Seethe Ramudi Katnam Serial Today March 28th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అర్చనకు సగం ఆస్తి ఇప్పిస్తున్న మహా.. రామ్‌ని ముంచే ప్లానేనా.. రామ్‌ని గౌతమ్ చంపేస్తాడా!

Seethe Ramudi Katnam Today Episode మిధునకు తనకు రామ్ అడ్డంగా ఉన్నాడని అనుకున్న గౌతమ్ హోళీ వేడుకలో రామ్‌ని చంపేయాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్‌ని చూసి మహాలక్ష్మీ సైగ చేయడంతో అర్చన హాల్‌లో కూర్చొని ఏడుపు మొదలెడుతుంది. అందరూ ఏమైందని అడుగుతారు. రామ్ కూడా ఏమైందని అడుగుతాడు. ఉష ఫోన్ చేసి డబ్బు అడిగిందని లేవని అర్చన ఏడుస్తుంది. 

Continues below advertisement

జనార్థన్: ఉషకి కాల్ చేయ్ రామ్ ఎంత కావాలో ఇవ్వు.
మహాలక్ష్మీ: వద్దు రామ్. ఇది ఒక్క రోజుతో పోయే సమస్య కాదు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూడాలి. అందరం కలిసి ఉండటానికి ఓకే కానీ గిరి అర్చనలకు తమ సొంత సంపాదన ఏం లేదు. ఖర్చులకు డబ్బు కావాలి అంటే నన్నో రామ్‌నో అడగాలి. తమకు సొంత ఆస్తి లేదని అర్చన బాధ పడుతుంది. 
రామ్: బాధ ఏంటి పిన్ని అంత మన ఆస్తినే కదా
జనార్థన్: బీరువాలో డబ్బు ఉందిగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకో అర్చన. గిరి ఆఫీస్‌లో కూడా తీసుకో.
మహాలక్ష్మీ: అంటే జనా ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు కదా వాళ్లకి కూడా సొంతంగా ఉంటే బెటర్.
గిరి: అంటే ఆస్తి పంపకాలు చేయాలి అంటున్నావా వదినా. అందుకు నేను ఒప్పుకోను. అయినా ఈ ఆస్తిలో మేం సంపాదించింది ఏం ఉంది అంతా మీ కష్టార్జితంమే కదా.  
మహాలక్ష్మీ: ఆస్తి పంచమని నేనే చెప్పడం లేదు మీకంటూ ఓ ఇన్‌కమ్ ఉంటే బాగున్ను అని అర్చన ఫీలవుతుంది. 
రామ్: దాని కోసం మీరు ఏం చెప్పినా నేను ఒకే అంటాను పిన్ని. 
మహాలక్ష్మీ: నీకు అభ్యంతరం లేకపోతే అర్చన, గిరిలకు కొన్ని షేర్లు ఇవ్వు రామ్. అప్పుడు వాళ్లకి ఇన్‌కమ్ వస్తుంది.
రామ్: నాకు నాన్న ఎంతో గిరి బాబాయ్ అంతే మీరు ఎంతో పిన్ని అంతే వాళ్లు బాధ పడటం నాకు ఇష్టం లేదు. నా షేర్స్‌లో 50 శాతం ఇస్తాను.
మహాలక్ష్మీ: నా షేర్స్‌లో ఇద్దాం రామ్.
రామ్: ఎవరి అయినా ఒకటే కదా పిన్ని. వెంటనే మన ఆడిటర్స్‌తో మాట్లాడి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. 
గౌతమ్: ఆడ పిల్ల పేరు చెప్పి ఆస్తి కొట్టేస్తున్నారు. నేను ఎంతో కొంత కొట్టేయాలి. 

హోళీ సందర్భంగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటూ పంపకాలు చేద్దామని అనుకుంటారు. ఇక మిధునని కూడా పిలుద్దామని అనుకుంటారు. గౌతమ్ మిధునకు ఫోన్ చేయమని కంగారు పెడతాడు. మహాలక్ష్మీ మిధునకు కాల్ చేస్తుంది. సీత చూసి అత్తయ్య కాల్ చేసింది ఏంటి అని అనుకుంటుంది. కాల్ లిఫ్ట్ చేసి మ్యాటర్ ఏంటి అని అడుగుతుంది. హోళీ సంబరాలకు మహాలక్ష్మీ పిలుస్తుంది. ఒకే వస్తాను అని సీత అలియాస్ మిధున చెప్తుంది. గతంలో సీత రామ్‌తో గడిపిన హోళీ సంబరాలు గుర్తు చేసుకుంటుంది. రేవతి, కిరణ్‌లకు విషయం చెప్తుంది. మిధునలా వెళ్లి సీతలా ఎంజాయ్ చేయమని చెప్తారు. 

గౌతమ్ తనకు మిధునకు మధ్యలో రామ్ అడ్డంగా ఉన్నాడని రామ్‌ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు. హోళీ రంగుల్లో ఎవరు ఏం చేస్తారో ఎవరీకీ తెలీదని ఆ టైంలో రామ్‌ని పొడిచేస్తా అని అనుకుంటాడు. రామ్‌ని చంపేస్తే అడ్డు ఉండదు అని ఆస్తికి తానే ఏకైక వారసుడిని అవుతానని అనుకుంటాడు. హోళీ కోసం సీతకు కిరణ్, రేవతిలు కొత్త బట్టలు కొనిస్తారు. ఇంతలో రామ్ అటుగా రావడంతో మిధున దాక్కుంటుంది. సీతని ఎక్కువ టైం దూరం పెట్టొద్దని సీత గురించి ఆలోచించు అని అంటే దానికి రామ్ సీత పిన్ని విషయంలో పెద్ద తప్పు చేసిందని అంటాడు. ఇక రామ్ అర్చనకు తన షేర్స్‌లో సగం వాటా ఇస్తున్నానని చెప్తాడు. రేవతి వాళ్లు షాక్ అవుతారు. సీత చాటుగా మాటలు వింటుంది. ఏదో స్కెచ్ వేసే షేర్స్ ఇవ్వాలని మహాలక్ష్మీ అత్తయ్య ఆడుకుంటుందని ఏ చిన్న అవకాశం దొరికిన షేర్స్ ఇవ్వకుండా ఆపి మహాలక్ష్మీ అత్తయ్య ప్లాన్ తిప్పి కొడతానని అనుకుంటుంది. హోళీ వేడుకు మొదలవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. రామ్ సీత తన పక్కన లేదని ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!

Continues below advertisement