Seethe Ramudi Katnam Serial Today Episode : సీత ఇచ్చిన లెటర్‌ చూసి సీఐ షాక్‌కు గరవుతాడు. గౌతమ్ వేలిముద్రలు కూడా ఇవ్వాలని సీఐ ఆదేశిస్తాడు. 
 
సీత: సీఐగారూ మీరు చెప్పకపోయినా  గౌతమ్ వేలిముద్రలు ఇచ్చి తీరాలి
సీఐ: నువ్వేమైనా పెదరాయుడమ్మవా...తీర్పులు ఇస్తున్నావ్.....గౌతమ్ ఇంకా చూస్తున్నవేంటి వేలిముద్రలు ఇవ్వు
మహాలక్ష్మీ: గౌతమ్ వేలిముద్రలు ఇవ్వకుండా ఈ సీఐ వచ్చి ఆపుతాడనుకుంటే...తనే ఇవ్వమనిచెబుతున్నాడేంటి..?
 
ఇంతలోనే సీఐ ఆదేశాలతో ఫోరెన్సిక్ నిపుణులకు గౌతమ్ వేలిముద్రలు ఇస్తాడు..అప్పుడు మహాలక్ష్మీకి ముఖర్జి ఫోన్ చేస్తాడు.మా అమ్మాయి మిథున మీ ఇంటికి బయలుదేరిందని చెబుతాడు.  మిధున దేనికీ అడ్జెస్ట్‌ అవ్వదని..తనని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు. దీంతో మహాలక్ష్మీ కంగారుపడుతుంది. సీత,శివకృష్ణ ఇక్కడే ఉన్నప్పుడు మిధున వచ్చిందంటే సీత ఏం గొడవ చేస్తుందోనని గాబరా పడుతుంది.  పైగా సుమతి విషయం మిధునకు తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుందని మహాలక్ష్మీ కంగారుపడుతుంది. మిధున రాక ముందే సీతను శివకృష్ణను ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటుంది. అందరి వేలిముద్రలు తీసుకున్నారు కాబట్టి అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మహాలక్ష్మీ ఆదేశిస్తుంది. శివకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయినా....సీత అక్కడే ఉండటంతో తనని కూడా అక్కడి నుంచి వెళ్లిపోమని మహాలక్ష్మీ ఆదేశిస్తుంది. సీతను ఇక్కడి నుంచి వెంటనే పంపించేయాలని రామ్‌కు చెప్పడంతో రామ్‌ సీతను  వెళ్లిపోమ్మని ఆదేశిస్తాడు. దీంతో సీత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 
సీఐ కూడా వెళ్లిపోతుండా గేటు వరకు వచ్చిన మహాలక్ష్మీ....సీఐపై గట్టిగా అరుస్తుంది.మీరు వచ్చి గౌతమ్ వేలిముద్రలు తీసుకోకుండా  ఆ శివకృష్ణను ఆపుతారనుకుంటే...మీరే వేలిముద్రలు ఇప్పించారని అడగ్గా....ఎస్పీగారి లెటర్‌ చూసిన తర్వాత నేనేం చేయలేకపోయానని చెబుతాడు.కత్తిమీద ఉన్న వేలిముద్రలు,గౌతమ్ వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి కదా ఇప్పుడు ఏంచేద్దామని మహాలక్ష్మీ సీఐని అడుగుతుంది. సుమతిని పొడిచింది గౌతమే కాబట్టి...ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయంటారు. కాబట్టి గౌతమ్ ఈ కేసు నుంచి తప్పించుకోలేడని సీఐ చెబుతాడు. గౌతమ్‌ను తప్పించడానికి నేనేం చేయలేనని సీఐ చెబుతాడు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో  రిపోర్టు తారుమారు చేద్దామని మహాలక్ష్మీ చెప్పగా....శివకృష్ణ ఉండగా ఇది సాధ్యం కాదని చెబుతాడు. దీంతో మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను...గౌతమ్‌ను కాపాడమని మహాలక్ష్మీ సీఐని వేడుకుంటుంది. దీనికి సీఐ అంగీకరించడు..డబ్బుతో అన్ని పనులు చేయలేమని చెబుతాడు. గౌతమ్ తన కన్నకొడుకని...వాడికి శిక్షపడితే తన జీవితం వ్యర్థమని మహాలక్ష్మీ చెబుతుంది. తాను కష్టపడి సంపాధించిన ఈ ఆస్తి మొత్తం ఏం చేసుకోను అంటుంది.  మరోసారి ప్రాధేయపడుతుంది. తనకు చేతనైన సాయం చేస్తానన్న సీఐ....సుమతిని గౌతమ్‌ చంపాడాని రామ్‌కుగానీ, సీతకు గానీ తెలిస్తే గౌతమ్‌ను బ్రతకనివ్వరని హెచ్చరిస్తాడు. నీ భర్త జనార్దన్‌కు  తెలిసినా ప్రమాదమేనని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
 
సుమతిని చంపడంతోపాటు తనపైనా హత్యాయత్నం చేసింది గౌతమేనన్న అనుమానం ఉందని సీత వాళ్ల నాన్న శివకృష్ణకు చెబుతుంది. వేలిముద్రలు అడిగితే గౌతమ్, మహాలక్ష్మీ ఒకటే కంగారు పడ్డారని శివకృష్ణ కూడా అంటాడు.  గౌతమ్‌ వేలిముద్రలు తీసుకోకుండా ఉండేందుకే సీఐని మహాలక్ష్మీ పిలిపించిందని సీత అనగా...అదే నిజమని శివకృష్ణ చెబుతాడు. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే అసలు దొంగలు దొరుకుతారని..అప్పుడు రామ్‌ తన గురించి ఆలోచిస్తాడని సీత వాళ్ల నాన్నకు చెబుతుంది. నీకోసమే ఈ కేసు పర్సనల్‌గా తీసుకున్నానని శివకృష్ణ చెబుతాడు. ముఖర్జి నుంచి మహాలక్ష్మీకి ఫోన్ కాల్‌ వచ్చింది కాబట్టి మిధున గెటప్‌లో వెళ్లి ఒక ఆట ఆడుకోవాలని సీత అనుకుంటుంది. తనకు అర్జెంట్  పని ఉందని మీరు వెళ్లిపోవాలని వాళ్ల నాన్నను సీత పంపించివేస్తుంది.
 
మహాలక్ష్మీ వెళ్లి గౌతమ్‌పై కోప్పడుతుంది...నువ్వు ఇంటికి వచ్చిన నాటి   నుంచి నాకు ప్రతిరోజూ టెన్షన్‌గానే ఉందని అంటుంది. సుమతిని చంపిన కత్తిమీద ఉన్న వేలిముద్రలు నీవేనని తేలితే నీ పరిస్థితి ఏంటని అడుగుతుంది. ఈ టైంలోనే మిధున ఇక్కడికి వస్తోందని కంగారుపడుతూ చెప్పగానే...గౌతమ్ ముఖం వెలిగిపోతుంది. తన ఏంజిల్‌ ఇక్కడికి వస్తుందా అంటూ సంతోషపడతాడు. నేను తనని ఇష్టపడుతున్నానని చెప్పమంటూ మహాలక్ష్మీని కోరతాడు. మా ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పమంటాడు. దీంతో మహాలక్ష్మీకి చిర్రెత్తుకొస్తుంది. నేను నీ వేలిముద్రలు దొరుతాయని కంగారుపడుతుంటే....నువ్వు మిధున వస్తుందని సంతోషపడుతున్నావా అని మండిపడుతుండటంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.