Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ మహాలక్ష్మీ కొడుకు అని తెలుసుకున్న అర్చన మేడ మీదకు వెళ్లి మహాలక్ష్మీకి కాల్ చేసి రమ్మని చెప్తుంది. ఇక నుంచి తానే ఇంటి పెత్తనం చేస్తానని తాను వేసే ఆర్డర్లు ఫాలో అవ్వాలని మహాలక్ష్మీ చెప్తుంది. మహాలక్ష్మీ కెపాసిటీ తెలీకుండా ఇష్టం వచ్చినట్లు వార్నింగ్‌లు ఇచ్చేస్తుంది.
అర్చన: నువ్వు కిడ్నాప్‌లు చేయిస్తావని తెలుసు. మర్డర్స్ చేయిస్తావని తెలుసు. నువ్వు సామాన్యురాలివి కాదని కూడా తెలుసు. నీతో పెట్టుకుంటే ఎవరి జీవితాలు అయినా తల్లకిందులవుతాయని కూడా నాకు తెలుసు. అయినా నేను నీతోనే ఢీ కొట్టబోతున్నా. ఇక నుంచి నేను నెంబరు 1 నువ్వు నెంబరు 2. కాదు కూడదు అన్నావంటే నీ అంతు చూస్తా. మహాలక్ష్మీ: పిచ్చేమైనా పట్టిందా.అర్చన: లేదు మహా నీ భయంకరమైన నిజం తెలిసింది. గౌతమ్ నీ కొడుకు అని నాకు తెలిసిపోయింది మహా. నీకు ముందే పెళ్లి అయినా కూడా ఆస్తి కోసం జనార్థన్ బావని మోసం చేశావు. నీకు పెళ్లి అయిపోయిందని నీకు కొడుకు ఉన్నాడని దాచావు. రామ్ ప్రీతిల కోసం నీకు సొంత పిల్లలు వద్దు అని నాటకం ఆడావు. ఆస్తి కోసం బాగానే నాటకం ఆడావు. ఈ నిజం నేను అందరికీ చెప్తే నీ గతి మళ్లీ రోడ్డు పాలే కదా. నిన్ను గౌతమ్‌ని గెంటేస్తారు కదా. మహాలక్ష్మీ: నా సంగతి అటు ఉంచు నిజం చెప్తే నీ పరిస్థితి ఏంటి. నీకు జాతర అయిపోతుంది. సుమతికి పట్టిన గతే నీకు పడుతుంది. నా కొడుకు గౌతమ్ నిన్ను చంపేస్తాడు. సుమతిని చంపింది వాడే. నీలా నిజం తెలుసుకున్నందుకే వాడు సుమతిని చంపేశాడు. సుమతిని చంపింది వాడేమో అని డౌట్ పడినందుకు సీతని చంపబోయాడు. నువ్వు నిజం బయట పెడితే నీకు జాతర చేస్తాడు.అర్చన: వద్దు మహా నేను ఎవరికీ చెప్పను నాకు నిజం తెలిసిందని గౌతమ్‌కి చెప్పకు.
మహాలక్ష్మీ అర్చనకు చెక్ పెట్టేస్తుంది. రామ్ మిధున (సీత)ని తీసుకొని బయటకు వెళ్తాడు. మిధున దాహంగా ఉందని నీరు అడుగుతుంది. రామ్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. మామని ఆటపట్టిస్తుంటే చాలా బాగుందని ఈ మిధునని భరించలేకపోతున్నాడని చాలా సంతోషంగా ఉందని మిధున అనుకుంటుంది. ఇంతలో అక్కడికి పుల్ల ఐస్ వస్తుంది. సీతకు నోరు ఊరుతుందే అని మిధున సీతలా బిహేవ్ చేసి వెళ్తుంది. అస్సలు ఆగలేను అనుకొని మిధున గెటప్లో ఉన్నా సరే తినేయాలి అని పరుగులు తీస్తుంది. రెండు ఐస్‌క్రీమ్‌లు తీసుకొని లాగించేస్తుంది. రామ్ ఫోన్ మాట్లాడటం చూసి వచ్చేలోపు తినేయాలి అనుకుంటుంది. ఇంతలో అక్కడికి త్రిలోక్ వస్తాడు. అమెరికా మిధున ఏంటి ఛీప్‌గా పల్లెటూరి సీతలా పుల్ల ఐస్ తింటుందని అనుకొని వెళ్తాడు.
సీత సీత అని పిలుస్తాడు. సీత కావాలనే చూడదు. మిధున అని పిలుస్తాడు. వెంటనే సీత ఎస్ అంటూ మిధున త్రిలోక్ వైపు తిరుగుతుంది. రామ్ అక్కడికి వచ్చి సీతకి పుల్లఐస్ అంటే ఇష్టం అని మొదటి పరిచయంలో కూడా సీత తినిపించిందని అంటాడు. నాకు అదే అనుమానంగా ఉందని త్రిలోక్ అంటే సీత మాత్రమే తినాలా నేను తినకూడదా అని మిధున ప్రశ్నిస్తుంది. సంథింగ్ సంథింగ్ అనుకొని త్రిలోక్ అంటాడు. వెంటనే మహాలక్ష్మీకి కాల్ చేసి మిధున పుల్లైస్ తింటుందని పక్కనే రామ్ ఉన్నాడని చెప్తాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. అది మిధున కాదు సీత అని మీకు అనుమానమా అంటే అవును అంటాడు. మహాలక్ష్మీ మాటలు గౌతమ్ వింటాడు. మిధునతో రామ్ బయటకు వెళ్లాడా.. ఇద్దరూ ఐస్‌క్రీమ్ తినడం ఏంటి.. నా లవర్‌తో వాడికి పని ఏంటి అని అరుస్తాడు. మహాలక్ష్మీ కవర్ చేస్తే మిధున నాకే సొంతం అవ్వాలి అని అంటాడు. రామ్ మనసులో అలాంటి ఉద్దేశం ఉండదు అని మహాలక్ష్మీ చెప్తుంది. రామ్ నీకు అడ్డు కాదు మిధున నీకే సొంతం అని అంటుంది. గౌతమ్ మీద ఒట్టేసి మిధునని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. రామ్ ఇంటికి రావడంతో అర్చనకు డ్రామా మొదలు పెట్టమని మహాలక్ష్మీ అనడంతో అర్చన ఏడుస్తుంది. రామ్ ఏమైందని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!