Meghasandesam Serial Today Episode :  రోడ్డు మీద ఇందు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో చెర్రి, గగన్‌ అక్కడకు వస్తారు. ఏమైందని అడుగుతారు. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతారు. దీంతో ఇందు ఏడుస్తూనే.. కట్నం ఇస్తానని ఇవ్వని అపూర్వ గురించి.. ఇంట్లో అత్తామామలు కట్నం తీసుకురాకపోతే ఇంటికి రావొద్దన్నారని చెప్తుంది. అందుకే చనిపోవాలని ఇక్కడకు వచ్చాను అంటుంది.

గగన్‌: ఊరుకో ఇందు నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు.  నీకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. మేము కూడా నీ కష్టాన్ని తీర్చలేనంత పెద్ద కష్టం అయినప్పుడు నువ్విలా చెప్పాలి.

చెర్రి: అవును ఇందు సరేలే అయిందేదో అయింది. పద ఇంటికి వెళ్దాం.

ఇందు: నేను రాను చెర్రి నాకు అపూర్వ అత్తయ్య మీద నమ్మకం పోయిందని..

చెర్రి: అయ్యో ఇందు నేను వెళ్దాం అన్నది. మన ఇంటికి కాదు. మీ అత్తయ్య ఇంటికి..

ఇందు: వద్దురా వెళ్లినా వాళ్లు రానివ్వరు. డబ్బు దగ్గర మహా కరాకండి మనుషులు.

చెర్రి: నేను చూసుకుంటానమ్మా.. నేను మాట్లాడతాను అంటున్నాను కదా..? వాళ్లకు సర్ది చెప్పి కట్నం ఇప్పించే బాధ్యత నాది పద

అని ఇందును తీసుకుని గగన్‌, చెర్రి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు భూమి ఏడుస్తూ చూస్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఎవరు మమ్మల్ని రమ్మని పిలిచారు అని అడుగుతారు.

నక్షత్ర: నేనే ఎస్సై గారు. ఇదిగో ఈ భూమి మా మమ్మీని ఈ పాయిజన్‌ పెట్టి చంపాలని చూసింది. అర్జెంట్‌గా దీన్ని అరెస్ట్‌ చేయండి.

ఎస్సై: అరెస్ట్‌ వరకు ఓకే తప్పకుండా చేస్తాము. మీరు అనవసరంగా ఈ బాటిల్‌ను టచ్‌ చేశారు. అటెప్ట్‌ మర్డర్‌ కేసులో ఇలాంటి ఫ్రూప్స్‌ చాలా అవసరం. మీరు కాకుండా మరెవరైనా టచ్‌ చేశారా..?

సుజాత: నేను టచ్‌ చేశాను కదా..? దొరికితే నేను బలైపోతాను

అని మనసులో అనుకుంటుంది. వెంటనే వెళ్లి ఆ బాటిల్‌ సుజాత పట్టుకుంటుంది. ఎస్సై తిడతాడు.

ఎస్సై : అబ్బా టచ్‌ చేయకూడదని చెప్తున్నాను కదండి. ఇటివ్వండి..

సుజాత: ఓ అలా చెప్పారా..? అర్థం కాలేదు.

ఎస్సై: ఇప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. కానీ మీరు స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్‌ ఇవ్వాలి.

అపూర్వ: తప్పకుండా ఇస్తాము ఎస్సై గారు. అబ్బా ఈ శని దాని ముఖం చూడలేకపోతున్నాను. ముందైతే దీన్ని ఇక్కడి నుంచి ఈడ్చుకు వెళ్లండి.

ఎస్సై: పదండి..

మీరా: నువ్వు మంచిదానికి అనుకున్నాను భూమి. ఇంతకు తెగిస్తావు అనుకోలేదు.

సుజాత: ఏంటో అలా చూస్తున్నావు. అందరినీ అలా మార్చి మార్చి చూస్తూ.. ఇక ఏప్రిల్‌, మే కూడా వచ్చేస్తాయి. ఇంకా అలా చూస్తున్నారేంటి ఎస్సై గారు. తీసుకెళ్లండి..

ఎస్సై: పదమ్మా..?

భూమి: ఒక్క నిమిషం ఎస్సై గారు.. నాన్నా నింద పడి ఇలా నేను జైలుకు వెళ్లడం కన్నా ఇక్కడే చనిపోవడం బెటర్‌. ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వమని ఎస్సై గారికి చెప్పండి నాన్నా..  

 అని అడుగుతుంది. దీంతో శరత్‌ చంద్ర సరేనంటాడు. ఎస్సైని పది నిమిషాలు టైం ఇవ్వండి మళ్లీ మేము ఫోన్‌ చేసినప్పుడు రండి  అని చెప్తాడు. సరేనని ఎస్సై వెళ్లిపోతాడు. అయితే తనకు కొంచెం టైం కావాలని భూమి గగన్‌ ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ కాలు జారి కింద పడబోతుంటే గగన్‌ వచ్చి పట్టుకుంటాడు. షూస్‌ కొత్తగా వేసుకున్నావా..? అని అడుగుతాడు. కాస్త అటూ ఇటూ నడిస్తే అలవాటై పోతుందని చెప్తాడు గగన్‌. అయితే భయంగా ఉందని భూమి చెప్పగానే.. గగన్‌ తన చేత్తో భూమిని పట్టుకుని నడిపిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!