధి లేదని అంటాడు. మహాలక్ష్మీ అర్చన గిరిలు శివ మీద కోప్పడతారు. గౌతమ్ మీద అనుమానం ఉందని అప్పటి వరకు ఇంటికి వస్తూనే ఉంటానని చెప్పి సీత వెళ్లిపోతుంది. 


కానిస్టేబుల్ మాట ఎందుకు మార్చాడని సీత తండ్రితో అంటుంది. ఈ కేసుని అంత తేలికగా వదలని శివకృష్ణ అంటాడు. మహాలక్ష్మీ అత్తయ్య సాక్ష్యాలు తారు మారు చేస్తుందని అంటుంది. ఇక సీత దగ్గరకు రేవతి వచ్చి సీతని తనతో పాటు ఇంటికి రమ్మని చెప్తుంది. శివకృష్ణ కూడా సరే అని చెప్తాడు. దాంతో సీత రేవతితో వెళ్తుంది. గౌతమ్, మహాలక్ష్మీ మాట్లాడుకుంటారు. సీతకి ఎంత ధైర్యం దానికి జాతర చేస్తారు అని అంటే నీ జాతరకు పాతర వేయ్ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు అని మహాలక్ష్మీ అంటుంది. త్రిలోక్ మహాలక్ష్మీకి కాల్ చేసి గౌతమ్‌ని కాపాడాను డబ్బు ఇవ్వమని అంటాడు. మహాలక్ష్మీ సరే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాని ఓ ఆట ఆడుకున్న మిధున.. వీడియో చూసి బిత్తరపోయిన జడ్జి