Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode: మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్టు మారిపోయిందంటూ సరియూ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లి గొడవపెట్టుుకుంటుంది. దీంతో వారు   అరవిందకు ఫోన్ చేసి రిపోర్టు మారిపోయిందని....మళ్లీ కొత్త రిపోర్టు పంపుతున్నామని చెబుతారు. ఆ  రిపోర్ట్‌లో మనీషా ప్రెగ్నెంట్ అని వస్తుంది. ఇది విన్న లక్ష్మీసహా అందరూ షాక్‌కు గురవుతారు. గతంలోపంపిన రిపోర్టు వేరేవారిదని...అది పొరపాటున పంపామని డయాగ్నిస్టిక్ సెంటర్‌ వాళ్లు చెప్పారని...ఇప్పుడు పంపిన రిపోర్టులో పాజిటివ్‌ వచ్చిందని అరవింద అందరికీ చెబుతుంది. పేర్లు ఒకేలా ఉండటం వల్ల కన్‌ప్యూజ్ అయ్యారని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా  మనీషా రెచ్చిపోతుంది.నేను మొదటినుంచి చెబుతుంటే  ఎవరూ నా మాట నమ్మడం లేదని...ఇప్పుడు రిపోర్టు చూసిన తర్వాత కూడా నమ్మరా  అంటూ నిలదీస్తుంది.ఎలాగూ  డాక్టర్‌ను పిలిపించారు కదా...ఆమెను టెస్టు చేయమని అడుగుతుంది. మనీషాను  పరీక్షించిన  డాక్టర్‌...ఆమె గర్భవతేనని తేల్చి చెబుతుుంది. దీంతో  మనీషా ముఖంలో ఆనందం తాండవిస్తుంటే....లక్ష్మీ మాత్రం గాబరాపడుతుంది. అందరినీ మళ్లీ బోల్తా కొట్టించామని  మనీషా సంబరపడిపోతుంది. ఇప్పటికైనా మనమధ్య ఏం జరగలేదంటావా అని మనీషా మిత్రాని నిలదీస్తుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఇప్పుడేమంటావు అని ప్రశ్నించగా....ఇప్పటికీ  తాను నమ్మనని లక్ష్మీ అంటుంది. మిత్ర తప్పు చేశారన్నది అబద్దమని....నీ ప్రెగ్నెన్సీ కూడా అబద్దమేనని కొట్టిపారేస్తుంది. ఇంతలో అడ్డుతగిలిన అరవింద....లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.నీ మాటలు నమ్మి మిత్ర బిడ్డను కడుపులో మోస్తున్న మనీషా మీద చేయిచేసుకున్నానని మండిపడుతుంది.

 

తనని ఇంట్లోనుంచి పంపించపోయాయనని అంటుంది. అప్పుడు మనీషా సమదాయిస్తున్నట్లు  నటించి...నన్ను అడిగితే నేనే టెస్టు చేయించుకునేదానిని కదా...దొంగచాటుగా ఎందుకు చేయించారని అడుగుతుంది. దీంతో అరవింద మనీషాకు  సారీ చెబుతుంది. ఇంటి కోడలివైన నిన్ను ఇంటి నుంచి వెళ్లిపోమ్మని అవమానించానని...మళ్లీ అలాంటి తప్పు చేయనని చెబుతుంది.ఇకపై ఇంట్లో మనీషా  ప్రెగ్నెన్సీ గురించి ఎవరూ మాట్లడటానికి వీళ్లేదని...తను మిత్ర భార్య, ఈ ఇంటి కోడలంటూ  అరవింద అందరికీ చెబుతుంది. మనీషాను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని...ఎలాంటి చిన్న పొరపాటు  చేసినా క్షమించనని వార్నింగ్ ఇస్తుంది.

 

సరియుకు మనీషా ఫోన్ చేసి సరైన సమయంలో మంచి సాయం చేశావంటూ థ్యాంక్సు చెబుతుంది. అయితే నీ నుంచి నాకు కావాల్సింది థ్యాంక్సుకాదని....క్విడ్‌ ప్రోకో కావాలని అడుగుతుంది. నగలు, డబ్బు ఏం కావాలన్ని ఇస్తా అని అడుగుతుంది.ఇవన్నీ ఏం వద్దని....మిత్రా ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు తెలియజేయాలని చెబుతుంది.ఎందుకు అని అడగ్గా...నువ్వు నన్ను హెల్ఫ్‌ అడిగినప్పుడు నేను నిన్ను ఎందుకు అని అడిగానా కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా అడగొద్దని అంటుుంది. దీంతో మనీషా ఓకే అంటుంది. ఒక నాలుగురోజుల పాటు నువ్వు మిత్ర వెంటే ఉండి అతను ఏ ఫైల్ తయారు చేస్తున్నాడో..అందులో ఏం ఉందో నాకు మొత్తం చెప్పాలని సరియు కోరుతుంది. దీనికి మనీషా ఓకే అంటుంది. దీంతో సరియు పొంగిపోతుంది.అన్నీ అనుకూలంగా జరిగితే  నందన్ ఇండస్ట్రీస్‌ ఆఫ్‌ గ్రూప్‌కు నేనే ఛైర్మన్ అవుతానుంటూ మురిసిపోతుంది.

 

మనీషా గురించి అరవింద అన్న మాటలు తలచుకుని లక్ష్మీ బాధపడుతుంది.మనీషా చేస్తున్న మోసం గురించి అత్తయ్యను ఎలా నమ్మించాలని ఆలోచిస్తుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలని చెప్పేందుకు మిత్రగదిలోకి వెళ్లిన లక్ష్మీకి అక్కడ మిత్ర బాధపడుతుండటం చూసి....మీరు ఏతప్పు చేయలేదని బాధపడొద్దని ఓదార్చుతుంది. నేను నిజాన్ని నిరూపిస్తాని చెబుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని ఓదార్చడంతో ఈ రోజు ఏపీసోడ్ ముగుస్తుంది.